నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ శత వసంతాల వేడుక  | RSS Centenary Celebrations, PM Modi To Release Stamp And Coin Honoring 100 Years Of RSS | Sakshi
Sakshi News home page

నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ శత వసంతాల వేడుక 

Oct 1 2025 6:42 AM | Updated on Oct 1 2025 11:32 AM

PM Narendra Modi to Attend RSS Centenary Celebrations in New Delhi

ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ  

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయవాద భావజాల వ్యాప్తి లక్ష్యంగా వందేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్రీ్టయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్‌ 1న ఢిల్లీలో ఘనంగా జరగనున్నాయి. ఈ చరిత్రాత్మక వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

ఢిల్లీలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని, ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు. బ్రిటిష్‌ పాలనలో దేశ ప్రజల్లో జాతీయ భావాలను, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో డాక్టర్‌ కేశవ్‌ బలిరాం హెడ్గేవార్‌ 1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement