
ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) వెనుక నుంచి నడిపిస్తోందని మీడియా చిత్రీకరిస్తోందని, అది నిజం కాదని సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వానికి ఆర్‌ఎస్‌ఎస్ రిమోట్ కంట్రోల్ వంటిదని మీడియా అంటోంది. అది అబద్ధం. స్వయంసేవకులకు ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఏం పొందారని మమ్మల్ని కొందరు అడుగుతున్నారు. నా సమాధానం ఒక్కటే. పొందడానికి బదులు మేం ఉన్నది కోల్పోవచ్చు’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment