rashtriya swayamsevak sangh
-
విజయదశమి రోజున ప్రారంభమై.. విజయదశమి నాడే 100వ ఏట ప్రవేశం!
RSS: హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ను నాగపూర్‌లో స్థాపించారు. ఆ సంస్థ ఈ విజయదశమి రోజున 100వ ఏట ప్రవేశిస్తోంది. ఎటువంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులు వంటివి లేకుండా ఒక సంస్థను వందేళ్లు దిగ్విజయంగా నడపడం మాటలు కాదు. దాదాపు 80 లక్షల మంది స్వయం సేవకులు కలిగిన 45 లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతోంది ఆరెస్సెస్.నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గే వార్ని 1921లో విదర్భలోని అకోలా జైలులో ఒక సంవత్సరం రోజులు నిర్బంధించారు. నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చలలో డాక్టర్ హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆరెస్సెస్. 1925 నుంచి 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్, 1940 నుండి 1973 వరకు మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ), 1973 నుంచి 1993 వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్లు సర్ సంఘ చాలకులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోశారు. ఆరెస్సెస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము, ఆసనములు, యోగ, క్రీడలు, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, భారతీయ చరిత్ర–సంస్కృతి–సంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు, ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చివరగా ప్రార్థన వంటి విషయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.సమాజంలోని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు, డాక్టర్లు, వెనుకబడిన, అణగారిన వర్గాలకు ప్రాతి నిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపి ‘సంఘ్ పరివార్’గా భావిస్తారు. ఈ సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాలలో అవి పని చేసుకుని పోతున్నప్పటికీ అవసరమైన సందర్భాలలో ఆర్ఎస్ ఎస్ నుంచి సలహాలు, సూచనలు ప్రేరణ అందుతాయి.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్ – చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో, భూకంపం, తుపానులు, కరోనా వంటి విపత్తులు, రైలు ప్రమాదాలు, కరవు కాట కాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆరెస్సెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ – చైనా యుద్ధ సమయంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించిన నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే కవాతులో ఆరెస్సెస్‌ను పాల్గొనమని ఆహ్వానించడం గమనార్హం. దాదాపు 4 వేల మంది ఆరెస్సెస్ ప్రచారకులుగా (పూర్తి సమయ కార్యకర్తలుగా) కుటుంబ బంధాలకు దూరంగా దేశ, విదేశాల్లో పనిచేస్తూ తమ త్యాగ నిరతిని చాటుతున్నారు.– ఆచార్య వైవి రామిరెడ్డిశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి (నేడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం) -
క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థల సేవలు అపారం
జైపూర్: దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థలే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. మిషనరీలతో పోలిస్తే హిందూ ఆధ్యాత్మిక గురువులు సమాజ సేవలో ఎన్నో రెట్లు ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అయితే, ఇది పోటీకి సంబంధించిన విషయం కాదని అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్ సమీపంలోని జామ్డోలీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన కేశవ్ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సేవ సంగమ్ సదస్సును మోహన్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ సేవ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన దేశంలో మేధావులు క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు. మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విద్యాసంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే హిందూ మత గురువులు, ఆచార్యులు, సన్యాసులు అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. సేవ అంటే సేవ మాత్రమేనని, ఇది పోటీ కాదని వివరించారు. నిస్వార్థంగా ప్రజలకు అందించే సేవలను కొలవలేమని వ్యాఖ్యానించారు. సేవ అనేది సహజ మానవత్వ వ్యక్తీకరణ అని మోహన్ భగవత్ తెలియజేశారు. మనమంతా సమాజంలో భాగమేనని, ఐక్యంగా లేకపోతే మనం పరిపూర్ణం కాదని తేల్చిచెప్పారు. సమాజంలో అసమానతలు ఎంతమాత్రం వాంఛనీయం కాదన్నారు. దురదృష్టవశాత్తూ అసమానతలు కొనసాగుతున్నాయని వివరించారు. సేవ అనేది ఆరోగ్యకరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. -
Dussehra 2022: సమగ్ర జనాభా విధానం కావాలి
నాగపూర్: దేశంలో అన్ని వర్గాలకు సమానంగా వర్తించే ఒక సమగ్ర జనాభా విధానాన్ని (పాపులేషన్ పాలసీ) రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ అన్నారు. విస్తృతమైన చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ విధానాన్ని తయారు చేయాలని చెప్పారు. నాగపూర్‌లో బుధవారం నిర్వహించిన దసరా వేడుకల్లో మోహన్ భగవత్ మాట్లాడారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది చాలా కీలకమైన అంశమని, దీన్ని విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనాభా అసమతుల్యత అనేది దేశ భౌగోళిక సరిహద్దులను సైతం మార్చేస్తుందని వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల జనాభా మధ్య సమతుల్యత కోసం అన్ని వర్గాలకు సమానంగా వర్తించే నూతన జనాభా విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలో వర్గాల మధ్య సమతుల్యత ఉండాలన్నారు. ‘‘జననాల రేటులో భేదాలు, బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాలు, అత్యాశ కారణంగా మతాలు మారడం, దేశంలోకి అక్రమ చొరబాట్లు.. ఇలాంటివన్నీ ముఖ్యమైన అంశాలు. వీటిని కచ్చితంగా అరికట్టాలి’’ అని మోహన్ భగవత్ సూచించారు. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆంగ్ల భాష ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాతృభాషను ప్రభుత్వమే ప్రోత్సహించాలని మనం ఆశిస్తున్నామని, అదే సమయంలో మనం సంతకం మాతృభాషలోనే చేస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలని హితవు పలికారు. మన ఇళ్లపై నేమ్ప్లేట్లు మాతృభాషలోనే ఉంటున్నాయా? అని ఏదైనా ఆహ్వానం పంపేటప్పుడు మాతృభాషలోనే పంపిస్తున్నామా? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలని ప్రయత్నించేటప్పుడు చైనాలో ఏం జరుగుతోందో చూడాలని చెప్పారు. ‘ఒక కుటుంబం, ఒక బిడ్డ’ విధానం వల్ల చైనా వృద్ధ దేశంగా మారుతోందన్నారు. భారతదేశ జనాభాలో 57 శాతం మంది యువతే ఉన్నారని, మరో 30 ఏళ్లపాటు మన దేశం యువదేశంగానే కొనసాగుతుందని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ఇప్పటి యువత వృద్ధులుగా మారుతారు, వారందరి ఆకలి తీర్చేటంత ఆహారం మనవద్ద ఉంటుందా? అని ఆన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలు ప్రారంభించాలని, స్వయం ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అందరికీ ఉద్యోగాలిచ్చే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. -
ఆరెస్సెస్ చరిత్రలోనే తొలిసారిగా.. ఎవరామె?
నాగ్‌పూర్: తన సంప్రదాయంలో మార్పును సూచిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ పని చేసింది. పర్వతారోహ దిగ్గజం సంతోష్ యాదవ్ రూపంలో ఒక మహిళను బుధవారం జరిగిన RSS విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ప్రపంచంలోనే తొలి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు సంతోష్ యాదవ్. ఈ సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ భగవత్ మాట్లాడుతూ.. అన్ని ప్రదేశాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని సూచించారు. ‘‘స్త్రీని తల్లిగా భావించడం మంచిది. కానీ, తలుపులు బంధించి వాళ్లను పరిమితం చేయడం మంచిది కాదు. అన్ని చోట్లా నిర్ణయాలు తీసుకునేలా మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అభిప్రాయపడ్డారాయన. ఒక మగవాడు చేయలేని పనులను చేయగలిగే సామర్థ్యం స్త్రీ శక్తికి ఉంది. అందువల్ల వాళ్లకు సాధికారత కల్పించడం, పని చేసే స్వేచ్ఛను ఇవ్వడం, పనిలో సమాన భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం” అని ఆయన అన్నారు. శాంతికి పునాది శక్తి. మహిళా ముఖ్య అతిథి హాజరు గురించి చాలా కాలంగా చర్చించుకుంటున్నాం అని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్త దత్తాత్రేయ హోసబలే సంఘీ కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడంపై ఓ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆరెస్సెస్ అంటే మగవాళ్లకు మాత్రమే అని ముద్ర చెరిపేయాలని ఆయన కోరారట. ఈ తరుణంలో ఆయన అభ్యర్థనను పరిశీలనలకు తీసుకుని.. ఇప్పుడు సంతోష్ యాదవ్‌ను ఇలా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సంతోష్ యాదవ్.. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించారు. పర్వతారోహణలో ఆమె ఒక దిగ్గజం. ఎవరెస్ట్ పర్వతాన్ని రెండుసార్లు (1992, 1993లో) అధిరోహించిన తొలి మహిళగా ఈమె పేరిట ఒక రికార్డు ఉంది. అంతేకాదు కఠినమైన కాంగ్షుంగ్ ముఖం నుండి ఈమె ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మహిళగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆరుగురు తోబుట్టువుల్లో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఆమె పోరాటం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ధైర్యసాహసాలు, ఇతరులకు సహాయం చేసే ఆమె మంచి మనసు కూడా చర్చించుకునే అంశమే. డిగ్రీ చదివే రోజుల్లో తన హాస్టల్ రూం నుంచి ఆరావళి పర్వతాలను అధిరోహిస్తున్న పర్వతారోహకులను చూసి ఆమె స్ఫూర్తిని పొందారు. 1992లో.. తన తోటి పర్వతారోహకుడైన మోహన్ సింగ్‌తో ఆక్సిజన్‌ను పంచుకోవడం ద్వారా ఆమె ఆయన ప్రాణాలను కాపాడగలిగారు. ఎవరెస్ట్‌ను అధిరోహించేనాటికి ఆమె వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అతిచిన్న వయసులో ఎవరెస్ట్ సాహసం చేసిన ఘనత కూడా ఆమెదే. 2013లో మాలవత్ పూర్ణ పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించే వరకు ఆ రికార్డు సంతోష్ యాదవ్ పేరిట పదిలంగా ఉండిపోయింది. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం సంతోష్ యాదవ్‌ను పద్మ శ్రీ పురస్కారం అందించి గౌరవించింది. -
మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశంలో మత సహనాన్ని పెంపొందించడానికి గత కొన్ని వారాలుగా ముస్లిం మేధావులతో మంతనాలు జరుపుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురు వారం ఒక మసీదు, మదర్సాను సందర్శించారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాస్‌ను కలుసుకొని ఏకాంతంగా గంటకు పైగా చర్చలు జరిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఒక మసీదుని సందర్శించారు. తర్వాత ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో మదర్సాకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తమ ఆహ్వానం మేరకే భగవత్ మసీదు, మదర్సాకి వచ్చారని ఇలియాస్ వెల్లడించారు. -
సామాజిక పరివర్తనే సంఘ్ లక్ష్యం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపితమై నూరేళ్లకు చేరువవుతోంది. అప్పటి నుంచీ అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తూనే ఉంది. నేడు సంఘ్ కార్యకలాపాలు ‘శాఖ’ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాయి. ‘దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో స్వయంసేవక్‌ను అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్ చేస్తారు. సంఘ్ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపన జరిగి 100 సంవత్సరా లకు చేరువ అవుతున్నది. 1925లో నాగపూర్‌లో సంఘ్ స్థాపన జరిగింది. ఈ సంవత్సరం విజయదశమి నాటికి సంఘ్ ప్రారంభమై 97 సంవత్సరాలు పూర్తవుతాయి. కార్యకర్తల కృషి, త్యాగం, బలి దానాల ఫలితంగా... అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తున్నది. ఈ కారణంగానే అంతటా సంఘ్ గురించిన చర్చ జరుగుతున్నది. సంఘ్ తన శతాబ్ది వేడుకలను ఎలా జరుపుకుంటుందనే ఆసక్తి సైతం ప్రజల్లో నెలకొంది. నిజానికి సంఘ్ శతాబ్ది వేడుకలు నిర్వహించాలనే ఆలోచన లేదు. సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దృష్టి చాలా స్పష్టమైనది. సంఘ్ సమాజంలో ఒక సంస్థ మాత్రమే కాదు, యావత్ సమాజాన్ని సంఘటితం చేసేది. సంఘ్ ఒక సంపూర్ణ సమాజం. సంఘ్ సాధనను సమాజమంతటా విస్తరింపజేయడం లక్ష్యంగా ఉండాలి. సంఘ్ రజ తోత్సవం సైతం జరుపుకోరాదని హెడ్గేవార్ చెబుతుండేవారు. అంతకుమునుపే కార్యాన్ని పూర్తి చేయాలనే ఆశయంతో పూర్తి శక్తి యుక్తులతో నిమగ్నమయ్యారు. కానీ వారికి కేవలం 15 సంవత్సరాల సమయం మాత్రమే లభించింది. కనుక శతాబ్ది సంవత్సరానికి ముందే సంఘ్ కార్యాన్ని పూర్తి చేయడమే లక్ష్యమై ఉండాలి. సంఘ్ కార్య విస్తరణ యాత్రలో నాలుగు దశలు ఉన్నాయి. సంఘ్ స్థాపన నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు మొదటి దశగా భావిం చాలి. ఈ దశలో ఏక చిత్తంతో, ఏకాగ్రతతో కేవలం ‘సంఘటన’పై మాత్రమే దృష్టి పెట్టింది. ఎందుకంటే హిందూ సమాజం సంఘటి తమవుతుంది; ఒకే మనస్సుతో, ఒకే స్వరంతో భారత్ గురించి, హిందుత్వ గురించి మాట్లాడగలము అనే ఒక విశ్వాసాన్ని పాదు గొల్పడం అప్పుడు ముఖ్యం. అందుకనే ఆ లక్ష్యం కోసమే యావత్ కార్యం సాగింది. ‘స్వ’ ప్రేరణగా కొనసాగిన స్వరాజ్య ఉద్యమం ఆధారంగా... విద్య, విద్యార్థి, రాజకీయం, కార్మికులు, వనవాసీ సమాజం, వ్యవసాయం తదితర రంగాల్లో భారతదేశపు శాశ్వతమైన జాతీయ దృక్పథానికి ప్రభావితమై వివిధ సంస్థలు ఆవిర్భవించాయి. నేడు సంఘ్ కార్యకలాపాలు ‘శాఖ’ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాయి. సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్రలో మూడవ దశ డాక్టర్ హెడ్గేవార్ జయంతి శతాబ్దిని పురస్కరించుకొని 1990లో ఆరంభ మైంది. యావత్ సమాజం ఆత్మీయత, ప్రేమ ప్రాతిపదికన సంఘ టితం కావాలి. అందుకు సమాజంలో వంచితులు, దుర్బలులు, వెనుకబడిన వర్గాలు, కనీస సౌకర్యాలకు నోచుకోకుండా జీవించే వారిని చేరుకొని వారికి సహాయం, సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా భావించాలి; వారి సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 1990లో ‘సేవా విభాగ్’ ఆరంభమయ్యింది. ‘దేశపు సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో స్వయంసేవక్‌ను అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్ చేస్తారు. ఈ సర్వతోముఖాభివృద్ధి కార్యాన్ని కేవలం స్వయంసేవక్‌లు మాత్రమే చేయడం లేదు; వారితో మాత్రమే అది సాధ్యం కాదు; సమాజంలోని అనేక మంది ప్రభావశీలురు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షించేవారు కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. సమా జంలో అలాంటి ప్రభావశీలుర లక్షణాలు, వారి క్రియాశీలత లాంటి సమాచార సేకరణకు... సంఘ్ భావజాలం, కార్య కలాపాల గురిం చిన సమాచారాన్ని వారికి చేరవేసే దిశగా 1994లో ‘సంపర్క్ విభాగ్’ ఆరంభమైంది. సంఘ్‌లో సభ్యులు కాకున్నా కొన్ని విషయాల్లోనైనా మాతో సారూప్యం ఉన్నవారిని కలిసి ఆలోచనలను పంచుకుంటాం. 2008–09 మధ్యకాలంలో ‘గో–గ్రామ యాత్ర’ మొదలైనప్పుడు అనేక ప్రాంతాల్లోని సర్వోదయ కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. అన్ని విషయాల్లోనూ సంఘ్ భావజాలం, దృక్పథంతో ఏకీభవించక పోయినా అంశాలవారీగా సంఘ్ కార్యకలాపాల్లో పాలుపంచు కుంటున్నారు. అదే విధంగా వివిధ ప్రసార మాధ్యమాలను వినియోగించడం ద్వారా సంఘ్ జాతీయ భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేయడం కోసం, సంఘ్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి దీటుగా జవాబు చెప్పడం కోసం, సంఘ్‌కు చెందిన సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం, సంఘ్ సత్ కార్యాలను సమాజానికి తెలియపరిచే ఉద్దేశ్యంతో 1994లో ‘ప్రచార్ విభాగ్’ ఆరంభమయ్యింది. సంఘ్‌కు చెందిన ఈ మూడు విభాగాలూ (సేవ, సంపర్క్, ప్రచార్) సుదూర ప్రాంతాల ప్రజలకు సంఘ్‌ను చేర్చడం ద్వారా సమాజాన్ని మేల్కొ లిపే కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇదే సమయంలో ‘ధర్మజాగరణ్ విభాగ్’ ద్వారా హిందూ సమాజాన్ని వేరే మతంలోకి మార్చడాన్ని అడ్డుకోవడంతో పాటుగా, మత మార్పిడికి గురైన ప్రజలకు తిరిగి వారిదైన సంస్కృతిలోకి తీసుకు రావడానికీ కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వంపై ఆధాపడకుండా ప్రజలందరూ కలిసికట్టుగా తమ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసుకునే లక్ష్యంగా ‘గ్రామ్–వికాస్’ కార్యక్రమం కూడా ఆరంభమైంది. ఏకత్వంతో కూడుకున్న హిందూ సమాజం వివిధ కులాలుగా మనుగడ సాగిస్తున్నందున... వారిలో అందరూ ఒకటే అనే భావాన్ని తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశ్యంతో ‘సామాజిక్ సద్భావ్’ పేరిట వరుస సమావేశాలు ప్రారంభమయ్యాయి. మన సమాజంలోని అంటరానితనం పేరిట కొన్ని వర్గాలకు విద్య, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు దురుదృష్టవశాత్తూ తిరస్కరణకు గురయ్యాయి. ఇది చాలా అన్యాయమైనది. ఈ అన్యాయాన్ని నివారించి, అందరినీ కలిసి కట్టుగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ‘సామాజిక్ సమరసత’ పని మొదలైంది. భారతీయ దేశీ గోవుల నుంచి మనం పొందే ఉత్పత్తుల్లో ఔషధీయ విలువల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, భారతీయ దేశీ గోవుల సంరక్షణ, సంవర్ధనతోపాటూ ఆవు పేడ ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేపట్టే దిశగా రైతుల శిక్షణ, పర్యవేక్షణ కోసం ‘గోసేవ–గోసంవర్ధన్’ కార్యక్రమం కూడా విజయ వంతంగా సాగుతున్నది. భారతీయ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ‘నేను నుంచి మనం వరకు సాగించే ప్రయాణంలో’ కుటుంబానిది తొలి అడుగు అవుతుంది. వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని సంస్కృతి వారత్వాలు, సామాజిక పరిస్థితులను జాతీయ దృక్కోణంలో విశ్లేషించుకుని... తమ కర్తవ్యాన్ని నిర్ణయిం చుకోవడానికి సహకరించే ‘కుటుంబ్ ప్రబోధన్‘ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ప్రజల భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడం ద్వారా దెబ్బ తిన్న ప్రకృతి సంతులతను పునరుద్ధరించడానికి ‘పర్యావరణ్ సంర క్షణ్’ కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంసేవక్‌లు ఈ పనులన్నిం టినీ ‘గతివిధి’ పేరుతో సమాజం ముందుంచి ఆరంభించారు. సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర మూడవ దశలో ఇది ఒక భాగం. ప్రస్తుతం సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర నాల్గవ దశ సాగుతున్నది. దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి స్వయం సేవక్... సంఘ్ కార్యకర్తగా పనిచేస్తాడు. అందువల్ల ప్రతి ఉద్యోగి స్వయంసేవక్ సామాజిక మార్పు కోసం తన ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా రంగంలో సామాజిక పరివర్తన, మార్పు కోసం చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించడమైనది. ప్రస్తుతం ప్రతి ఒక్క స్వయంసేవక్ సమాజ పరివర్తనలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలి. వీటన్నింటి ద్వారా సంఘ్ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది. వ్యాసకర్త సహ సర్ కార్యవాహ, ఆర్ఎస్ఎస్ -
ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ కాదు: భగవత్
ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వెనుక నుంచి నడిపిస్తోందని మీడియా చిత్రీకరిస్తోందని, అది నిజం కాదని సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ వంటిదని మీడియా అంటోంది. అది అబద్ధం. స్వయంసేవకులకు ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఏం పొందారని మమ్మల్ని కొందరు అడుగుతున్నారు. నా సమాధానం ఒక్కటే. పొందడానికి బదులు మేం ఉన్నది కోల్పోవచ్చు’అని వ్యాఖ్యానించారు. -
మతం మారితే బహిరంగపరచాలి
ధార్వాడ్: మత మార్పిడుల్ని నిరోధించాలని, ఒకవేళ ఎవరైనా మతం మారితే బహిరంగంగా వెల్లడించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయపడింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఏ రాష్ట్రమైనా తీసుకువస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేసింది. అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఏబీకేఎం) మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే శనివారం మీడియాతో మాట్లాడారు. మతమార్పిడుల్ని నిరోధించాలన్నదే ఆరెస్సెస్ విధానమన్నారు. ఒకవేళ ఎవరైనా మతం మార్చుకుంటే దానిని బహిరంగంగా వ్యక్తపరచాలని డిమాండ్ చేశారు. మతం మారిన తర్వాత కూడా బయటపెట్టకపోతే వారు రెండు రకాలుగా లబ్ధిని పొందుతున్నారని అన్నారు. బలవంతపు మత మార్పిడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని అన్నారు. అందుకే మత మార్పిడి నిరోధక చట్టాన్ని మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బలవంతగా మత మార్పిడిని ఆరెస్సెసే కాదు మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు పదికి పైగా రాష్ట్రాలు మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. -
మహిళలపై ఆర్ఎస్ఎస్, తాలిబన్ అభిప్రాయం ఒక్కటే!
భోపాల్: ఉద్యోగాలు చేసే మహిళల విషయంలో మన దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ల అభిప్రాయం ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, తాలిబన్లు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోనంత వరకూ ఇదే నిజమని భావించాల్సి వస్తుందని చెప్పారు. 2013లో మోహన్ భగవత్ మాట్లాడినట్లు చెబుతున్న ఓ వీడియోను దిగ్విజయ్ ప్రస్తావించారు. పెళ్లి అనేది ఒక కాంట్రాక్టు, పెళ్లయిన మహిళలు ఇళ్లల్లోనే ఉండాలి, ఇంటి పనులు చూసుకోవాలి అని మోహన్ భగవత్ అన్నారని గుర్తుచేశారు. అఫ్గాన్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదని తాలిబన్లు తేల్చిచెబుతున్నారని వెల్లడించారు. దిగ్విజయ్ ట్వీట్‌ను మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ తప్పుపట్టారు. దిగ్విజయ్‌తోపాటు కాంగ్రెస్ నాయకత్వం తాలిబన్ల మద్దతుదారులని ఆరోపించారు. -
నేడు ఆర్ఎస్ఎస్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విపక్షాల నుంచి అన్ని వైపుల నుంచి దాడిని ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై నేడు ఢిల్లీలో జరిగే కీలక సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా సుమారు 10మంది కీలక నాయకులు హాజరు కానున్నారు. అందులో పలువురు బీజేపీ నేతలు సైతం ఉండే అవకాశాలున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబలే, కృష్ణ గోపాల్, సురేష్ సోని, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకుని కసరత్తులు మొదలుపెట్టారు. గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు దేశంలోని పరిస్థితులపై సంఘ్ ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. బెంగాల్లో పరిస్థితి ఏంటి? ఈ భేటీలో నాలుగు ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగాల్ ఎన్నికలలో ఓటమి, బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఏ దిశలో ముందుకు వెళ్ళాలనే విషయంపై చర్చించనున్నారు. బెంగాల్లో ఓటమితో నిరాశలో ఉన్న కమలదళంలో తిరిగి ఉత్తేజం నింపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఒక ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. మరోవైపు, టీఎంసీని వదిలి ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చిన నాయకులు తిరిగి టీఎంసీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని జరుగుతున్న ప్రచారంపైనా, ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయి. యూపీలో మార్పు సాధ్యమేనా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రాజకీయ ప్రతిష్టంభనను తగ్గించడంతో పాటు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి గల కారణాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన ఎమ్మెల్యేల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కుల ప్రాతిపదికన ఆరోపించారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ముఖ్యమంత్రి మధ్య విబేధాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయనే చర్చ జరుగుతోంది. అంతేగాక కేశవ్ ప్రసాద్ మౌర్యకు వచ్చే ఏడాది రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రచార బాధ్యతలను అప్పగించడంతో పాటు, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే విషయంలో బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితిలో, రాబోయే ఎన్నికల్లో బిజెపి ఎలా విజయం సాధిస్తుందనేది పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో నేటి ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో ఒక స్పష్టత కోసం ప్రయత్నం జరగవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. డ్యామేజ్ కంట్రోల్‌పై ప్రత్యేక దృష్టి: మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో మోడీ ప్రభుత్వం తన విశ్వసనీయతను ఎందుకు కోల్పోయింది. కరోనాతో వ్యవహరించడంలో ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? కేంద్ర మంత్రివర్గంలో మార్పు వల్ల పార్టీకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా వంటి అంశాలపై జరుగుతున్న చర్చకు ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో దేశం సంక్రమణ పట్టులో చిక్కుకున్న సమయంలోనూ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు బెంగాల్లో ప్రచారంపై దృష్టిపెట్టడంపై వచ్చిన విమర్శలతో జరిగిన డ్యామేజీని చక్కదిద్దే ప్రయత్నం ఈ భేటీలో జరుగనుందని సమాచారం. అంతేగాక ఇటీవల పలు టీవీ ఛానల్స్ నిర్వహించిన సర్వేల్లో ప్రధాని మోదీ, అమిత్ షా విశ్వసనీయత తగ్గిందని జరుగుతున్న చర్చ కమలదళంపై ప్రభావాన్ని చూపకముందే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందు కు సంఘ్–బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలో జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో శనివారం జరుగుతున్న ఈ భేటీలో చర్చించే అంశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కమలదళం అధికారంలోకి వచ్చిన చాలా కాలం తరువాత బీజేపీ విశ్వసనీయతను కాపాడే పనిలో ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇప్పుడు బిజీగా ఉన్నారు. రాష్ట్రాల్లో, కేంద్రంలో ఉన్నపళంగా కీలక మార్పులు చేసిన పక్షంలో బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రైతు ఉద్యమం ఇంకెన్నాళ్లు? దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 6 నెలలకు పైగా కొనసాగుతున్న రైతుల ఉద్యమం బీజేపీ–ఆర్ఎస్ఎస్కు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఉద్యమాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే రైతులు విసుగు చెంది ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగదని, అది విచ్ఛిన్నమవుతుందని కేంద్రప్రభుత్వం భావించింది. కానీ అది జరగలేదు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడే, ఇళ్ళకు తిరిగి వెళ్తామని రైతులు ఇప్పటికే స్పçష్టంచేశారు. కాగా ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలో ముఖ్యమంత్రి, మంత్రుల బహిరంగ కార్యక్రమాలను సైతం రైతులు నిషేధించారు. కొన్ని రోజుల క్రితం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ప్రధానిని కలిసి ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ భేటీలో బీజేపీ ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి. -
ఆర్ఎస్ఎస్ అర్థం కావాలంటే చాన్నాళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోనే అతిపెద్ద దేశభక్తియుత పాఠశాల ఆర్ఎస్ఎస్’అని బీజేపీ కొనియాడింది. హిందూత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను రాహుల్ గాంధీ పాకిస్తాన్‌లోని రాడికల్ ఇస్లామిక్ వ్యవస్థతో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా దుయ్యబట్టింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ అధికార బీజేపీకి సైద్ధాంతిక భూమికనిచ్చిన ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి చాలా సమయం పడుతుందని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘ఆర్ఎస్ఎస్.. ప్రపంచంలోనే అతిపెద్ద దేశభక్తియుత పాఠశాల. అందుకే అది అత్యున్నత స్థానంలో ఉంది’ అని జవదేకర్ అన్నారు. ప్రజల్లో మంచి మార్పు తీసుకురావడమూ, వారిలో దేశభక్తిని పెంపొందించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని జవదేకర్ అన్నారు. పాకిస్తాన్‌లోని ఇస్లామిస్ట్‌లు నిర్వహిస్తోన్న మదర్సాల మాదిరిగా భారత్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తోన్న పాఠశాలలున్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా, జవదేకర్ స్పందించారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌషిక్ బసుతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, 1975లో మాజీప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం తప్పు అని వ్యాఖ్యానించారు. అయితే ఆనాడు వ్యవస్థలను టార్గెట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదని రాహుల్ స్పష్టం చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలు హస్యాస్పదం అని జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థల స్వాతంత్య్రాన్ని ఆనాడే కాలరాసిందని, పత్రికా స్వేచ్ఛను హరించిందని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారి గొంతు నులిమి వేసిందనీ జవదేకర్ విమర్శించారు. ఎంపీలూ, ఎమ్మెల్యలేతో సహా లక్షలాది మంది ప్రజలను ఎమర్జెన్సీలో అరెస్టు చేశారని, సంస్థల స్వాతంత్య్రాన్ని హరించివేశారని జవదేకర్ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన బెంగాలీ హిందువులు, బుద్ధిస్టులకు పౌరసత్వం ఇవ్వాలని 2015లో డిమాండ్ చేసిన కాంగ్రెస్, అస్సాంలో తమని గెలిపిస్తే సీఏఏని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ జనరల్సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానించడం ఎన్నికల అవకాశవాదమని జవదేకర్ ట్వీట్ చేశారు. -
ఆర్ఎస్ఎస్ కీలక సమావేశం రద్దు
బెంగళూరు: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా(కోవిడ్-19) కారణంగా చాల కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ తన కీలక సమావేశాన్ని రద్దు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) వార్షిక సమావేశాలు ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూరులో జరగాల్సిఉంది. దీని కోసం ఆర్ఎస్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, విద్యా భారతి, వనవాసి కల్యాణ్ ఆశ్రమ్, సక్షామ సహా 35 పరివార్ సంస్థల అధినేతలు హాజరుకావాల్సింది. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు సైతం ఈ సమావేశాల్లో పాల్గొనాల్సింది. తొలుత ఈ సమావేశానికి వచ్చే కార్యకర్తలకు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించి.. అనుమతించాలని అనుకున్నారు. కానీ ఇది అసాధ్యమని భావించి సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. (కరోనా తొలి మరణం: కర్ణాటక యాక్షన్ ప్లాన్!) -
ఆర్ఎస్ఎస్ మూలస్తంభం
ఆర్ఎస్ఎస్గా నేడు అందరికీ సుపరిచితమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బహుముఖాలుగా విస్తరించడానికి కీలకమైన భూమిక పోషించినవారు గోల్వాల్కర్. మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గర గల రాంటెక్‌లో 1906 ఫిబ్రవరి 19న సదాశివరావు, లక్ష్మీబాయ్ దంపతులకు మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ జన్మించారు. తొమ్మిదిమంది సంతానంలో బతికి బట్టకట్టినది ఈయన ఒక్కరే. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి తరచూ బదిలీలు కావడంతో చిన్నతనంలో దేశంలోని వివిధ ప్రాంతాలను గోల్వాల్కర్ చూశారు. అప్పటి నుంచే ఆయనలో మతపరమైన, ఆధ్యాత్మికమైన ఆసక్తి పెరిగింది. క్రైస్తవాన్ని తీవ్రంగా వ్యతిరేకించి హిస్లాప్ కాలేజీని వదిలిపెట్టి వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరి సైన్స్ లో 1927లో డిగ్రీ చేయడంతోపాటు, 1929లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. తరువాత మెరైన్ బయోలజీ చేయడానికి మద్రాస్ వెళ్లినప్పటికీ తండ్రి పదవీ విరమణ కారణంగా పూర్తి చేయకుండానే వెనక్కి వచ్చి బెనారస్ యూనివర్సిటీలోనే జువాలజీ బోధించడం ప్రారంభించారు. గోల్వాల్కర్ ధరించే సామాన్యమైన దుస్తులు, పొడవాటి గడ్డం కారణంగా ఆయనను గురూజీ అని పిలిచేవారు. తరువాత నాగపూర్ చేరుకున్న ఆయన అప్పటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ సంచాలక్ కె.బి. హెగ్డేవార్ సలహా మేరకు 1937లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. నాగపూర్ శాఖకు 1934లో కార్యదర్శిగా నియమితులైన గోల్వాల్కర్‌ను 1939లో ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు హెగ్డేవార్ ప్రకటించారు. ఆయన మరణానంతరం పగ్గాలు చేపట్టిన గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ను దేశంలోనే బలమైన మతవాద రాజకీయ శక్తిగా నిర్మించారు. లక్షమంది ఉండే సభ్యుల సంఖ్యను పది లక్షలకు చేర్చారు. రాజకీయ, సామాజిక, మత, విద్య, కార్మికరంగాలకు 50 ప్రధాన శాఖల ద్వారా విస్తరించారు. ఆర్ఎస్ఎస్ను విదేశాలకు కూడా విస్తరించారు. భారతీయ స్వయం సేవక్ సంఘ్, హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరిట ఏర్పడిన సంస్థల్లో పలువురు హిందువులు సభ్యులుగా చేరారు. ఆర్ఎస్ఎస్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గోల్వాల్కర్ 1973, జూన్ 5న కన్నుమూశారు. (రేపు గోల్వాల్కర్ జయంతి సందర్భంగా) -
ఆరెస్సెస్ చీఫ్‌పై కేంద్ర మంత్రి విమర్శలు!
-
ఆరెస్సెస్ చీఫ్‌పై కేంద్ర మంత్రి విమర్శలు!
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయులంతా హిందువులే అనడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో ఆరెస్సెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు హాజరైన విషయం విదితమే. ఈ క్రమంలో మోహన్ భగవత్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ... భారత్‌లో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు, సంప్రదాయలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమేనని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ దృష్టిలో 130 కోట్ల మంది భారతీయులు హిందువులేనని పేర్కొన్నారు. (చదవండి : భరతమాతను ఆరాధించేవారంతా హిందువులే) ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సామాజిక న్యాయ శాఖా మంత్రి రాందాస్ అథవాలే.. మోహన్ భగవత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘భారతీయులంతా హిందువులేనని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఒకప్పుడు మన దేశంలో బుద్ధులు మాత్రమే ఉన్నారు. హిందుత్వ ఆవిర్భవించిన తర్వాతే మన దేశం హిందూ దేశంగా మారింది. నిజానికి భారత్‌లో ఉన్న వాళ్లంతా భారతీయులేనని మోహన్ భగవత్ చెప్పి ఉంటే బాగుండేది. మన దేశంలో బుద్ధులు, సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, పార్శీలు, జైనులు, లింగాయత్‌లు ఉన్నారు. వేర్వేరు మత విశ్వాసాలు గల వారు ఇక్కడ నివసిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు రాందాస్ అధ్యక్షుడన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఘాటుగా స్పందించారు. భారత్‌లో కేవలం ఒక మతం మాత్రమే ఉండాలని ఆరెస్సెస్ భావిస్తోందని.. అయితే అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు అది సాధ్యం కాదని పేర్కొన్నారు. Union Min Ramdas Athawale on Mohan Bhagwat's remark '130 cr population of India as Hindu society': Not right to say all are Hindus.There was a time when everyone was Buddhist in our country. When Hinduism came, we became a Hindu nation. If he means everyone is ours then it's good pic.twitter.com/bXWIsHhDbU — ANI (@ANI) December 26, 2019 -
అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు: ఆరెస్సెస్
పుష్కర్: సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి కనుకనే రిజర్వేషన్ల అవసరం ఉన్నదనీ, లబ్ధిదారులకు రిజర్వేషన్ల అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టం చేసింది. మంచినీటి విషయంలోనూ, శ్మశానాల్లోనూ, దేవాలయాల్లోనూ అందరికీ ప్రవేశం ఉండాలనీ, నీటి వనరుల వాడకాన్ని కులంపేరుతో నిరాకరించడం తగదనీ ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధానకార్యదర్శి దత్తాత్రేయ హోసబేల్ తేల్చి చెప్పారు. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలున్నాయనీ, అందుకే రిజర్వేషన్ల కొనసాగింపు అవసరమనీ ఆర్ఎస్ఎస్ భావిస్తోం దన్నారు. రాజస్తాన్‌లోని పుష్కర్‌లో మూడు రోజుల పాటు జరిగిన సంఘ్‌పరివార్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి 35 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల నుంచి 200 మంది ప్రతిని«ధులతోపాటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా, జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్‌లు హాజరయ్యారు. -
2025లోపు రామమందిరం: భయ్యాజీ
ప్రయాగ్‌రాజ్: అయోధ్యలో రామమందిర నిర్మాణం 2025లోపు పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మందిర నిర్మాణం ప్రారంభించాలన్నారు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లుగానే మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుందని ప్రధాని మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాక భయ్యాజీ పైవిధంగా స్పందించారు. -
యుద్ధమే లేదు.. మరి ఎందుకిలా జరుగుతోంది?!
ముంబై : మన దేశంలో యుద్ధమేమీ జరగడం లేదు.. కానీ సైనికుల మాత్రం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన ప్రహార్ సమాజ్ జాగృతి సంస్థ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘మన దేశంలో యుద్ధం జరగనప్పటికీ ఎంతో మంది సైనికులు అసువులు బాస్తున్నారు. యుద్ధం జరగని క్రమంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు పోరాడాలి. ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీతో బాటుగా సాధారణ పౌరులు కూడా దేశ భద్రతలో తమ వంతు పాత్ర పోషించాలి. దేశంలో అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రభావం చూపుతాయి. ద్రవోల్బణం పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. వీటికి నేనో, మీరో కారణం కానే కాదు. అయినప్పటికీ వీటి ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తోంది. ఎందుకిలా జరుగుతోందంటే మన పని మనం సరిగ్గా చేయడం లేదు కాబట్టే. అందుకే ఇకపై దేశం కోసం జీవించడం అలవర్చుకోవాలి. అప్పుడే అందరూ బాగుంటారు’ అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. -
కేరళ సీఎంకు బాబా రాందేవ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్తకర్తలు, నేతలపై కేరళ సీఎం చేసిన ఆరోపణల్ని ఖండించారు. ఆరెస్సెస్‌కు చెందిన ఎంతో మందిని తాను దగ్గరి చూశానని, వారిలో ఉగ్రవాదులు ఎవరూ లేరని రాందేవ్ బాబా పేర్కొన్నారు. ఆరెస్సెస్ నాయకులు, కార్తకర్తలు ఎంతో మంది తనకు తెలుసునని, కానీ వారిలో ఏ ఒక్కరూ ఉగ్రవాదులు గానీ, నక్సలైట్స్ వర్గాలకు చెందిన వాళ్లు లేరని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. దేశానికి చెందిన ఓ జాతీయ గ్రూపు లాంటిది ఆరెస్సెస్ అని చెప్పారు. దేశానికి హాని కలిగించే పనులు వారు చేయరంటూ పినరయి విజయన్ వ్యాఖ్యలను యోగా గురువు తిప్పికొట్టారు. అసలు వివాదం ఏంటంటే.. 'పీఎఫ్ఐ, ఆరెస్సెస్ గ్రూపులు ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తున్నాయి. చట్ట వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని దేవాలయాల్లోనూ కర్రలతో దాడి చేయడంపై యువకులకు శిక్షణ ఇస్తున్నారు. అవసరమైతే కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆరెస్సెస్ చర్యలను నిషేధించాలంటూ' కేరళ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో బుధవారం వ్యాఖ్యానించడం దూమారం రేపిన విషయం తెలిసిందే. -
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా భయ్యాజీ
