ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు అంగరంగవైభవంగా బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ప్రత్యేక విమానంలో బేంగపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి నేరుగా ఓయూకు చేరుకున్నారు.