TRS Manifesto
-
లక్ష కాదు... ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇవ్వలేదు
-
తండ్రీ, కొడుకులు ఇద్దరూ మోసగాళ్లే: షబ్బీర్ అలీ
-
గతంలో ఇచ్చిన హామీలనే మళ్లీ ప్రకటించారు: కిషన్‌రెడ్డి
-
టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
-
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవరం ప్రగతి భవన్లో విడుదల చేశారు. 10 లక్షల మంది నల్లా వినియోగదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. 20 వేల లీటర్ల లోపు నీటి వినియోగదారులు డిసెంబరు నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మంచినీటి కొరత సమస్యను పరిష్కరించామన్నారు కేసీఆర్. పెట్టుబడుల విషయంలో హైదరాబాద్ దేశంలో నంబర్.2గా ఉందని తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ‘సెలూన్లకు, లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. కరోనా కాలానికి సంబంధించి మోటారు వాహన పన్ను రద్దు చేస్తాం. సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తాం. 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ సినిమాలకు ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో సాయం చేస్తాం. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తాం. కొన్ని రాష్ట్రాల మాదిరి టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటు కల్పిస్తాం. తాగునీరు కోసం కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాము’ అని తెలిపారు. (6 ఏళ్లు.. 60 తప్పులు) సీనియర్ సిటిజన్లకు ఫ్రీ బస్ పాస్‌లు హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరిస్తామన్నారు సీఎం కేసీఆర్. రాయదుర్గం-ఎయిర్పోర్ట్, బీహెచ్ఈఎల్-మెహిదీపట్నం వరకు మెట్రోని విస్తరిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వేగంగా వెళ్లేందుకు త్వరలో ఎక్స్‌ప్రెస్ మెట్రోరైలు ప్రారంభిస్తామన్నారు. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ విస్తరణ చేపడతామన్నారు. ప్రజారోగ్యానికి ప్రత్యేక దావాఖానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరం నలువైపులా మరో 3 టిమ్స్ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. అలానే ఉన్నచోటే అన్ని వసతులు సమకూరేలా "మైక్రోసిటీ" కాన్సెప్ట్ అమలు చేస్తామన్నారు. హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. బస్తీల్లో ప్రభుత్వ మోడల్ స్కూళ్లు (ఇంగ్లీష్), విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్లో లైబ్రరీ, క్లబ్, యోగా, జిమ్ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాక వారికి ఉచితంగా బస్ పాసులు ఇస్తామన్నారు. త్వరలో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకొస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ ‘గత నెలల వచ్చిన భారీ వరదల వల్ల నగరం అతలాకుతలమయ్యింది. భవిష్యత్తులో వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నాము. ప్రణాళిక అమలు కోసం 12వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం. హైదరాబాద్ మహానగరానికి సమగ్ర సీవరేజి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తాం. మురుగు శుద్ధి, డ్రైనేజీ పనులకు 13వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేస్తాం. గోదావరితో మూసీ నదీని అనుసంధానం చేస్తాం. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు నది మధ్యలో బోటింగ్.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు గోదావరి నుంచి నీళ్లు తరలిస్తాం’ అన్నారు కేసీఆర్. అలానే 250 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీలో 20 చెరువుల సుందరీకరణ పనులు.. హెచ్ఎండీఏలో 120 కోట్ల రూపాయలతో 20 చెరువుల సుందరీకరణ పనులు ప్రారంభిమస్తామని తెలిపారు. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ విశ్వనగరంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేసీఆర్. ఇందుకు గాను త్వరలో ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్‌గా హైదరాబాద్ మారిందన్నారు. ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రికల్, రియల్ రంగాలు మరింత విస్తరిస్తామన్నారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో మరో 5 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ జాగాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్దీకరణ చేస్తామని.. స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం 5లక్షల రూపాయల వరకు సాయం చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్లు పెంచుతామన్నారు. నగరానికి వచ్చే వారి కోసం షెల్టర్ హోమ్స్ విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు కేసీఆర్ తీపికబురు చెప్పారు. హెచ్డీ, ఎల్టీ కేటగిరిలకు కనీస డిమాండ్ ఛార్జీలు మినహాయింపు ఇస్తామన్నారు. మేనిఫెస్టో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెల్ల రేషన్‌కార్డుదారులకు ఓ పథకం
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తించేలా ఓ కొత్త పథకాన్ని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చబోతున్నామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు (కేకే) వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కేకే సమక్షంలో తెలంగాణభవన్‌లో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకప్పుడు ఇందిరాగాంధీని అమ్మ అని పిలిచేవారని ఇప్పుడు కేసీఆర్ అందరికీ పెద్దకొడుకయ్యారని చెప్పారు. శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి మనిషి మరణించేదాకా అందరికీ సంక్షేమ పథకాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. పేదల డబ్బు పేదలకే పథకాల రూపంలో చేరాలన్నది సీఎం కేసీఆర్ తపనని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని భరోసా ఇచ్చారు. కొన్ని కారణాలతో జనగామలో చేరిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రిలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు టీఆర్ఎస్ అభ్యర్థి గొంగడి సునీత మాట్లాడుతూ... యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి గుండాల మండలాన్ని వేరు చేసి జనగామలో కలపడం బాధగానే ఉందన్నారు. గుండాల మండలాన్ని. -
‘కేసీఆర్ నిజమైన తెలంగాణ వాడివని నిరూపించుకో’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిజమైన తెలంగాణ వ్యక్తి కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ధైర్యముంటే నిజమైన తెలంగాణ వాడివని నిరూపించుకోవాల’ని కేసీఆర్‌కు సవాలు విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులుంటే.. వారికి రైతుబంధు లభించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ డీలర్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకుండా చేశారని మండిపడ్డారు. రెండు లక్షల మంది ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు తమ సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఐఆర్ లేక ప్రభుత్వ ఉద్యోగులు, సమస్యలు పరిష్కారంచలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారని పొన్నాల తెలిపారు. గత ఎన్నికల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని వడ్డీ తీర్చలేని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్.. కాంగ్రెస్ ప్రకటించిన కొన్నిరోజులకు నిరుద్యోగ భృతి ప్రకటించారని గుర్తుచేశారు. జాగో బాగో చరిత్ర కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. తను ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే అని జోస్యం చెప్పారు. -
అధికారం కోసమే కాంగ్రెస్ మాయమాటలు
ఖమ్మం అర్బన్: అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేని పనులు చేస్తామంటూ, అనేక పార్టీలతో కూడబల్కోని మాయ మాటలు చెప్తున్నారని టీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని నగరంలోని 1వ డివిజన్ కైకొండాయిగూడెంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు రాబోయే ఐదు ఏళ్ల ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ మేనిఫెస్టో రూపకల్పన చేశారన్నారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు, తాగు నీటి సౌకర్యాలు కల్పించి అభివృద్ధి దిశగా ఎనలేని కృషి చేశామన్నారు. విజయ దశమి రోజు ప్రచారం ప్రారంభిస్తే విజయం చేకూరుతుందని నియోజకవర్గానికి తూర్పున ఉన్న కైకొండాయిగూడెం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. గత ఉప ఎన్నికల్లో కైకొండాయిగూడెం నుంచే ప్రచారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అభివృద్ధి కోసం గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలేరు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసినట్లు తెలిపారు. కేసీఆర్ భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి కరువు ప్రాంతంగా ఉన్న తిరుమలాయపాలెం మండలంలో నీరు అందించి పచ్చని పల్లె వాతావరణ తీసుకొచ్చినట్లు తెలిపారు. రైతులకు పంటపెట్టుబడిని గత ఏడాది అందించినట్లు ఎన్నికల తర్వాత నుంచి ఏడాదికి ఎకరానికి రూ 10 వేలు అందించబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా రైతు బీమాను అమలు చేసినట్లు పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1వ డివిజన్ కైకొండాయిగూడెంలో రూ.7 కోట్లతో నిధులతో ప్రతి డొంకను రహదారిగా మార్చినట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గత ఉప ఎన్నికల్లో 46 వేల మెజార్టీతో తుమ్మలను గెలిపించారని పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తుమ్మలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసినట్లు తెలిపారు. ఇంకా ఈ ప్రచార సభలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఐడీసీ చైర్మన్ బేగ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ డాక్టర్ పాపాలాల్, రైతు సమన్యయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ ధరావత్ రామ్మూర్తినాయక్, జిల్లా సభ్యుడు మందడపు సుధాకర్, కమర్తపు మురళీ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బెల్లం వేణు, స్థానిక నాయకుల గుర్రం వెంకటరామయ్య, తేజావత్ పంతులు సంపెట ఉపేందర్, గద్దల నాగేశ్వరరావు, తాళ్లూరి శ్రీను, తేజావత్ సంఘ, శ్రీను, ఆజ్మీరా ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శనలు, బతుకమ్మ ఊరేగింపులతో తుమ్మల నాగేశ్వరరావుకు స్వాగతం పలికారు. -
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదు
-
మేనిఫెస్టోలో బీసీల ఊసేది: జాజుల
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల ఊసేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ బీసీల కనీస డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తోంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీసీల ఓట్లు అవసరం లేదేమోననిపిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర జనాభాలో 50%కు పైగా ఉన్న బీసీలకు కేవలం 20 టికెట్లు మాత్రమే కేటాయించడమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన బీసీ ఉప ప్రణాళిక ఇంతవరకు అమలుకే నోచుకోలేదని దుయ్యబట్టారు. కల్వకుర్తిలో బీసీలంతా కలసి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను సైతం ఓడించిన సంగతిని కేసీఆర్ మరిచిపోవద్దని సూచించారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. -
పాక్షిక మేనిఫెస్టో అంతా గ్రాఫిక్సే
సాక్షి, హైదరాబాద్: పాక్షిక మేనిఫెస్టో, పూర్తి మేనిఫెస్టో అంటూ సీఎం కేసీఆర్ నాటకాలాడుతున్నారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోలోని అంశాలన్ని గ్రాఫిక్స్ మాయాజాలమేనని.. ఆ పార్టీ దృష్టి అంతా అధికారంపైనే ఉందని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ఇచ్చి న హామీలకే దిక్కులేదని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పెంచి వేల మంది మరణానికి కారణమవుతున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి హైవేలపై ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తోందన్నారు. ఒక్క పైసా ఇవ్వలేదు రక్షిత తాగునీటి మోటారు పంపులకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని కిషన్‌రెడ్డి విమర్శిం చారు. విశ్వవిద్యాలయాల్లో కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టయినా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీలో అవకతవకలు జరిగాయని సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే అనేక గ్రామాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ హామీలు చిత్తశుద్ధితో కూడుకున్నవి కావని కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల హామీలు ఎలా అమలు చేస్తాయో ముందే చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ విశ్వనీయత కోల్పోయిందన్నారు. -
మళ్లీ రుణమాఫీ.. భారీగా నిరుద్యోగ భృతి!
