assembly polls in five states
-
కాంగ్రెస్ సీనియర్ నేతలతో సోనియా గాంధీ కీలక భేటీ
ఢిల్లీ: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ సమావేశాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు శశిథరూర్, చిదంబరం, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సహా తదితర నాయకులు భేటీలో పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిపినట్లు సమచాారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధించింది. తెలంగాణలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం లభించింది. అయినప్పటికీ పెద్ద రాష్ట్రాల్లో పట్టు కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహలను మార్చనుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు.. నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. తదితర పరిణామాలపై భేటీలో చర్చ జరిగిందని సమాచారం. 2024 ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేసే దిశగా కాంగ్రెస్ నేతృత్వంలో దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇండియా కూటమిగా పేరుతో ప్రజల ముందుకు వెళ్లనున్నాయి. పాట్నా, బెంగళూరు, ముంబయిల్లో ఇప్పటికే మూడు సమావేశాలు కూడా నిర్వహించారు. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. కానీ పలు రాష్ట్రాల్లో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఎటూ తేలలేదు. ఈ క్రమంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ఈ ఓటమి ఇండియా కూటమి కాంగ్రెస్ పెద్దన్న పాత్రకు ఎదురుదెబ్బగా మారింది. ఇదీ చదవండి: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!? -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. కేంద్రానికి ఈసీ కీలక సూచన
ఒమిక్రాన్ భయాందోళనల నడుమ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. 2022 ఏడాది మొదట్లో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండడం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి పెరిగే అవకాశాలు ఉండడంతో ఈసీ, కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికలు, ర్యాలీల నిర్వహణతో కేసులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నడుమ.. సోమవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో భేటీ సందర్భంగా ఈసీ ఈ కీలక సూచన చేసింది. వాయిదా ప్రసక్తే లేదు! ఒమిక్రాన్ విజృంభించే నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే అంశం పరిశీలించాలంటూ ప్రధాని మోదీ, ఈసీని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లపై చీఫ్ ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర స్పందిస్తూ.. యూపీ పరిస్థితుల సమీక్ష తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖతో చర్చలు, ఆయా రాష్ట్రాల్లో పర్యటనకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే సోమవారం చర్చల అనంతరం ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశంలో ఈసీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు వ్యాక్సినేషన్ పెంచాలంటూ కేంద్రంతో చేసిన సూచనలే అందుకు నిదర్శనం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, గోవాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ వంద శాతానికి చేరువైందని, ఉత్తర ప్రదేశ్‌లో 85 శాతం, మణిపూర్ పంజాబ్‌లో 80 శాతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ఈసీ, కేంద్రాన్ని కోరింది. వరుస భేటీలు ఆరోగ్య కార్యదర్శి కాకుండా.. ఇంకోవైపు ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ దళాలను అప్రమత్తం చేస్తోంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఆయా విభాగాల హెడ్లతో సమావేశమవుతోంది. అంతేకాదు పంజాబ్, గోవా ఎన్నికల్లో డ్రగ్స్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎన్బీఐని సైతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఈసీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. చదవండి: PM Modi Mann Ki Baat.. స్వీయ అప్రమత్తతే దేశానికి బలం -
బీజేపీ నేతలకు ఆరెస్సెస్ స్ట్రాంగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతల తీరుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తీవ్రంగా మండిపడుతోంది. అంతేకాదు బీజేపీ నేతలను ఓ మోస్తరుగా హెచ్చరించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీని 'దేవుడు ఇచ్చిన వరం' (గాడ్స్ గిఫ్ట్) అంటూ అభివర్ణించారు. ఈ విషయంపై ఆరెస్సెస్ కాస్త ఆవేశంగా ఉంది. మంగళవారం జరిగిన మీటింగ్ లో ఈ విషయంపై చర్చించారు. వ్యక్తి పూజ తగదని బీజేపీ నేతలకు ఆరెస్సెస్ చురకలు అంటించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే మొదటికే మోసం వస్తుందని సంఘ్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంశాలను మాత్రమే తమ ప్రచార, ఇతర కార్యక్రమాలలో ప్రస్తావించాలని బీజేపీ నేతలకు సంకేతాలు పంపింది. ప్రపంచ అగ్రనేతల్లోనే మోదీ ఒకరిని, ఆయన ఇండియాను పూర్తిగా మార్చివేస్తారంటూ వెంకయ్య నాయుడు పేర్కొనడంతో పాటు వ్యక్తిపూజ చేస్తున్నారని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. కేవలం అభివృద్ది అంశాలపైనే దృష్టిసారించాలని మంత్రులు, బీజేపీ నేతలకు జాగ్రత్తలు సూచించింది.