
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శిగా సురేష్ భయ్యాజీ జోషి మరోసారి ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన సంఘ్ సమావేశంలో ఆయన మరో దఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉన్న సంఘ్ ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. 2009 నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న భయ్యాజీ జోషి తాజా ఎన్నికతో 2021 వరకు పదవిలో ఉంటారు. జోషితోపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఆర్‌ఎస్‌ఎస్ వ్యవహారాలను పర్యవేక్షించే నాగరాజ్ క్షేత్రీయ సంఘ్ సంచాలక్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.