ముంబై : మన దేశంలో యుద్ధమేమీ జరగడం లేదు.. కానీ సైనికుల మాత్రం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన ప్రహార్ సమాజ్ జాగృతి సంస్థ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘మన దేశంలో యుద్ధం జరగనప్పటికీ ఎంతో మంది సైనికులు అసువులు బాస్తున్నారు. యుద్ధం జరగని క్రమంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు పోరాడాలి. ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీతో బాటుగా సాధారణ పౌరులు కూడా దేశ భద్రతలో తమ వంతు పాత్ర పోషించాలి. దేశంలో అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రభావం చూపుతాయి. ద్రవోల్బణం పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. వీటికి నేనో, మీరో కారణం కానే కాదు. అయినప్పటికీ వీటి ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తోంది. ఎందుకిలా జరుగుతోందంటే మన పని మనం సరిగ్గా చేయడం లేదు కాబట్టే. అందుకే ఇకపై దేశం కోసం జీవించడం అలవర్చుకోవాలి. అప్పుడే అందరూ బాగుంటారు’ అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment