centenary celebrations
-
Atal Bihari Vajpayee: చదవని ప్రేమలేఖ
అటల్ బిహారీ వాజ్‌పేయి అవివాహితునిగా మిగిలిపోవడం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. కాలేజీ రోజుల్లోనే ఆయన మనసు దోచిన రాజ్‌కుమారీ హస్కర్ అనే మహిళ దూరమవడంతో పెళ్లి చాప్టర్‌కు దూరమయ్యారు. ఏక్ నిరంజన్‌లా ఉండిపోయారు.ఎవరీ హస్కర్? కశ్మీర్ పండిట్ల కుటుంబానికి రాజ్‌కుమారీ హస్కర్ వాజ్‌పేయికి కాలేజీ రోజుల్లో సహాధ్యాయి. ఇందిరాగాందీకి దూరపు బంధువంటారు. పలు కార్యక్రమాల్లో కలిసి పని చేసే క్రమంలో మొదలైన స్నేహం ప్రేమగా మారింది. కానీ ఎవరూ దాన్ని బయటపెట్టలేదు. వాజ్‌పేయి ఆమెకు ప్రేమలేఖ రాసినా నేరుగా ఇవ్వకుండా గ్రంథాలయంలో ఆమె చదివే అవకాశమున్న ఓ పుస్తకంలో పెట్టారు. అయితే హస్కర్ ఆ పుస్తకాన్ని చదవలేదు. అలా వాజ్‌పేయి ప్రేమలేఖ ఆమెకు అందనే లేదు. రాజకీయాలు చేసే వ్యక్తికి కూతురును ఇవ్వడం హస్కర్ తండ్రికీ ఇష్టం లేకపోయింది. దాంతో బ్రిజ్ నారాయణ్ కౌల్ అనే ప్రొఫెసర్‌తో ఆమె వివాహం జరిగిపోయింది. అలా హస్కర్ శ్రీమతి కౌల్గా మారి వాజ్‌పేయి జీవితం నుంచి అదృశ్యమైంది. వాజ్‌పేయి కూడా ప్రేమ సంగతి మర్చిపోయి క్రియాశీల రాజకీయాల్లో మునిగిపోయారు.16 ఏళ్ల తర్వాత దాదాపు 16 ఏళ్ల తర్వాత వాజ్‌పేయి, శ్రీమతి కౌల్ ఓ కాలేజీ ఫంక్షన్లో అనుకోకుండా పరస్పరం తారసపడ్డారు. ఢిల్లీలో తన భర్త పని చేసే కాలేజీలో కీలకోపన్యాసం సందర్భంగా అక్కడ కౌల్‌ను చూసి వాజ్‌పేయి నిశ్చేషు్టలయ్యారు. తర్వాత కౌల్ దంపతులతో ఆయన అనుబంధం బలపడింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా ఉండగా కౌల్ దంపతులు కూడా తమ కూతురు నమితతో కలిసి ఆయన ఇంటికి మారిపోయారు. దాంతో వారి బంధంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. భావ సారుప్యత ఉన్న కౌల్‌ను వాజ్‌పేయీ పెళ్లాడితే మంచిదని సన్నిహితులు, రాజకీయ నేతలు, ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్పినా ఆయన కొట్టిపారేశారంటారు. ‘‘దీనిపై చర్చ అనవసరం. నేను పెళ్లీడు వయసులో ఉండగా ఆదర్శవంతమైన భార్య కోసం అన్వేషణ మొదలెట్టాను. దొరికినా దురదృష్టవశాత్తు ఆమె తండ్రి తనకు అనువైన ఆదర్శ భర్త కోసం వెతికారు’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయిలోని ఈ కోణాన్ని జాతీయ మీడియా ఎప్పుడూ పతాక శీర్షికలకు ఎక్కించలేదు. కౌల్ కూతురు నమితను వాజ్‌పేయి తన కన్నకూతురిలా చూసుకున్నారు. తర్వాత దత్తత తీసుకున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలను నమిత, ఆమె కూతురు నీహారిక దగ్గరుండి జరిపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనసారా మాట్లాడండయ్యా!
కవితాత్మక ప్రసంగాలతో మంత్రముగ్దుల్ని చేసే చాతుర్యం వాజ్‌పేయికి వెన్నతో పెట్టిన విద్య. తేలికైన పదాలతో బరువైన భావాలను వెల్లడించే మాటలకు ఆయన పెట్టింది పేరు. సాహితీ రంగంలోనూ అటల్ తనదైన ముద్ర వేశారు. హిందూ పురాణాల సారాన్ని నింపుకున్న ఆయన వాక్యాలకు పార్లమెంటులో పార్టీలకు అతీతంగా సభ్యులంతా సలామ్ కొట్టేవారు. ఆయన రాజకీయ ప్రసంగాలు కూడా సాహితీ సౌరభాలు వెదజల్లేవి. తాను అధికారంలో ఉండగా విపక్షాలు చేసే విమర్శలకు హుందాగా, చమత్కారంగా బదులిచ్చేవారు. ‘మనసారా మాట్లాడండయ్యా’ అంటూ తోటివారిని ప్రోత్సహించేవారు.చిరస్మరణీయ ప్రసంగం ప్రజాస్వామ్యంపై వాజ్‌పేయికి ఉన్న అపార నమ్మకం ఆయన దార్శనికతలో తొణికిసలాడేది. తన తొలి ప్రభుత్వం 13 రోజులకే కూలిన సందర్భంలో 1996 మే 27న ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగం మరపురానిది! దాన్ని నాటి పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నేతలు నేటికీ గుర్తు చేసుకుంటారు. ఎమర్జెన్సీ వేళ జైలు జీవితం గడుపుతూ రాసిన కవితలతో ‘ఖైదీ కవి కుండలీ’ అనే కవితా సంకలనం రచించారు. ‘అమరత్వం అగ్ని లాంటిది’, ‘నా 51 కవితలు’ వంటి పలు సంకలనాలు వెలువరించారు. ‘కవిత్వం రాసుకునేంత సమయాన్ని కూడా రాజకీయాలు మిగల్చలేదు. నా కవితా వర్షపుధార రాజకీయ ఎడారిలో ఇంకిపోయింది’ అని ఓసారి వాపోయారు. ధోతీ, కుర్తాలో నిండుగా కనిపించే అటల్ ఖాళీ సమయాల్లో కవితలు రాస్తూ సాహిత్యంతో దోస్తీ చేసేవారు. అవుంటేనే కవిత వాజ్‌పేయి సరదా మనిషి. ‘‘కవిత్వం రాయాలంటే అనువైన వాతావరణముండాలి. మనసు లగ్నం చేయగలగాలి. మనల్ని ఆవిష్కరించుకునే సమయం చిక్కాలి. ఈ రణగొణ ధ్వనుల మధ్య అవెలా సాధ్యం?’’ అన్నారోసారి. కొంతమేర సాహిత్య కృషి చేసినా పెద్దగా రాణించలేదంటూ తెగ బాధపడేవారట. ‘‘కవిత్వంలో నేను చేసింది సున్నా. అసలు రాజకీయాల గడప తొక్కక పోయుంటే హాయిగా కవితలు రాసుకుంటూ, కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ ముషాయిరాల్లో మునిగి తేలుతూ గడిపేవాడిని’’ అంటూ తరచూ అంతర్మథనానికి లోనయ్యేవారు. -
రాజకీయ కవిసార్వభౌముడు
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్‌పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్‌సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్‌పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్‌పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది. ఆదర్శ నాయకుడు 1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్‌పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్‌పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.కీలక సంస్కరణలు మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్‌పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్‌పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్‌పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్‌పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి. ఆ గళం.. అనితరసాధ్యంవాజ్పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్‌గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్‌పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్‌పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్‌పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.సినీ ప్రియుడు వాజ్‌పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్‌టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్‌పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం. ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్‌చంద్ సాహిత్యమన్నా వాజ్‌పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్‌పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్‌పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్‌పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం. అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాంపాలిటిక్స్తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవుస్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది–వాజ్‌పేయి -
లోకం మెచ్చిన నాయకుడు..
ప్రపంచం మెచ్చిన విలక్షణ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న కన్యాకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణా దేవి, కృష్ణ బిహారీ వాజ్‌పేయి. తండ్రి గ్వాలియర్‌లో స్కూల్ టీచర్. తాత శ్యామ్‌లాల్ వాజ్‌పేయి ఉత్తరప్రదేశ్‌లోని బటేశ్వర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని మొరేనాకు వలస వెళ్లారు. తర్వాత మెరుగైన జీవనోపాధి కోసం గ్వాలియర్‌కు చేరారు. అక్కడి సరస్వతి శిశు మందిర్‌లో వాజ్‌పేయి ప్రాథమిక విద్య అభ్యసించారు. గ్వాలియర్ విక్టోరియా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో బీఏ ఉత్తీర్ణులయ్యారు. కాన్పూర్‌లో ఆగ్రా వర్సిటీకి చెందిన డీఏవీ కాలేజీ నుంచి ఎంఏ (పొలిటికల్ సైన్స్) చేశారు.ఆర్య సమాజోద్యమంతో ప్రస్థానం ఆర్య సమాజ ఉద్యమం పట్ల వాజ్‌పేయి చిన్నప్పుడే ఆకర్షితులయ్యారు. గ్వాలియర్‌లో ఆర్య సమాజ ఉద్యమ యువజన విభాగమైన ఆర్యకుమార సభలో చేరారు. 1944లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1939లోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరారు. 16 ఏళ్ల వయసులోనే స్వయం సేవకునిగా చురుకైన పాత్ర పోషించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టై 24 రోజులు జైల్లో ఉన్నారు. 1947లో ఆరెస్సెస్ ప్రచారక్ (పూర్తిస్థాయి కార్యకర్త)గా ఎదిగారు. దేశ విభజన పరిణామాల నేపథ్యంలో న్యాయ విద్యను మధ్యలోనే ఆపేశారు. ఆర్ఎస్ఎస్ పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. కవిగా, రచయితగా, ప్రజానాయకుడిగా రాణించారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగం భారతీయ జన సంఘ్‌లో సభ్యుడిగా చేరారు. దాని అధినేత శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రధాన అనుచరుడిగా ఉత్తరాదిన పార్టీని ముందుకు నడిపారు. 1957 సాధారణ ఎన్నికల్లో బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. పార్లమెంట్లో పలు అంశాలపై ఉర్రూతలూగించేలా ప్రసంగించేవారు. ఆయనపై నెహ్రూ ప్రభావం బాగా ఉండేది. నెహ్రూనూ వాజ్‌పేయి ప్రతిభ ఆకట్టుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం తర్వాత జన సంఘ్ బాధ్యతలను వాజ్‌పేయి స్వీకరించారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడయ్యారు. నానాజీ దేశ్‌ముఖ్, ఎల్.కె.ఆడ్వాణీ వంటి సహచరుల తోడ్పాటుతో పార్టీ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. పదవీ వ్యామోహం లేదు ప్రధాని పదవి పట్ల వాజ్‌పేయికి ఎన్నడూ వ్యామోహం లేదంటారు. 1995 డిసెంబర్లో బీజేపీ భేటీలో ఆడ్వాణీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో సార్టీ గెలిస్తే వాజ్పేయే ప్రధాని అవుతారని ప్రకటించగా ఆయన వారించారు. ఎన్నికల్లో నెగ్గడంపైనే దృష్టి పెట్టాలని, ప్రధాని అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతమని సున్నితంగా హెచ్చరించారు. 1996 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీకి అడుగు దూరంలో ఆగినా ఏకైక అతిపెద్ద పారీ్టగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ వాజ్‌పేయిని రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించారు. దాంతో వాజ్‌పేయి తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభలో మెజారీ్టని కూడగట్టడంలో విఫలం కావడంతో 13 రోజుల్లోనే వాజ్‌పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1996 నుంచి 1998 మధ్య రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కొలువుదీరినా మధ్యలోనే కూలిపోయాయి. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజార్టీ రావడంతో వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. కానీ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించడంతో 13 నెలల తర్వాత ప్రభుత్వం కుప్పకూలింది. 1999 ఏప్రిల్ 17న లోక్‌సభలో విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. కార్గిల్ విజయం తదితరాల సాయంతో 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. లోక్‌సభలో 543 సీట్లకు గాను 303 సీట్లు గెలుచుకుంది. వాజ్‌పేయి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. 1999 నుంచి 2004 దాకా ఐదేళ్లపాటు పూర్తికాలం పదవిలో ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు లోక్‌సభల్లో ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి నాయకుడిగా వాజ్‌పేయి రికార్డుకెక్కారు. నాలుగు వేర్వేరు రాష్ట్రాలు(ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ) నుంచి వేర్వేరు సమయాల్లో పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నేత వాజ్‌పేయి. తగిన మెజార్టీ లేక వాజ్‌పేయి ప్రభుత్వాలు కూలిపోవడాన్ని హేళన చేసిన ప్రతిపక్షాలతో, ‘‘చూస్తూ ఉండండి! ఏదో ఒక రోజు బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి వస్తుంది’’ అని పార్లమెంట్లో వాజ్‌పేయి బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన వాక్కు నిజమైంది.బీజేపీ తొలి అధ్యక్షుడు.. 1975లో ఎమర్జెన్సీ సమయంలో వాజ్‌పేయీ అరెస్టయ్యారు. తర్వాత 1977 ఎన్నికల్లో జనసంఘ్ ఇతర పార్టీలతో కూడిన జనతా కూటమి నెగ్గి మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. వాజ్‌పేయీ విదేశాంగ మంత్రిగా రాణించారు. 1977లో ఐరాసలో హిందీలో మాట్లాడి చరిత్ర సృష్టించారు. 1980లో జనసంఘ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)గా మారాక దాని తొలి అధ్యక్షుడయ్యారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999 నుంచి పూర్తిస్థాయిలో ఐదేళ్లూ ప్రధానిగా చేశారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలతో ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. దాయాది పాకిస్తాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చారు. లాహోర్ బస్సు యాత్ర చేశారు. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా పాక్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు. గొప్ప రాజనీతిజు్ఞడిగా దేశ విదేశాల్లో పేరుగాంచారు. పార్టీలకతీతంగా ఎంపీలతో ఆయనకు సత్సంబంధాలుండేవి. అంతర్జాతీయ వ్యవహారాలపై వాజ్‌పేయీకి అమితాసక్తి ఉండేది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. వాజ్‌పేయీ హయాంలో 2001లో పార్లమెంట్‌పై దాడి 2002లో గుజరాత్లో మత కలహాలు జరిగాయి. ఆయన్ను భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రీస్తు బోధనలకు ప్రతీక మెదక్ చర్చి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్ జోన్/చిలిప్చేడ్: మెదక్ చర్చి యేసు క్రీస్తుకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన బోధనలకు జీవమిస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. వందేళ్ల విశ్వాసానికి, దేవుని కృపకు ఈ ఆలయం నిదర్శనమని, శాంతిని కోరుకునే వారికి మార్గ నిర్దేశాన్నిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) సంఘ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.గవర్నర్ రాక పురస్కరించుకుని ప్రెసిబెటరి ఇన్చార్జి శాంతయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు కేవలం వందేళ్ల సంబరమే కాదని, మానవ విశ్వాసం, దేవుని అమోఘమైన కృపకు నిదర్శనంగా నిలిచే ఒక మహత్తర ఘట్టమని అభివర్ణిం చారు. ఈ సందర్భంగా బైబిల్లోని.. ‘ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడి ఉంటారో.. అక్కడ నేను ఉంటాను..’అనే క్రీస్తు వచనాలను గవర్నర్ ఉటంకించారు. ఈ చర్చి శతాబ్దంగా దైవ సాన్నిధ్యానికి కేంద్రంగా నిలిచిందని, ఒక విశ్వాసాన్ని పెంపొందించిన స్థలం గానే కాకుండా, అనేకమంది జీవితాలను మార్చిన ప్రదేశంగా నిలిచిందని చెప్పారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఇంతటి గొప్ప దేవాలయాన్ని మనకు ఇచి్చనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని గవర్నర్ చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకోవాలి విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాది లాంటి వారని, వారు సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని, కలలు సాకారం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. విద్యాలయాలు దేవాలయాలతో సమానమని, విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మంచి నాగరికతను పుణికి పుచ్చుకొని భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసుకోవాలని కోరారు. కొల్చారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు బ్యాడ్మింటన్ క్రీడ అంటే ఇష్టమని, మాజీ ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు ఆదర్శమని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మైనంపల్లి రోహిత్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గురుకుల పాఠశాలల కార్యదర్శి అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు. -
కరుణామయుని కోవెలకు వందేళ్ల ఉత్సవాలు
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కట్టడం నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విశేషాలు...అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం... తినడానికి తిండిలేక... చేద్దామంటే పని లేక ప్రజలు ఆకలితో నకనకలాడి అలమటిస్తున్న రోజులు. మరో బాధాకరమైన విషయం... అంటురోగాలతో జనం పిట్టల్లా నేలరాలి చనిపోతున్న దుర్భరమైన పరిస్థితులు అవి. పట్టెడన్నం దొరికితేనే పంచభక్ష్యపరమాన్నాలుగా భావించి పరమానంద పడుతున్న రోజులు. సరిగ్గా ఇటువంటì దుర్భర పరిస్థితులలో దేశంకాని దేశం నుండి ఖండంతరాలు దాటి సాక్షాత్తూ పరలోకం నుంచి ప్రభువు పంపిన దేవదూతలా వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశస్థుడైన ఆయన ముందుగా సికింద్రాబాద్‌లోని అప్పటి మిలటరి(ఆర్మీ) సేనకు నాయకుడిగా వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికే అమాయక ప్రజలనేకులు గత్తర వ్యాధితో మూకుమ్మడిగా చనిపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఆకలి తీర్చిన ఆలయం..!ఆకలితో ఎవరూ చనిపోకూడదని భావించిన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం తలపెట్టాడు. చర్చ్ నిర్మాణం కోసం దాదాపు 200 రకాల నమూనాలను తయారు చేశారట. వాటిలో ఏది ఉత్తమమైనదో తెలియక ఆందోళన చెందుతూ వాటన్నింటిని ముందు పెట్టుకుని మోకరిల్లి ‘పరలోకదేవా ఇందులో ఏ నమూనా ప్రకారం నిర్మించాలో దారిచూపు’ అంటూ ప్రార్థన చేయగా ఉన్నటుండి పెద్ద గాలి వచ్చి అందులోని 199 నమూనా కాగితాలు కొట్టుకుపోయి ఒకే ఒక్క నమూనా మిగిలిందట. అదే దైవ నిర్ణయంగా భావించి దాని ప్రకారం నిర్మించబడిందే ప్రస్తుత చర్చి అని పెద్దలు చెబుతున్నారు. నిర్మాణానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోక పోవడంతో స్వదేశంలో భిక్షమెత్తి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాకర్.ఈ చర్చి వల్లే ‘మెదక్’కు ఆ పేరువేలాది మంది కూలీలతో పది సంవత్సరాలపాటు కొనసాగిన నిర్మాణం వల్ల కాలే కడుపులకు పట్టెడు మెతుకులు దొరికేవట. అప్పట్లో ఈ ప్రాంతానికి గుల్షనాబాద్ అని పేరు. వేలాది జనం చర్చి నిర్మాణంలో భాగస్వాములు కావటం కోసం తండోపతండాలుగా తరలి వెళ్లేవారట. వారిని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ‘మెతుకు’ కోసం పనికి వెళ్తున్నామంటూ చెప్పేవారట. దీంతో ఈ ప్రాంతం గుల్షానాబాద్ నుంచి మెతుకు సీమగా పేరుగాంచింది. అది కాస్తా రానురాను మెదక్‌గా రూపాంతరం చెందింది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే మెదక్ చర్చిని భారతీయ, విదేశీ కళానైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తయినా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. చర్చి లోపల ప్రతిధ్వనులు వినిపించని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైన ఈ చర్చికి ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. చర్చి నిర్మాణానికి రాతి, డంగుసున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైనప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల ΄÷డవుతో సువిశాలమైన చర్చి చూపరులను కట్టిపడేస్తుంది.ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆసియా ఖండంలోనే అద్భుతంగా నిర్మించిన ఈ చర్చి నిర్మాణం జరిగి ఈ డిశంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. 25న క్రిస్మస్ కావడం వల్ల ఆ రోజున భక్తులప్రార్థనలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈనెల 23న శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చర్చిని ముస్తాబు చేస్తున్నారు. 23న పదిహేను మంది బిషప్‌లతో ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఇందులో భాగంగా మెదక్ పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం చిత్రలేఖనం, నృత్యం తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే చర్చి నిర్మాణదాత చార్లెస్ వాకర్ పాస్నెట్ రక్త సంబంధీకులు సైతం హాజరు అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కట్టడాన్ని మూడు గవాక్షాలు, పలు రంగుటద్దాలతో నిర్మింపజేశారు. తూర్పున ఏసుక్రీస్తు జన్మవృత్తాంతం, పడమర క్రీస్తును శిలువ వేసిన దృశ్యం, ఉత్తరాన క్రీస్తు పునరుత్థానుడై నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. వీటిని తయారు చేసిన కళాకారులు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాంకో ఓ, సాలిస్బర్లు. అంతే కాకుండా ఇవి సూర్యరశ్మివెలుతురులో (పగలు) మాత్రమే కనిపిస్తాయి. సూర్య అస్తమయం అయిందంటే కనిపించవు. ఈ నిర్మాణం 1914 నుండి 1924 డిశంబర్ వరకు 10 ఏళ్లపాటు జరుగగా డిశంబర్ 25న క్రిస్మస్ పర్వదినం రోజున ఆరంభించారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు.–సీహెచ్. నీలయ్యసాక్షి, మెదక్ -
మా నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను – నాగార్జున
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున. ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్‌గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్‌ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.ఐఫీ... ఇంకొన్ని విశేషాలు→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
విజయదశమి రోజున ప్రారంభమై.. విజయదశమి నాడే 100వ ఏట ప్రవేశం!
RSS: హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ను నాగపూర్‌లో స్థాపించారు. ఆ సంస్థ ఈ విజయదశమి రోజున 100వ ఏట ప్రవేశిస్తోంది. ఎటువంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులు వంటివి లేకుండా ఒక సంస్థను వందేళ్లు దిగ్విజయంగా నడపడం మాటలు కాదు. దాదాపు 80 లక్షల మంది స్వయం సేవకులు కలిగిన 45 లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతోంది ఆరెస్సెస్.నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గే వార్ని 1921లో విదర్భలోని అకోలా జైలులో ఒక సంవత్సరం రోజులు నిర్బంధించారు. నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చలలో డాక్టర్ హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆరెస్సెస్. 1925 నుంచి 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్, 1940 నుండి 1973 వరకు మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ), 1973 నుంచి 1993 వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్లు సర్ సంఘ చాలకులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోశారు. ఆరెస్సెస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము, ఆసనములు, యోగ, క్రీడలు, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, భారతీయ చరిత్ర–సంస్కృతి–సంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు, ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చివరగా ప్రార్థన వంటి విషయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.సమాజంలోని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు, డాక్టర్లు, వెనుకబడిన, అణగారిన వర్గాలకు ప్రాతి నిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపి ‘సంఘ్ పరివార్’గా భావిస్తారు. ఈ సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాలలో అవి పని చేసుకుని పోతున్నప్పటికీ అవసరమైన సందర్భాలలో ఆర్ఎస్ ఎస్ నుంచి సలహాలు, సూచనలు ప్రేరణ అందుతాయి.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్ – చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో, భూకంపం, తుపానులు, కరోనా వంటి విపత్తులు, రైలు ప్రమాదాలు, కరవు కాట కాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆరెస్సెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ – చైనా యుద్ధ సమయంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించిన నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే కవాతులో ఆరెస్సెస్‌ను పాల్గొనమని ఆహ్వానించడం గమనార్హం. దాదాపు 4 వేల మంది ఆరెస్సెస్ ప్రచారకులుగా (పూర్తి సమయ కార్యకర్తలుగా) కుటుంబ బంధాలకు దూరంగా దేశ, విదేశాల్లో పనిచేస్తూ తమ త్యాగ నిరతిని చాటుతున్నారు.– ఆచార్య వైవి రామిరెడ్డిశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి (నేడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం) -
చిత్రకళకు కొండంత చిరునామా
ఆ చిత్రాలను చూస్తే మన కనులకు ఆహ్లాదం మన మనసుకు ఆనం దం. సప్తవర్ణ సోయగాలు బొమ్మలుగా సాక్షాత్కరిస్తాయి. విశాలంగా రెక్కలార్చిన పక్షులూ, శరవేగంగా పరుగులెత్తే జింకలూ ఎలా కాన్వా స్పై రంగుల్లో నిలిచిపోతాయో, గలగల సెలయేరులూ గంగానది ప్రవా హాలు కళ్ళ ముందు నిలుస్తాయి. అభిజ్ఞాన శాకుంతల కావ్యమైనా, రామాయణ భారత భాగవతాది కథలైనా వారి కుంచె విన్యాసాల్లో ఒదిగిపోతాయి. కోతుల నాడించే మదారి అయినా, పల్లెటూరి జంట అయినా, అరకు లోయలో అందాలైనా వారి బొమ్మల్లో గమ్మున కూర్చుంటాయి. వీరనారి ఝాన్సీ రాణీ, మహా పరాక్రమశాలి మహారాణి రుద్రమదేవీ పౌరుషంగా నిలబడతారు. నన్నయ్య, పోతన, వేమన ఇదిగో మేము ఇలా ఉంటాం అంటూ చిత్రాలై వస్తారు. ప్రకృతి చిత్రాల సోయగాల నుండి, సంప్ర దాయ చిత్రాల ఆలోచనల నుండి, సామాజిక చింతన చేతనత్వం వరకు కొండపల్లి శేషగిరి రావు 40వ దశకం నుండి, 2000వ దశకం వరకు 70 ఏళ్ళు చిత్ర కళా జగత్తుకు నిలువెత్తు చిత్రమై నిలిచారు. కొండపల్లి శేషగిరిరావు 1924 జనవరి 27న వరంగల్ జిల్లా మానుకోట దగ్గర ఉన్న పెనుగొండ గ్రామంలో జన్మించారు. పుట్టింది సంపద గల ఇల్లే అయినా, పదేళ్ల బాలుడు అయ్యేసరికి అనివార్య కారణాలతో పేదరి కంలో పడిపోయింది కుటుంబం. పదవ తర గతి వరకు హనుమకొండలో వారాలబ్బా యిగా బ్రతుకు సాగించి చిత్రకళపై ఉన్న మక్కువతో హైదరాబాదుకు ధైర్యాన్ని వెంట బెట్టుకొని నడిచారు. కొందరు ప్రముఖుల సహకారంతో మెహదీ నవాజ్ జంగ్ గారికి పరిచయమై వారి సహాయంతో రెడ్డి హాస్టల్లో జాయిన్ అయి, ‘హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్’లో విద్యా ర్థిగా చేరి నూతన అధ్యాయాన్ని తెరుచుకున్నారు. ఐదేళ్ల చదువును పూర్తి చేసుకుని ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, చిత్రకారునిగా ఎదిగి, మెహదీ ఫర్మా యిషితో కలకత్తాకు పయనమయ్యారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ’శాంతినికేతన్’లో శేషగిరిరావు విద్యార్థి అయ్యారు. ప్రముఖ చిత్రకారులు నందాలాల్ బోస్, అవనీంధ్ర నాథ్ ఛటోపాధ్యాయుల ప్రియ శిష్యుడూ అయ్యారు. తరువాత తాను చదువుకున్న ఫైనార్ట్స్ కళాశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. రిటైర్ అయిన తర్వాత ఎన్నో వందల చిత్రాలను వేశారు. హైదరాబాద్ పరిసరాలలో కనిపించకుండా పోయిన కొండలు, గుట్టలు శేషగిరిరావు చిత్రించిన చిత్రాల్లో వందలాదిగా దర్శనమిస్తాయి. ఆక్వాటెక్చర్లో, కలర్ గ్రాన్యూల్స్ మ్యూరల్ పెయింటింగ్స్‌లో ఎన్నో కొత్త కొత్త ప్రయో గాలు చేశారు. అమీర్ పేట్ దగ్గర మైత్రి భవన్ హుడా కాంప్లెక్స్ ముఖ ద్వారం రెండువైపులా గోడలపై కనిపించే విశ్వరూప సంద ర్శనం, లవకుశులు చేజిక్కించుకున్న అశ్వమేధ యాగాశ్వ పెయిం టింగ్ ఇప్పుడూ చూసి ఆనందించవచ్చు. ‘చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర’ అనే పుస్తకానికి ముందుమాటగా ‘కుంచె సామ్రాజ్య మహారాజు’ అంటూ ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసంలో ‘రావి నారాయణ రెడ్డి పైన నీలా కాశం తేలి, మబ్బుల కాంట్రాస్టులో ఆదర్శమంత ఎత్తెగురు తున్న ఎర్రని జెండా, దానిపై హత్తిన తెల్లని సుత్తి కొడవలి. కళ్ళు నిండిపోతాయి’, ‘నుదుట నామం దిద్దుకుని పరమ సాంప్రదాయకంగా కనిపిస్తూ చిత్రాలు గీసే ఈ పవిత్ర బ్రాహ్మణ మూర్తికి ఎర్రజెండా జబ్బు ఎలా సోకిందబ్బా? అని ఓ నాయకుడిని అడిగాను, ఇలాంటి పెద్ద కమ్యూనిస్టు నాయకులు ఎందరో ఆయనకు జిగిరీ దోస్తులు అని చెప్పాడు’ అన్నారు. ఈ మాటలు శేషగిరి రావు నిండైన సామాజిక మూర్తి మత్వానికి అద్దం పట్టాయి అని చెప్ప వచ్చు. ‘కాకి పడిగెలు’ జానపద చిత్రకళను వెలుగులోకి తెస్తూ రచించిన పరిశోధనాత్మక వ్యాసమైన ‘ఆంధ్రదేశంలో చిత్రకళ’, ‘తెలంగాణాలో చిత్రకళ’, ‘కళ – కల్పనా వైచిత్రి’ వంటి ఎన్నో గొప్ప వ్యాసాలను రచిం చిన కవి, రచయిత కూడా శేషగిరిరావు. ‘చిత్ర శిల్పకళా రామణీ యకము’ వ్యాస సంపుటి వీరి పాండితి గరిమకు నిదర్శనం. మొట్ట మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ‘తెలుగు తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేశారు. 2012 జూలై 26న తుది శ్వాస విడిచారు. నేడు ఆ అద్భుత చిత్రకారుడు పుట్టిన రోజు సందర్భంగా శత జయంతి వేడుకలు జరుపుతున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. – డాక్టర్ కొండపల్లి నీహారిణి ‘ రచయిత్రి, సంపాదకురాలు (నేడు కొండపల్లి శేషగిరిరావు శతజయంతి వేడుక జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాదులో ఉదయం 11 గంటలకు జరగనుంది .) -
ఏఎంసీ @ 100 ఏళ్లు
మహారాణిపేట: వందేళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు ముందే తెలుగు వారి కోసం విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటైంది. 1923 జూలై 19న మెడికల్ కళాశాల అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగ్‌పటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు.1926లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభమైన తర్వాత వైజాగపటం వైద్య కళాశాల ఏయూకి అనుబంధ కళాశాలగా మారింది. ఆ సమయంలో వైస్ చాన్సలర్‌గా ఉన్న సీఆర్ రెడ్డి దీని పేరును ఆంధ్రా మెడికల్ కాలేజ్‌గా మార్చాలని మద్రాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత పేరు మారుస్తూ గెజిట్ విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి ఈ కళాశాల ఆంధ్ర మెడికల్ కాలేజీగానే ప్రసిద్ధి చెందింది. దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలల్లో ఏఎంసీ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఏఎంసీ కావడం విశేషం. ప్రస్తుత మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇక్కడే ఎంబీబీఎస్ చదివారు. ఇంకా ఎంతో మంది దేశ,విదేశాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. రూ.50 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలు వేసుకుని 1.6 ఎకరాల్లో కళాశాల సమీపంలోనే ఒక నూతన భవనాన్ని ని ర్మిస్తున్నారు. వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధనా ఆస్పత్రులు వచ్చాయి. తొలి కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)గా మారింది. 132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్ నేడు 1,100 పడకల స్ధాయికి ఎదిగింది. ఇంకా అనుబంధంగా అనేక ఆస్పత్రులు ఉన్నాయి. 27 నుంచి శతాబ్ది ఉత్సవాలు ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. 27న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, 28న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎం.ఎల్.మాండవీయ,రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొంటారు. 29న తెలుగు సాహితీ వైభవం కార్యక్రమంలో భాగంగా రాత్రి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థినే ఆంధ్రా మెడికల్ కాలేజీలో 1978లో ఎంబీబీఎస్ చదివాను. ఇప్పుడు ఇదే కాలేజీలో ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. చదువుకున్న కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత వైద్యులను సమన్వయం చేసుకుంటూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బుచ్చి రాజు, ప్రిన్సిపాల్, ఏఎంసీ చాలా ఆనందంగా ఉంది నేను ఇదే కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. ఇక్కడ వైద్య విద్య పూర్తిచేసిన అనేక మంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వైద్య విద్యను ఎంతో ఇష్టంగా చదివాను. ఇప్పటికీ వైద్యునిగా పనిచేయడం తన తల్లిందండ్రుల చేసిన పుణ్యఫలంగా భావిస్తాను. –డాక్టర్ ఎన్.ఉమా సుందరి, రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ తెలుగు రాష్ట్రాల్లో ఏఎంసీ నంబర్ వన్ నేను చదువుకున్న రోజుల్లో కాలేజీ, ఆస్పత్రి చాలా చిన్నవిగా ఉండేవి, అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర వైద్య కాలేజీ నంబర్ వన్‌గా ఉంది. అయిదు సంవత్సరాల పాటు ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా పనిచేశా. – డాక్టర్ పి.వి.సుధాకర్, పూర్వ విద్యార్థి, మాజీ ప్రిన్సిపాల్ -
ఇండియా కూటమి రాకతో
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకు రావడం తథ్యం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో చెన్నై వైఎంసీఏ మైదానంలో మహిళా హక్కు మహానాడు శనివారం రాత్రి జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తూ, దేశంలో మహిళలు వివిధ రంగాలలో పురోగమిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే కాంక్షతో ఆది నుంచి కాంగ్రెస్ పొరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే, ఆ కుటుంబమే చదువుకున్నట్లని వ్యాఖ్యానించారు. మహిళా నాయకత్వం విస్తృతం, మహిళ చేతికి అధికారంలోకి వస్తే దేశం బలోపేతం అవుతుందన్న కాంక్షతో గతంలోనే 33 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టామన్నారు. యూపీఏ హయాంలోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా, ఏకాభిప్రాయం కుదరక పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందలేక పోయినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దీనిని ఎప్పుడు అమలు చేస్తారో అన్నది స్పష్టం చేయడం లేదన్నారు. రేపు చేస్తారా..? ఎల్లుండి చేస్తారా..? ఏడాది తర్వాత చేస్తారా..? రెండేళ్ల తర్వాత చేస్తారా...? అని ప్రశి్నస్తూ, ఈ బిల్లు అమలు అన్నది రానున్న ఇండియా కూటమి ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ చట్టం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తూ, ఇండియా కూటమి రాకతో ఈ చట్టం అమల్లోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం«ధీ, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బిహార్ ఆహార శాఖ మంత్రి లేషి సింగ్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్, ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
ఏదీ వదలకుండా మాట్లాడారు: ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ప్రయాణికుడిలా ఢిల్లీ మెట్రో రైలులో సందడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల కోసం ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్ నుంచి విశ్వ విద్యాలయా మెట్రో స్టేషన్ మధ్య రైలులో ప్రయాణించారు. ప్రధాని మోదీ మెట్రోరైలులో సందడి చేసిన ఫొటోలు, వీడియోలు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. యువ ప్రయాణికులతో ప్రయాణం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారాయన. On the way to the DU programme by the Delhi Metro. Happy to have youngsters as my co-passengers. pic.twitter.com/G9pwsC0BQK — Narendra Modi (@narendramodi) June 30, 2023 PM Shri #NarendraModi interacts with passengers in #Delhi Metro during his ride to Delhi University.#Viralvideo pic.twitter.com/PkojngLPEe — Akshara (@Akshara117) June 30, 2023 ► ఇక ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మెట్రో ప్రయాణ అనుభవాన్ని సైతం వివరించారు. విద్యార్థులు మెట్రో ప్రయాణంలో ఎన్నో మాట్లాడారు. ఓటీటీ నుంచి సైన్స్ అంశాల దాకా దేన్ని వదలకుండా చర్చించారు అని తెలిపారాయన. ► ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా.. పలు విభాగాలకు శంకుస్థాపనలు.. పలు సెక్షన్లను ప్రారంభించారాయన. ► సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ప్రకారం.. ఢిల్లీ యూనివర్సిటీకి 1922లో స్థాపన జరిగింది. ► 2022, మే 1వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ్టి ప్రధాని మోదీ హాజరు కార్యక్రమంతో ఆ వేడుకలు ముగిశాయి. ► ప్రధాని రాక నేపథ్యంలో విద్యార్థులు నల్ల దుస్తులు(నిరసన తెలిపే అవకాశం ఉన్నందునా) వేసుకురావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే 10 నుంచి 12 గంటల నడుమ ప్రధాని మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. Prime Minister #NarendraModi on Friday travelled on the metro to attend the closing ceremony of the Delhi University's centenary celebrations as the chief guest.#delhiuniversity #Delhi #india pic.twitter.com/RoTeFQi04X — Kashmir Local News (@local_kashmir) June 30, 2023 -
నాడు ఎన్టీఆర్‌ను తిట్టారు.. నేడు దండలు వేస్తున్నారు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘నేను ఒక సీరియస్ జోక్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కానీ జోక్ అది. ఆయన మరణానికి కారణమైన వాళ్లే.. ఇప్పుడు ఎన్టీఆర్ కంటే గొప్ప వ్యక్తి లేరు అంటూ కీరి్తస్తున్నారు’ అని టీడీపీ మహానాడును ఉద్దేశించి సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. నాడు లక్ష్మీపార్వతితో ఉన్న ఎన్టీఆర్‌ను తిట్టిన వాళ్లే.. నేడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అతిథులు ఎన్టీఆర్ లలిత కళా అవార్డును పోసాని కృష్ణమురళికి ప్రదానం చేశారు. అనంతరం రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అనేది స్వయంగా ఎన్టీఆరే చెప్పారన్నారు. రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి వచ్చి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్లతో కూర్చున్నారంటే.. ఒకరకంగా ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తున్నట్లేనన్నారు. నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తాతకు వెన్నుపోటు పొడిచిన వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే.. ఆయన వీళ్లందరికీ దూరంగా ఉంటున్నారన్న విషయం స్పష్టమవుతోందన్నారు. తాను ‘వ్యూహం’ సినిమా తీస్తున్నానని, అందులో చంద్రబాబు క్యారెక్టర్‌ను అరటిపండులా వలిచి చూపిస్తానని ప్రకటించారు. లక్ష్మీపార్వతిపై బాబు పుకార్లు.. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ఏ కులం, ఏ మతం వారితో అయినా స్నేహం చేయవచ్చు కానీ.. గుణం లేని వారితో మాత్రం చేయకూడదన్నారు. గుణం లేని వాడు చంద్రబాబు అని.. అతనికి దూరంగా ఉండటం చాలా మంచిదని సూచించారు. తన మంచిచెడులు చూసుకునేందుకు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ఆహ్వా నించారని, కానీ ఆమెపైనా చంద్రబాబు అనేక పుకార్లు పుట్టించారని చెప్పారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడుసార్లు గుండెపోటు వచ్చినా.. లక్ష్మీపార్వతి ఒక్కరే అండగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపిస్తేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. బాబు కుట్రలకు ఎన్టీఆర్ కుమిలిపోయారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. అడ్డదారుల్లో అధికారాన్ని లాక్కునేందుకు చంద్రబాబు చేసిన కుట్రలపై ఎన్టీఆర్ ఎంతగానో కుమిలిపోయారని చెప్పారు. ఎన్టీఆర్‌ను అడుగడుగునా వేధింపులకు గురిచేశారని వివరించారు. ఎన్టీఆర్ కష్టకాలంలో దేవినేని నెహ్రూ అన్నీ తానై నిలిచారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన గౌరవాన్ని నిలబెట్టిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రారంభించిన పథకాలు ఎప్పటికీ చిరస్మరణీయమేనని అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి గొప్ప మనిషి కూడా చంద్రబాబు కుట్రకు బలయ్యారన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు కన్వీనర్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి అవినాశ్ మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్ ఒక కులానికో, పార్టీకో పరిమితం కాదన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. -
విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
-
దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం
-
శ్రీ కృష్ణుడి రూప ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నో!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలోని లకారం చెరువులో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. గతంలో ఇచ్చిన స్టేను పొడిగిస్తూ తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ విగ్రహావిష్కరణను ఈ నెల 28న నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేశారు. తానా ఈ విగ్రహాన్ని అందిస్తోంది. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళా పీఠం, బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ పిటిషన్లు దాఖలు చేశాయి. (చదవండి: ఔటర్ రింగ్‌రోడ్డు లీజుపై విపక్షాల విషం) -
శతజయంతి వేడుకలకు దూరం అసలు కారణం..!
-
నేడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అంకురార్పణ
-
ఘనాపాఠీల చదువులకు కేరాఫ్ బేగంపేట ‘హెచ్‌పీఎస్’
హైదరాబాద్: ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి.. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి.. సినీనటులు అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్.. ప్రస్తుత నగర కమిషనర్ సీవీ ఆనంద్.. ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యత హర్షభోగ్లే.. ఇలా ఏ రంగాన్ని తట్టినా మేటి స్థానాల్లో నిలబడిన వారెందరో. వారందరికీ అది పునాది రాయి.. ఇదే వారి ప్రఖ్యాతికి మైలు రాయి. రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లింది. అక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో ప్రస్తుతం ఉన్నత శిఖరాలను అధిరోహించి భరతమాత ముద్దు బిడ్డలుగా ఎదిగారు. వారంతా ఓనమాలు నేర్చుకున్న ఆ సరస్వతీ నిలయానికి అక్షరాలా నూరేళ్లు. అదే బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్). నేటి నుంచి శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న హెచ్‌పీఎస్‌పై ప్రత్యేక కథనం. అవతరణ ఇలా.. ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో బేగంపేటలో ‘జాగీర్దార్ కాలేజ్’ పేరుతో ఈ స్కూల్ షురువైంది. దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా ముగ్గురు విద్యార్థులతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రారంభమైంది. 1950లో ప్రభుత్వం జమీందారీ వ్యవస్థకు స్వస్తి చెప్పడంతో అప్పటివరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్దార్ స్కూల్ 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా అవతరించింది. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పడింది. 1988 వరకు బాలురకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్‌లో ఆ తర్వాత బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించారు. దాదాపు 122 ఎకరాల సువిశాల ప్రాంగణం.. పెద్ద క్రీడా మైదానం.. ఎటుచూసినా పచ్చదనం.. లైబ్రరీ, ఇ–లైబ్రరీ, డైనింగ్‌హాల్, ఆధునిక లేబరేటరీలు, హాస్పిటల్, అన్ని రకాల క్రీడా కోర్టులు, గుర్రపు స్వారీ.. ఇలా అత్యాధునిక వసతులతో హెచ్‌పీఎస్ అలరారుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 3,200 మంది పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అప్పట్లోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఇండో– సారాసెనిక్ శైలిలో పాఠశాల భవనాన్ని నిర్మించారు. హెచ్‌పీఎస్‌కు విద్యారంగంలోని దాదాపు అన్ని రకాల ఉన్నత స్థాయి అవార్డులు వరించాయి. ఎడ్యుకేషన్ వరల్డ్, ఫ్యూచర్ 50 అవార్డు, ఎడ్యుకేషన్ టుడేస్ ఇండియా స్కూల్ మెరిట్ అవార్డ్, బెస్ట్ ఇన్నోవేటివ్ కే–12 స్కూల్ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాఠశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్ కొనసాగుతున్నారు. అతిపెద్ద ఎడ్యుకేషన్ సైన్స్ ఫెస్టివల్.. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వహణను చేపట్టింది. అందులో భాగంగా మొదటి దఫాగా ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఇండియా సైన్స్ ఫెస్టివల్ (ఐఎస్ఎఫ్)తో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22న సింఫనీ ఆర్కెస్ట్రా ఆఫ్ ఇండియా ప్రదర్శన ఉంటుంది. 22 నుంచి 27 మధ్యన రౌండ్ స్క్వేర్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్‌లు హాజరుకానున్నారు. (క్లిక్ చేయండి: వైద్య విద్యార్థుల గోస.. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దు) సమాజానికి అమూల్యమైన సేవ.. విద్య ద్వారా సమాజానికి అమూల్యమైన సేవను హెచ్‌పీఎస్ అందిస్తోంది. సైన్స్, ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, అడ్వంచర్, ఇన్నోవేషన్, ఎక్స్పోజర్, సహకారం, నెట్వర్కింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పరంగా ప్రయోజనం చేకూర్చేలా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. – డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్, ప్రిన్సిపాల్ -
ఘంటసాల శతజయంతి ఉత్సవాలు: సింగపూర్‌లో ఘన నివాళి
శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి, "శ్రీ సాంస్కృతిక కళాసారథి" వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి, నిర్వాహకబృంద సభ్యులు శ్రీధర్ భరద్వాజ్, చామిరాజు రామాంజనేయులు పాతూరు రాంబాబు జ్యోతి ప్రకాశనం గావించి ఘంటసాల మాస్టారు చిత్రపటానికి పూవులతో నివాళులు అర్పించారు. "గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూవస్తున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమం సమాపనోత్సవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం నుండి అతిథులు గాయనీగాయకులు, వాద్య బృందం సింగపూర్‌కు విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం తమ సంస్థ ద్వారా జరగడం అదృష్టంగా భావిస్తున్నామని" రత్నకుమార్ కవుటూరు తెలియజేశారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి సందేశాన్ని పంపిన వామరాజు సత్యమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. కిషన్ రెడ్డి తమ అభినందన వీడియో సందేశంలో "ఈ కార్యక్రమం సింగపూర్ లో నిర్వహించడం అభినందనీయమని తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ, సింగపూర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున, కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు కూడా అందించారు." ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కుమార్తె సుగుణ ఈ కార్యక్రమానికి అభినందన సందేశాలు పంపుతూ "పైనుండి ఘంటసాల వారు ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తారన్నారు." శుభోదయం సమర్పణలో, మాధవపెద్ది సురేష్ సారధ్యంలో జరిగిన ప్రత్యేక సంగీత విభావరిలో, ప్రముఖ నేపథ్య గాయనీగాయకులు చంద్రతేజ, సురేఖ మూర్తి, చింతలపాటి సురేష్ అద్భుతమైన పాటలను ఆలపించగా, ప్రముఖ వాద్య కళాకారులు సాయి కుమార్ పవన్ కుమార్ సోదరులు, యుగంధర్, చక్రపాణి సోమేశ్వరరావు చక్కటి వాద్య సహకారాన్ని అందించారు.దుబాయ్ నుండి విచ్చేసిన నాట్య కళాకారిణి కుమారి తెన్నేటి శ్రావణి శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరిని ఆకర్షించింది. ఈ వేదికపై శుభోదయం వారి "షడ్రుచి" శాఖ ప్రకటనను సింగపూర్ లో విడుదల చేశారు. వారు నిర్మించిన 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ దర్శకులు రామారావు నిర్మాత జి వి భాస్కర్ లను శ్రీ సాంస్కృతిక కళాసారథి వారు ప్రత్యేకంగా సత్కరించారు. వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణగా పీఎస్ గోపాలకృష్ణ రచించిన 'మన ఘంటసాల' అనే పుస్తకాన్ని ఈ వేదికపై అతిధులు అందరూ కలిసి ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు ఈ సందర్భంగా కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ పర్యటనకు ఏర్పాట్లన్నీ గావించిన శుభోదయం బాలసుబ్రమణ్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగపూర్ గాయనీ గాయకులు అలనాటి అందమైన పాటలను పాడి ఘంటసాలవారికి జోహార్లు అర్పించగా, ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్త అయిన రాధిక మంగిపూడి సభా నిర్వహణ గావించారు. సింగపూర్‌లో పంగోల్ లోని జిఐఐయస్ ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్ లో వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరవగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, శిష్ట్లా వంశీ సాంకేతిక నిర్వహణా బాధ్యతలు వహించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు. -
సింగపూర్‌లో శతాబ్దిగాయకుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాలు
శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్‌లో డిసెంబర్ 4వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. "గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూవస్తున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమం యొక్క సమాపణోత్సవం, సింగపూర్ లో ఘంటసాల శతజయంతి రోజున నిర్వహిస్తున్నామని, దీనికై భారతదేశం నుండి వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, చంద్రతేజ, సురేఖ మూర్తి లాంటి ప్రముఖ నేపద్య గాయనీ గాయకులు, వాద్య కళాకారులు, హాంకాంగ్ నుంచి జయ పీసపాటి, తదితర అతిథులు హాజరు కానున్నారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారని" శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు తెలియజేశారు. భారతదేశం నుండి వస్తున్న ప్రముఖ గాయని గాయకులచే ప్రత్యేక సంగీత విభావరితో పాటు శుభోదయం ఆధ్వర్యంలో నిర్మించిన 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ ట్రైలర్ ఆవిష్కరణ, వంగూరి ఫౌండేషన్ వారి 'మన ఘంటసాల' పుస్తకావిష్కరణ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి. రాధిక మంగిపూడి ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. సింగపూర్ గాయనీ గాయకులు తమ పాటలతో ఘంటసాలకు జోహార్లు అర్పించనున్నారు. సింగపూర్‌లో Punggol లోని GIIS ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరిగే ఈ కార్యక్రమానికి నిర్వాహకబృందం సింగపూర్ తెలుగు ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టు ప్రకటించింది. -
ఎన్టీఆర్‌తో నటించేటప్పుడు విలువలు నేర్చుకున్నా
‘‘నేను చిన్నతనం నుంచి ఎన్టీఆర్‌గారిని ఆదర్శంగా తీసుకునేదాన్ని. ఆయనతో నటించేటప్పుడు క్రమశిక్షణ, సిన్సియారిటీ, అంకితభావం, నిబద్ధత, మాటతీరు.. వంటి విలువలు నేర్చుకున్నాను’’ అని సీనియర్ నటి ఎల్.విజయలక్ష్మి అన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు ఎల్.విజయలక్ష్మి. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెకు హీరో బాలకృష్ణ గౌరవ సత్కారం చేశారు. అనంతరం ఎల్.విజయలక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఎంతో అభిమానంతో అమెరికా నుంచి నన్ను పిలిపించి గౌరవించడం చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. ఇందుకు బాలకృష్ణ, ఆలపాటి రాజా, బుర్రా సాయిమాధవ్‌లకు థ్యాంక్స్. వివాహం అయ్యాక సినిమాలు మానేసి అమెరికా వెళ్లాను. అక్కడ సీఏ చదివానంటే ఎన్టీఆర్‌గారి స్ఫూర్తి వల్లే. రామానాయుడు, ఎన్టీఆర్‌గార్ల తరం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఇలాంటి వేడుకలకు రావాలనుంది’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయలక్ష్మిగారు వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె మహిళా సాధికారతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి’’ అన్నారు. ‘‘1964లో మా బేనర్లో(సురేశ్ ప్రొడక్షన్స్) నిర్మించిన ‘రాముడు భీముడు’ సినిమాలో విజయలక్ష్మిగారు నటించారు. అందులో ‘‘దేశమ్ము మారిందే..’ అనే సాంగ్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో నాన్నగారు (రామానాయుడు) చెబుతుండేవారు’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఈ వేడుకలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, బసిరెడ్డి, రామసత్యనారాయణ, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్‌కు 'గులాబీ' నివాళి..!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి వేదికగా టీఆర్ఎస్ పార్టీ ఎన్టీఆర్ నామస్మరణ చేసింది. జై తెలంగాణ, జై కేసీఆర్‌తో పాటు కొత్తగా జై ఎన్టీఆర్ అంటూ టీఆర్ఎస్ నేతలు కొత్త నినాదం అందుకున్నారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించేందుకు బారులు తీరారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను ప్రస్తుతిస్తూ ఘనంగా నివాళి అర్పించారు. ఇన్నాళ్లూ ఎన్నడూ ఎన్టీఆర్ ఊసెత్తని టీఆర్ఎస్.. ఇప్పుడు ఒక్కసారిగా జై ఎన్టీఆర్ అని నినదించడం చర్చనీయాంశంగా మారింది. నివాళి అర్పించిన టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా గతంలో టీడీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారే కావడం గమనార్హం. దీని వెనుక హైదరాబాద్‌లో ఓటర్లకు గాలం వేయడం, ఓ సామాజికవర్గం మద్దతు కూడగట్టడమే గులాబీ పార్టీ లక్ష్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళి అర్పించిన వారిలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, చామకూర మల్లారెడ్డి, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మరికొందరు టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారంటూ.. ‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా.. ఎన్టీఆర్ కా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది)’అని టీఆర్ఎస్ నేతలు నినదించడం గమనార్హం. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందంటూ ప్రకటనలు విడుదల చేశారు. ‘‘ప్రపంచంలో చరిత్ర సృష్టించిన తెలుగు బిడ్డకు నివాళి అర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్టీఆర్ కేంద్రం మెడలు వంచి జాతీయ నాయకుడిగా పనిచేయాలనుకున్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నందున దివంగత నేత ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చాం. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం పార్లమెంటులో పోరాడుతాం. బడుగు బలహీనవర్గాలకు పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఆయనదే. కేసీఆర్ కూడా రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు..’’అని మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. అంతా పక్కాలెక్కతోనే.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మొదలుకుని ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాతా ఏనాడూ ఎన్టీఆర్ ఊసెత్తని టీఆర్ఎస్.. ఆయన శత జయంతి రోజు ఏకంగా జై ఎన్టీఆర్ అంటూ నినదించడం చర్చనీయాంశమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓ సామాజికవర్గం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఇక్కడ శాసనసభ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించేందుకు.. నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం కోసం సదరు సామాజికవర్గం మద్దతు అవసరమని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సామాజికవర్గం ఓటర్లను టీఆర్ఎస్కు అనుకూలంగా పోలరైజ్ చేసేందుకే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదాన్ని బలంగా వినిపించాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ దాదాపు అంతర్ధానం కాగా.. అక్కడక్కడా మిగిలి ఉన్న సానుభూతిపరులు, కేడర్‌ను టీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలో భాగంగా జై ఎన్టీఆర్ నినాదాన్ని ఎత్తుకున్నారని అంటున్నాయి. మరోవైపు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలమయ్యేందుకు వరుస పర్యటనలు, సమావేశాల్లో పాల్గొంటున్న కేసీఆర్.. ‘తెలుగు కుటుంబం’అనే భావనను తెరమీదకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే టీడీపీ మాజీలైన ప్రస్తుత టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా హడావుడి చేసినట్టు చెప్తున్నాయి. ఓవైపు పార్టీ.. మరోవైపు సామాజికవర్గం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన వారిలో ఒకరిద్దరు మినహా కీలక నేతలంతా గతంలో టీడీపీలో పనిచేసినవారే. అందులోనూ ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన నేతల్లో హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నా.. ఈ కొత్త నినాదం వెనుక ఓట్లు, సీట్ల రాజకీయం దాగి ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన మల్లారెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. వీరంతా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పువ్వాడ అజయ్, భాస్కర్‌రావు కూడా టీఆర్ఎస్లో చేరి రెండోసారి ఎమ్మెల్యేలు అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా ఉన్న నామా నాగేశ్వర్రావు కూడా టీడీపీ నుంచే వచ్చారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి గతంలో టీడీపీలో క్రియాశీల నేతలే. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సుదీర్ఘకాలంలో టీడీపీలోనే ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు గాంధీ, గోపీనాథ్, భాస్కర్‌రావు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కూడా. ఎన్టీఆర్ ఘాట్ వద్ద... మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుం బసభ్యులు, అభిమానులు, నేతలు ఘనంగా నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు పలు వురు సినీనటులు, ఏపీ రాజకీయ నాయకులు నివాళి అర్పించారు. అటు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ ఈ విగ్రహదాత కాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్‌నగర్ సొసైటీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ నివాళులు ఎనిమిదేళ్లుగా ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే మంత్రులు, ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ ఘాట్‌కు పంపించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ ప్రతి నిర్ణయం రాజకీయ కోణంలోనే ఉంటుందని.. ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారు భూమి, ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప నాయకుడు, చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని శనివారం ఒక ప్రకటనలో కొనియాడారు. -
పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర
కోజికోడ్: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు. హోలీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. -
15న ధర్మభిక్షం శతజయంతి ముగింపు ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ముగింపు ఉత్సవాలు ఈ నెల 15న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. పార్టీలకతీతంగా కదలివచ్చి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీలోని వివిధ ప్రజా సంఘాల బాధ్యుల సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్న సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... 15న రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డితో కూడిన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు.