హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఓయూ శతాబ్ది ప్రారంభోత్సవ వేడుకలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రణబ్...సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు పలికారు.
కాగా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గోవా నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం నేరుగా ఉస్మానియా యూనిర్సిటీకీ చేరుకున్నారు. యునివర్సీటీ అధికారులు ప్రణబ్ ముఖర్జీకి ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో రాష్ట్రపతి ప్రణబ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.