టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని అన్న కూతురు రమ్య తెలిపింది. గతంలో టీఆర్‌ఎస్ పార్టీతో విభేదించినందుకు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆమె తెలిపింది. టీఆర్‌ఎస్ మాజీ నేత చింతాస్వామితో కలిసి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లిన ఆమె తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. త్వరలో డీజీపీ దినేష్‌రెడ్డిని కలిసి రక్షణ కల్పించాల్సిందిగా కోరతామన్నారు.