
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తించేలా ఓ కొత్త పథకాన్ని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చబోతున్నామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు (కేకే) వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కేకే సమక్షంలో తెలంగాణభవన్‌లో బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకప్పుడు ఇందిరాగాంధీని అమ్మ అని పిలిచేవారని ఇప్పుడు కేసీఆర్ అందరికీ పెద్దకొడుకయ్యారని చెప్పారు.
శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి మనిషి మరణించేదాకా అందరికీ సంక్షేమ పథకాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. పేదల డబ్బు పేదలకే పథకాల రూపంలో చేరాలన్నది సీఎం కేసీఆర్ తపనని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఉంటుందని భరోసా ఇచ్చారు. కొన్ని కారణాలతో జనగామలో చేరిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రిలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగడి సునీత మాట్లాడుతూ... యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి గుండాల మండలాన్ని వేరు చేసి జనగామలో కలపడం బాధగానే ఉందన్నారు. గుండాల మండలాన్ని.