ఓయూ శతాబ్ది వేడుకలు ప్రారంభం
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు అంగరంగవైభవంగా బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ప్రత్యేక విమానంలో బేంగపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి నేరుగా ఓయూకు చేరుకున్నారు. ‘ఏ’ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు.
ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మేయర్ బొంతు రామ్మోహన్ తదితర ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. వేదికపై వీరికి ఉత్సవ నిర్వాహకులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్.. ఓయూ శతాబ్ది సావనీర్ ను ఆవిష్కరించి రాష్ట్రపతికి అందించారు. విద్యార్థులు, సిబ్బంది పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.