
ఓటు వేయలేకపోయిన భాగవత్
నాగపూర్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వీరిద్దరూ లక్నోలో ఉండడంతో ఓటు వేయలేకపోయారు. మూడు రోజుల పాటు జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వీరు లక్నో వెళ్లారు.
ఈ కార్యక్రమం ఏడాది క్రితమే నిర్ణయించినందున వారు వెళ్లక తప్పలేదని ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నాగపూర్ తూర్పు నియోజకవర్గంలో భాగవత్, జోషి ఓట్లు ఉన్నాయి.