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శిగా సురేష్ భయ్యాజీ జోషి మరోసారి ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన సంఘ్ సమావేశంలో ఆయన మరో దఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న సంఘ్ ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. 2009 నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న భయ్యాజీ జోషి తాజా ఎన్నికతో 2021 వరకు పదవిలో ఉంటారు. జోషితోపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఆర్ఎస్ఎస్ వ్యవహారాలను పర్యవేక్షించే నాగరాజ్ క్షేత్రీయ సంఘ్ సంచాలక్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ సమావేశాలు
హైదరాబాద్: నగరంలోని అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను మోహన్ భగవత్, భయ్యాజీ జోషి ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు 400 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు, ఎల్లుండి సమావేశాల్లో అమిత్ షా పాల్గొననున్నట్టు సమాచారం. -
నేటి నుంచి ఆర్ఎస్ఎస్ సమావేశాలు
హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యావిహార్‌లో జరుగుతాయని సంఘ్ అఖిలభారత ప్రచారక్ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు. అన్నోజిగూడలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ జాతీయ సర్సంఘ్ చాలక్ మోహన్‌జీ భగవత్, భయ్యాజీ వంటి ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. ఆర్ఎస్ఎస్కి చెందిన 42 రాష్ట్రాల(ప్రాంతాలు)కు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహకులు, అఖిల భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొంటారని వివరించారు. మౌలిక విషయాలు, జాతీయ అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశాల్లో ఏదైనా ఒక రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రచారక్ ప్రముఖ్ ఆయుష్ తెలిపారు. -
సంఘ్ ఖాకీ నిక్కర్ అవుట్
ఆరెస్సెస్ నిర్ణయం ఇక యూనిఫాంలో గోధుమరంగు ప్యాంటు కాలానికి తగ్గట్లు మారుతున్నామన్న భయ్యాజీ నాగౌర్(రాజస్తాన్): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అంటే ముందుగా గుర్తొచ్చేది వదులుగా ఉండే ఖాకీ నిక్కర్, తెల్లచొక్కా యూనిఫాం. 91 ఏళ్లుగా ట్రేడ్‌మార్క్‌గా ఉన్న ఖాకీ నిక్కర్‌ను మారుస్తూ ఆరెస్సెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో గోధుమరంగు ప్యాంటును తెస్తున్నట్లు ప్రకటించింది. ఆరెస్సెస్ మూడురోజుల మేధోమథన సదస్సు ఆదివారమిక్కడ ముగిసింది. 1925లో ఆరంభమైన ఆరెస్సెస్ యూనిఫాంలో చిన్నచిన్న మార్పులు జరిగినప్పటికీ ఖాకీ నిక్కర్ ఇప్పటిదాకా మారలేదు. దీనిపై ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ మాట్లాడుతూ, తాము తీసుకున్న నిర్ణయాల్లో ఇదే పెద్ద నిర్ణయమన్నారు. తాము కాలానికి తగ్గట్లు మారతామని, మారకపోతే ఏ సంస్థ కూడా పురోగతి సాధించలేదన్నారు. యువతను ఆకర్షించి సభ్యత్వాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గోధుమ రంగును ఖరారు చేయడం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం లేదని, అది ఎప్పుడూ అందుబాటులో ఉండటంతోపాటు చూడ్డానికి బాగుంటుందని పేర్కొన్నారు. మహిళలకూ ఆలయ ప్రవేశం ఏ ఆలయంలోనైనా మహిళలను అనుమతించకపోవడం అసంబద్ధమని, ఆలయ నిర్వాహకులు తమ ధోరణిని మార్చుకోవాలని ఆరెస్సెస్ సూచించింది. శని శింగ్నాపూర్, త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించకపోవడంతో పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లోని అనుచిత సంప్రదాయాలతోపాటు, మహిళల ఆలయ ప్రవేశంపై ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని భయ్యాజీ చెప్పారు. ఇది చాలా సున్నితమైన అంశమని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే గానీ, ఆందోళనలతో కాదన్నారు. మహిళలు కూడా వేదాలు నేర్చుకుంటున్నారని, మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సంపన్నులకు కోటా వద్దు సంపన్న వర్గాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమించడాన్ని సమర్థించబోమని సంఘ్ నేత భయ్యాజీ చెప్పారు. వారు వెనుకబడిన వర్గాలుగా కోటా ప్రయోజనాలు పొందాలంటే, దీనిపై సమగ్ర అధ్యయనం జరగాలన్నారు. అంబేడ్కర్ సామాజిక న్యాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని, రిజర్వేషన్లపై డిమాండ్ చేసేవారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సంపన్న వర్గాలు రిజర్వేషన్లు పొందుతోంటే గనుక ఆ హక్కును వదులుకొని, బలహీన వర్గాలకు సాయం చేయాలన్నారు. -
ఆరెస్సెస్ అనుబంధ సంస్థకు పీఎంవో షాక్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తో అనుబంధమున్న విజ్ఞాన భారతి సంస్థకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో తమకు ప్రదానం చేయాల్సిన అవార్డును చివరిక్షణంలో పీఎంవో తిరస్కరించడంపై ఆ సంస్థ నిరసన వ్యక్తంచేస్తోంది. దేశీయ విజ్ఞానాన్ని (సైన్స్) అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తున్న విజ్ఞానభారతి సంస్థకు అనిల్ కకోద్కర్, జీ మాధవన్ నాయర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 7న ఢిల్లీ ఐఐటీలో భారీస్థాయిలో 'ప్రాక్టికల్ సైన్స్ లెసెన్స్'ను నిర్వహించడం ద్వారా ఈ సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సపాదించింది. గతంలో ఈ రికార్డు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ పేరిట ఉండేది. ఈ ఘనతను గుర్తించిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తమకు అవార్డు ప్రకటించామని, దీనిని అందుకునేందుకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు రావాలని తెలిపిందని విజ్ఞానభారతి ప్రధాన కార్యదర్శి ఏ జయకుమార్ తెలిపారు. కానీ చివరినిమిషంలో ఈ అవార్డుకు పీఎంవో నుంచి అనుమతి రాలేదంటూ తమకు సమాచారమిచ్చారని, ఇది తీవ్ర దిగ్భ్రాంతికరమని, శాస్త్రవేత్తల లోకానికి షాక్ లాంటిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఎంవో తిరస్కారానికి కారణాలేమిటో కూడా తమకు తెలుపలేదని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన కోరారు. -
రావణాసురుడికి 10 తలలుంటే..
హైదరాబాద్ : సంఘ్‌పరివార్, ఆర్ఎస్ఎస్పై కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రావణాసురుడికి 10 తలలు ఉంటే... సంఘ్‌పరివార్, ఆర్ఎస్ఎస్కు 100 తలలు ఉన్నాయని ఆయన సోమవారమిక్కడ ధ్వజమెత్తారు. ఆ రెండూ...రావణాసురిడిని మించిన దుష్టశక్తులంటూ వ్యాఖ్యానించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ నేతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహంగా ఉన్నారన్న మాటలు బూటకమని జైపాల్ రెడ్డి కొట్టిపారేశారు. కాగా సంఘ్ పరివార్‌ను అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.