'జానెడెత్తు కన్హయ్యకు భయపడుతున్నారు' | cpi narayana fires on bjp govt over jnu leader kanhaiya kumar | Sakshi
Sakshi News home page

'జానెడెత్తు కన్హయ్యకు భయపడుతున్నారు'

Published Thu, Mar 24 2016 7:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

cpi narayana fires on bjp govt over jnu leader kanhaiya kumar

విజయవాడ: 'జానెడెత్తు కన్హయ్యకు ఆరడుగుల ప్రధాని మోదీ భయపడుతున్నారని' సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.  గురువారం ఆయనిక్కడ  మాట్లాడుతూ...దేశంలో బీజేపీ నేతలు హిట్లర్ను మించిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుపై నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విజయవాడ సిద్ధార్థ కళాశాలలో తలపెట్టిన కన్హయ్య కుమార్ సభకు అనుమతి రాకుండా వెంకయ్య శిష్యులే అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. వెంకయ్య ఎక్కడా సభలు పెట్టరా..? అని ప్రశ్నించారు. ఇక నుంచి వెంకయ్య నాయుడు సభలకు ప్యాంట్ వేసుకుని రావాలని సూచించారు. కాగా విజయవాడలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ చేపట్టిన సభ ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ చేరుకున్న కన్హయ్యను బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement