ఇదో ఇంట్రస్టింగ్ ప్రేమకథ | Sumanth Ashwin's Columbus Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఇదో ఇంట్రస్టింగ్ ప్రేమకథ

Published Sat, Oct 17 2015 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

ఇదో ఇంట్రస్టింగ్ ప్రేమకథ

ఇదో ఇంట్రస్టింగ్ ప్రేమకథ

‘‘టైటిల్, ట్రైలర్ చూస్తుంటే వెరీ ఇంట్రస్టింగ్ లవ్ ప్లాట్‌లా అనిపిస్తోంది. ఇలాంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ ఎప్పుడొచ్చినా ఆదరణ ఉంటుంది. సుమంత్ అశ్విన్‌కిది వండర్‌ఫుల్ ఫిల్మ్ అవుతుంది. సినిమా సినిమాకీ అతను బాగా ఎదుగుతున్నాడు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. సుమంత్ అశ్విన్, సీరత్‌కపూర్, మిస్తీ కాంబినేషన్‌లో ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ‘కొలంబస్’ చిత్రం బిగ్ ఆడియో సీడీని శనివారం హైదరాబాద్‌లో వెంకటేశ్ ఆవిష్కరించారు.
 
 నిర్మాతగా అశ్వనీ కుమార్ ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని సీనియర్ దర్శకుడు బి. గోపాల్ ఆకాంక్షించారు. సుమంత్ అశ్విన్ చాలా నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన నటుడని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రశంసించారు. ఈ నెల 22న దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అశ్వనీకుమార్ సహదేవ్ ప్రకటించారు.
 
  అమెరికాను కొలంబస్ కనిపెడితే, తనలాంటి వారిని ఎమ్మెస్ రాజు కనిపెడుతున్నారని దర్శకుడు ఆర్. సామల సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఎగ్జైటింగ్ కథాంశమిదని సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఎమ్మెస్ రాజు, సురేశ్ కపాడియా, దర్శకుడు అడివి సాయికిరణ్, ఛాయాగ్రాహకుడు భాస్కర్ సామల, నాయికలు సీరత్ కపూర్, మిస్తీ, చీఫ్ అసోసియేట్ డెరైక్టర్ ఇంద్రసేనా తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement