భయ్యాజీ జోషీ
లక్నో: అయోధ్య రామమందిరం నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారన్న విశ్వాసాన్ని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషీ వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
రామమందిరం నిర్మాణ అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. మరి కొంత సమయం వేచి చూస్తామని భయ్యాజీ జోషీ చెప్పారు.
**