బీజేపీ నేతలకు ఆరెస్సెస్ స్ట్రాంగ్ వార్నింగ్! | BJP leadership to avoid encouraging individual worship, says RSS | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలకు ఆరెస్సెస్ స్ట్రాంగ్ వార్నింగ్!

Published Wed, Mar 23 2016 3:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ నేతలకు ఆరెస్సెస్ స్ట్రాంగ్ వార్నింగ్! - Sakshi

బీజేపీ నేతలకు ఆరెస్సెస్ స్ట్రాంగ్ వార్నింగ్!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతల తీరుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తీవ్రంగా మండిపడుతోంది. అంతేకాదు బీజేపీ నేతలను ఓ మోస్తరుగా హెచ్చరించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీని 'దేవుడు ఇచ్చిన వరం' (గాడ్స్ గిఫ్ట్) అంటూ అభివర్ణించారు. ఈ విషయంపై ఆరెస్సెస్ కాస్త ఆవేశంగా ఉంది. మంగళవారం జరిగిన మీటింగ్ లో ఈ విషయంపై చర్చించారు.

వ్యక్తి పూజ తగదని బీజేపీ నేతలకు ఆరెస్సెస్ చురకలు అంటించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే మొదటికే మోసం వస్తుందని సంఘ్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంశాలను మాత్రమే తమ ప్రచార, ఇతర కార్యక్రమాలలో ప్రస్తావించాలని బీజేపీ నేతలకు సంకేతాలు పంపింది. ప్రపంచ అగ్రనేతల్లోనే మోదీ ఒకరిని, ఆయన ఇండియాను పూర్తిగా మార్చివేస్తారంటూ వెంకయ్య నాయుడు పేర్కొనడంతో పాటు వ్యక్తిపూజ చేస్తున్నారని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. కేవలం అభివృద్ది అంశాలపైనే దృష్టిసారించాలని మంత్రులు, బీజేపీ నేతలకు జాగ్రత్తలు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement