ఉడీ కన్నా నోట్ల మృతులే ఎక్కువ!
రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండోరోజు నోట్ల రద్దుపై ఉభయసభలు అట్టుడికారుు. విపక్షాల వాయిదా తీర్మానాలను స్వీకరించకుండా, రూల్ 193 కింద స్వల్పకాలిక చర్చగా చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయంపై లోక్‌సభలో విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యసభలో ఉడీ మృతులకన్నా నోట్ల రద్దు మృతులే ఎక్కువన్న ఆజాద్ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. రెండోరోజు సమావేశాల్లో ప్రభుత్వంపై దాడిని విపక్షాలు ముమ్మరం చేశాయి. దీంతో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత లోక్‌సభ తీవ్ర గందరగోళం మధ్య వాయిదా పడింది. రాజ్యసభ ఆరుగంటలపా టు జరిగినా.. నోట్ల రద్దు అంశంపై అధికార ప్రతిపక్షాల ఆందోళనలతోనే సమయం గడిచిపోరుుంది. గందరగోళంతో డిప్యూటీ చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
ప్రధాని ఎక్కడ..?: తృణమూల్
గురువారం సభ ప్రారంభం కాగానే.. స్వామి నారాయణ్ ఆధ్యాత్మిక సంస్థ అధినేత స్వామి శాస్త్రి నారాయణ్ స్వరూప్ దాస్ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. నోట్ల రద్దుపై టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ చర్చ ప్రారంభిస్తూ.. ప్రజలు పడుతున్న కష్టాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని సభలో ఎందుకు లేరని ప్రశ్నించారు. ‘రాత్రి 8 గంటలకు అకస్మాత్తుగా నోట్ల రద్దు నిర్ణయాన్ని వెలువరించిన వ్యక్తి ఎక్కడ?’ అని అన్నారు. దీనికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా, ఎన్డీఏ మంత్రులు, బీజేపీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి చొచ్చుకొచ్చి ‘ప్రధాన మంత్రి సమాధానం ఇవ్వాల’ని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుపై చర్చలో ఆర్థికమంత్రి ఉంటే సరిపోతుందంటూ కురియన్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభ 11.30కి వారుుదాపడింది.
ఆజాద్ ఉడీ వ్యాఖ్యలతో కలకలం
ఈ గందరగోళం మధ్యే సభ రెండుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రభుత్వంపై విమర్శల దాడి ప్రారంభించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూనే.. ఉడీ ఘటనలో అమరులైన జవాన్లకన్నా.. నోట్ల రద్దు ద్వారానే ఎక్కువ మంది చనిపోయారని విమర్శించారు. దీనిపై చర్చకు ప్రధాని హాజరుకావాలని డిమాండ్ చేశారు. ‘ఉడీ ఘటనలో 18 మంచి చనిపోతే.. మోదీ నవంబర్ 8న తన నిర్ణయం ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా 40 మంది ఆందోళనతో మృతిచెందారు. నోట్ల రద్దు వంటి తప్పుడు విధానాల వల్ల చనిపోరుున వారి మృతికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీలదే బాధ్యత’ అని విమర్శించారు. మోదీ నియంతృత్వ ధోరణి వల్ల లక్షల మందికి సరిగా తిండి దొరకటం లేదన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆజాద్ వ్యాఖ్యలు ‘దేశ వ్యతిరేకం’అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహించారు. ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటుందన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని పీజే కురియన్‌ను కోరారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభను కురియన్ శుక్రవారానికి వారుుదా వేశారు. ఆజాద్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇవి ఘోరమైన, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు. అమరవీరులను అవమాన పరిచేవిగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. నల్లధనానికి వ్యతిరేకమని చెప్పిన పార్టీలన్నీ.. నోట్ల రద్దుపై చర్చను ముందుకు సాగనివ్వటం లేదన్నారు.
లోక్‌సభలో గందరగోళం..
గురువారం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాల వారుుదా తీర్మానాన్ని స్వీకరించాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పీకర్‌ను కోరారు. వాయిదా తీర్మానం ప్రకారం, అన్ని సభా కార్యక్రమాలను పక్కనపెట్టి చర్చించి ఓటింగ్ నిర్వహించాలి. అరుుతే రూల్ 193 ప్రకారం స్వల్పకాలిక చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. అనంతరం విపక్షాల వారుుదా తీర్మానాలను తిరస్కరించారు. విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభను మధ్యాహ్నం 12.30కు వారుుదా వేశారు. సభ ప్రారంభమైనా విపక్షాల ఆందోళన కొనసాగింది. ‘నల్లధనం, అవినీతి, దొంగనోట్లపై పార్లమెంటు ఒకే సందేశాన్ని పంపాలి. మోదీ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతుగా ఉన్నారు’ అని అనంత్ కుమార్ తెలిపారు. అరుునా అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవటంతో స్పీకర్ సభను శుక్రవారానికి వారుుదా వేశారు. కాగా, ఆజాద్ ‘ఉడీ’ వ్యాఖ్యలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో గురువారం పొద్దుపోరుున తర్వా త వీటిని రికార్డులనుంచి తొలగించారు.