బెంగళూరు: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా(కోవిడ్-19) కారణంగా చాల కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ తన కీలక సమావేశాన్ని రద్దు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) వార్షిక సమావేశాలు ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూరులో జరగాల్సిఉంది.
దీని కోసం ఆర్‌ఎస్‌ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, విద్యా భారతి, వనవాసి కల్యాణ్ ఆశ్రమ్, సక్షామ సహా 35 పరివార్ సంస్థల అధినేతలు హాజరుకావాల్సింది. ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు సైతం ఈ సమావేశాల్లో పాల్గొనాల్సింది. తొలుత ఈ సమావేశానికి వచ్చే కార్యకర్తలకు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించి.. అనుమతించాలని అనుకున్నారు. కానీ ఇది అసాధ్యమని భావించి సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. (కరోనా తొలి మరణం: కర్ణాటక యాక్షన్ ప్లాన్!)
Comments
Please login to add a commentAdd a comment