
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలోని లకారం చెరువులో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. గతంలో ఇచ్చిన స్టేను పొడిగిస్తూ తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.
ఈ విగ్రహావిష్కరణను ఈ నెల 28న నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేశారు. తానా ఈ విగ్రహాన్ని అందిస్తోంది. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళా పీఠం, బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ పిటిషన్లు దాఖలు చేశాయి.
(చదవండి: ఔటర్ రింగ్‌రోడ్డు లీజుపై విపక్షాల విషం)
Comments
Please login to add a commentAdd a comment