Bhaiyyaji Joshi
-
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా భయ్యాజీ
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శిగా సురేష్ భయ్యాజీ జోషి మరోసారి ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన సంఘ్ సమావేశంలో ఆయన మరో దఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న సంఘ్ ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. 2009 నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న భయ్యాజీ జోషి తాజా ఎన్నికతో 2021 వరకు పదవిలో ఉంటారు. జోషితోపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఆర్ఎస్ఎస్ వ్యవహారాలను పర్యవేక్షించే నాగరాజ్ క్షేత్రీయ సంఘ్ సంచాలక్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
సంఘ్‌ను బూచిగా చూపే కుట్ర
ఇది హిందూ ధర్మానికే అవమానం: భయ్యాజీ జోషి రాంచి: దాద్రీ ఘటనతోపాటు.. ‘అసహనం’ వివాదంలో తమ సంస్థను బూచిగా చూపెట్టేందుకు కొన్ని వర్గాలు కంకణం కట్టుకున్నాయని ఆరెస్సెస్ ఆరోపించింది. హిందూ సంస్కృతిని, సంస్థలపై దుష్ర్పచారం చేయటం ద్వారా లాభం పొందాలని కొందరు చేస్తున్న ప్రయత్నం సరికాదని.. ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి తెలిపారు. ‘గతంలోనూ ఇలాగే సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ, జరిగిన ఘటనలపై లోతుగా విశ్లేషించినపుడు.. ఆరెస్సెస్ నిర్దోషిగా తేలింది. ఇప్పుడు కూడా అంతే. అనిశ్చితి సృష్టించి దీనికి.. ఆరెస్సెసే కారణమంటూ అర్థరహిత విమర్శలు చేయటం సరికాదు. ఇది హిందూ ధర్మానికే అవమానం’ అని ఆయన తెలిపారు. సమాజంలో చిచ్చు పెట్టే దాద్రి వంటి ఘటనలను తాము కూడా ఖండిస్తున్నామన్నారు. కోటా వ్యవస్థలో మార్పుల విషయంలో రిజర్వేషన్లను సమీక్షించాలనే ఆలోచననూ వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాలు కోలుకునేంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జోషి తెలిపారు. ఈ విషయంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపించారన్నారు. దేశానికి, సమాజానికి సంఘ్ ఏం చేసిందో అర్థం చేసుకోవాలని సూచించారు. -
మరికొంత సమయం వేచి చూస్తాం: భయ్యాజీ జోషీ
లక్నో: అయోధ్య రామమందిరం నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారన్న విశ్వాసాన్ని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషీ వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రామమందిరం నిర్మాణ అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. మరి కొంత సమయం వేచి చూస్తామని భయ్యాజీ జోషీ చెప్పారు. ** -
ఓటు వేయలేకపోయిన భాగవత్
నాగపూర్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వీరిద్దరూ లక్నోలో ఉండడంతో ఓటు వేయలేకపోయారు. మూడు రోజుల పాటు జరగనున్న ఆర్ఎస్ఎస్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వీరు లక్నో వెళ్లారు. ఈ కార్యక్రమం ఏడాది క్రితమే నిర్ణయించినందున వారు వెళ్లక తప్పలేదని ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నాగపూర్ తూర్పు నియోజకవర్గంలో భాగవత్, జోషి ఓట్లు ఉన్నాయి.