రాష్ట్రంలో 45.50 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నరు. వీరిలో రూ.లక్ష లోపు రుణాలున్న వారు 42 లక్షల మంది ఉన్నరు. అందుకే రూ.లక్ష రుణ మాఫీని మరోసారి అమలు చేయాలని నిర్ణయించాం. మహిళా సంఘాల బృందాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరో అస్త్రం విసిరారు. పాక్షిక మేనిఫెస్టో పేరుతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే మంగళవారం పలు కీలక హామీలను ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా పేరు తెచ్చిన పథకాలను మరింత విస్తృతం చేయడంతోపాటు పలు కొత్త వాటిని చేర్చారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంలో ప్రభావం చూపిన రైతు రుణ మాఫీని మళ్లీ చేర్చారు. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈసారి పకడ్బందీగా, రైతులకు ఇబ్బంది లేకుండా మాఫీ చేస్తామని చెప్పారు. ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేందుకు ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. స్వయం సహాయక బృందాలకు 75% నుంచి 80% సబ్సిడీతో వీటిని నెలకొల్పుతామని చెప్పారు. ఈ బృందాల్లోని వారిని ఉద్యోగులుగా నియమించి వీటిని విజయవంతంగా అమలు చేస్తామని వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.2 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసరా పథకంలో మార్పులు చేస్తామని, ప్రస్తుతం 65 ఏళ్లకు ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లను 57 ఏళ్లు పూర్తి కాగానే ఇస్తామన్నారు. ప్రస్తుతం రూ.వెయ్యి ఉన్న ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.2,016కు, అలాగే వికలాంగుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచుతామని చెప్పారు. నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3,016 చొప్పున భృతి చెల్లిస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంలో మార్పులు చేస్తున్నామన్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని, లేని వారికి నిర్మించి ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెతామన్నారు. ఈ పథకం విధివిధానాల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చిరు ఉద్యోగులకు మరింత వేతనాలు పెంచుతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ మెరుగ్గా ఉంటుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రెండ్లీగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం మంగళవారం తెలంగాణ భవన్లో జరిగింది. కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం పాక్షిక మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. వారికి ఎన్నికలు రాజకీయ క్రీడ... మాకు టాస్క్... ‘మా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. పలు అంశాలపై పార్టీ ఏం చెబుతుందని ప్రజలు వారిని అడుగుతున్నారు. మా అభ్యర్థులు ప్రజలకు చెప్పేందుకు వీలుగా పాక్షిక మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాం. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి క్రోడీకరించి ముఖ్యమైన అంశాల అమలు తీరులో మంచి చెడులు, పూర్వాపరాలు, అమలు తీరుపై చర్చించాం. ఉద్యోగుల నుంచి 20కిపైగా వినతులొచ్చాయి. చిన్న ఉద్యోగులు వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరుస్తాం. నాలుగేళ్లలో నన్ను, మా మంత్రులను, ఎమ్మెల్యేలను పలుసార్లు పలు సందర్భాల్లో కొందరు కొన్ని అడిగారు. రాజకీయాలు, ఓట్లు, ప్రలోభాల కోసం కాకుండా హేతుబద్ధీకరణ పద్ధతిలో పరిశీలించాం. టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ. మిగిలిన పార్టీలకు ఎన్నికలు ఒక రాజకీయ క్రీడ. మాకు మాత్రం ఒక పని (టాస్క్). నిర్ధిష్ట లక్ష్యాలు, పటిష్ట ఆలోచనలను చెప్పి ముందుకు పోతాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు అర్థిక అంచనాలు తెలియవు. కరెంట్, మంచినీరు, వలసలు అన్ని సమస్యల ప్రభావం ఉండె. ఒక పథకాన్ని ప్రారంభించాలంటే ఆందోళనలు ఉండేవి. అందుకే కళ్యాణలక్ష్మీ పథకాన్ని మొదట ఎస్సీ, ఎస్టీలకే.. అదీ రూ.51 వేలతోనే అమలు చేశాం. ఏటా ఎన్ని పెళ్లిల్లు అవుతాయనే సమాచారం లేదు. అన్నింటిపై స్పష్టత వచ్చాక బీసీలకు, ఆ తర్వాత అగ్రవర్ణాల్లోని పేదలకు అమలు చేస్తున్నాం. ఆర్థిక పురోగతిపై అంచనా వస్తున్న కొద్దీ ఇచ్చే మొత్తాన్ని పెంచాం. మూడో ఏడాదిలో రూ.75 వేలు, నాలుగో ఏడాదిలో రూ.1,0,116కు పెంచాం. ప్రజలకు ప్రలోభాలు పెట్టి తమాషాలు చేయొద్దు. అడ్డం పొడుగు మాట్లాడొద్దు. అర్థిక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం... వచ్చే ఐదేళ్లలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయనే అంచనా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు సహకారం లేని పరిస్థితిలోనే అంచనా వేశాం. వచ్చే ఐదేళ్లలో రూ.10.30 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అప్పుల తీర్చే కార్యక్రమం కింద రూ.2.30 లక్షల కోట్లు చెల్లించాలి. దీంతో మరో రూ.1.30 లక్ష కోట్లు సమీకరించే అవకాశం వస్తుంది. మొత్తంగా తొమ్మిది లక్షల కోట్ల నిధులు ఉంటాయి. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండి ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తే పది లక్షల కోట్లకు చేరుతుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జీవన విధానం విధ్వంసమైంది. ప్రధానంగా రైతులు, రైతు కూలీలు ఆగమయ్యారు. ఉద్యమ సమయంలో హెలికాప్టర్లో వెళ్తూ జయశంకర్ సార్, నేను గ్రామాల పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లం. తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకునేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఐదేళ్ల దీన్ని కొనసాగిస్తాం. రైతును రాజును చేయాలి. వారికి పూర్వ వైభవం రావాలి. మొదట ట్రాక్టర్లకు రవాణా పన్ను, నీటి తీరువా రద్దు చేశాం. పెట్టుబడి సాయం అద్భుత పథకం. రైతు బీమా గురించి ప్రపంచ వ్యాప్తంగా కథలుగా చెప్పుకుంటున్నరు. కోతలను పరిష్కరించి 24 గంటలపాటు సాగుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నం. గోదాముల సామర్థ్యాన్ని 24 లక్షల టన్నులకు పెంచాం. రైతు సమన్వయ సమితులతో పంట కాలనీలు, మద్దతు ధర కల్పించే చర్యలు తీసుకుంటున్నం. ఇవన్నీ రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చినయ్. 42 లక్షల మంది రైతులకు లబ్ధి... 2021 జూన్ వరకు రాష్ట్రంలో కచ్చితంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు, డిండి వంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రైతులు అప్పుల నుంచి బయటపడి, పెట్టుబడి ఖర్చులను వారే భరించే స్థితికి రావాలి. రాష్ట్రంలో 45.50 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.లక్ష లోపు రుణాలున్న వారు 42 లక్షల మంది ఉన్నారు. అందుకే రూ.లక్ష రుణ మాఫీని మరోసారి అమలు చేయాలని నిర్ణయించాం. మహిళా సంఘాల బృందాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ముంబైలోని లుసిడ్ పాపడ్ ఇదే తరహాలో మొదలైంది. ఇప్పుడు ఆ పాపడ్ దేశ వ్యాప్తంగా అన్ని హోటళ్లలో ఉంటుంది. ఏకంగా రూ.1,100 కోట్ల టర్నోవర్‌తో ఈ సంస్థ నడుస్తోంది. రైతు సమన్వయ సమితిలోని వారికి గౌరవ వేతనాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నం. రాష్ట్రంలో ప్రస్తుతం 40 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నరు. ఇకపై 57 ఏళ్లకే ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో అదనంగా 8 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంక్షేమ విభాగాల్లో చేసే ఖర్చు చాలా సంతృప్తినిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వీటిని అమలు చేస్తాం. ప్రస్తుత బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించలేదు. ముందే చెప్పిన ‘సాక్షి’ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో రుణమాఫీ, పింఛన్ల పెంపు అంశాలు ఉన్నట్లు మంగళవారం(16న) ‘సాక్షి’లో ప్రచురించిన కథనం.. నిరుద్యోగుల ఎంపికకు మార్గదర్శకాలు... నిరుద్యోగ భృతి అమలులో ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని లక్షల మంది ఉన్నా సరే ప్రతి ఒక్క అర్హుడికి అందజేస్తం. ఎవరెవరు నిరుద్యోగులో తేల్చేందుకు కొంత సమయం పడుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలోనూ ఈ సమాచారం స్పష్టంగా లేదు. నిరుద్యోగుల ఎంపికకు మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందిస్తం. అర్హులను తేల్చేందుకు మూడునాలుగు నెలలు పడుతుంది. ఆ తర్వాతే ఈ పథకం అమలు సాధ్యమవుతుంది. టీడీపీ, కాంగ్రెస్‌లు నిర్మించిన ఇళ్ల లెక్కలను చూస్తే జనాభా కంటే ఎక్కువ ఉన్నయ్. ఒక్క మంథని నియోజకవర్గంలోనే కుటుంబాల కంటే 40 శాతం ఎక్కువ ఇళ్లను నిర్మించినట్లు రికార్డులున్నయ్. లబ్ధిదారులుగా పేదలు ఉన్నరు. ఎవరిపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో రుణాలపై ఇళ్లు నిర్మించుకున్న వారికి బ్యాంకుల్లో ఉన్న రూ.4,136 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. మేం వంద శాతం ఉచితంగా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించాం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం అవసరమని అంచనా ఉంది. ఏటా 2 లక్షల చొప్పున నిర్మించాలని అనుకున్నం. స్థలం సమస్య వచ్చింది. అందుకే మార్పులు చేశాం. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్. చిత్రంలో ఈటల, కేశవరావు తదితరులు అగ్రవర్ణ పేదలూ అడుగుతున్నరు.. పేదరికానికి కులం లేదు. అగ్రవర్ణాల్లోని పేదలకు మాకు ఏదైనా చేయాలని అడుతున్నరు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రెడ్లు, వైశ్యులు అడిగారు. అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉండాలనేది కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుంది. కొప్పుల ఈశ్వర్, నగేశ్ తదితరులు ఈ కమిటీలో ఉంటరు. ఉద్యోగుల సంక్షేమంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. అన్ని విభాగాల్లోని చిరుద్యోగుల వేతనాలు పెంచాం. వారు మళ్లీ ఆశీర్వదిస్తే మీ కడుపులు నింపుతం. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు ఏమీ చెప్పలేను. ఐఆర్, పీఆర్సీ మెరుగ్గా ఉంటయ్. ఉద్యోగులకు బెంబేలు, బాధ వద్దు. కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పినవి చేయలేదు. 2009 ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేదు. మాది విశ్వసనీయ ప్రభుత్వం. ఆపద్ధర్మ సీఎం అయినా నేను అన్ని వివరాలు తెలుసుకుంటున్నా. రైతుల రుణమాఫీలో గతసారి వచ్చినట్లు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తం’ అని వివరించారు. తెలంగాణ భవన్ వద్ద సంబరాలు... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించగానే ఆ పార్టీ నేతలు, శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని పార్టీ కార్యకర్తలు డప్పు చప్పులతో హడావుడి చేశారు. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి ఈ సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. -
మక్కికి మక్కి కాపీ కొట్టారు
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది నుంచి కాంగ్రెస్ చెబుతున్న విషయాలను మక్కికి మక్కి కాపీ కొట్టి తమ మేనిఫెస్టోగా చెప్పుకొన్న దయనీయ స్థితికి టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తమ పార్టీ పాక్షిక మేనిఫెస్టో అంటూ కేసీఆర్ చేసిన ప్రకటనలు తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమిని, కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంగళ వారం గాంధీభవన్‌లో హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలసి ఉత్తమ్ మాట్లాడారు. ‘నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని, గెలిచాక రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తాము అమలు చేయబోయే విషయాలను గత ఏడాది నుంచి చెబుతున్నాం. అర్ధంతరంగా అసెంబ్లీని రద్దు చేసుకుని, ముందస్తు ఎన్నికలకు పోయి, తప్పకుండా ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని నిర్ధారించుకున్నాక కాంగ్రెస్ ప్రకటిస్తున్న విషయాలను ఇప్పుడు కేసీఆర్ చెప్పారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్యలు, ప్రకటనలు ఉంటాయా?’అని ప్రశ్నించారు. తాము నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామంటే తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్‌లు హేళన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారో తమకు తెలియదని, తామే నిరుద్యోగులమవుతామని, ఎట్లిస్తరని, లెక్కలున్నాయా అని అడిగారని, మళ్లీ ఇప్పుడు సిగ్గులేకుండా నిరుద్యోగ భృతి ప్రకటించారని పేర్కొన్నారు. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తామని, తెలంగాణలో 12,13 లక్షల మంది నిరుద్యోగులున్నారని సర్వేలో తేలిందని అంటున్నారంటే తాము ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయామని ఒప్పుకున్నట్టే కదా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రకటనలు చూస్తుంటే టీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని, కాంగ్రెస్ గెలిచినట్టేనని ఆయనే ఒప్పుకున్నారని ప్రజలకు అర్థమవుతుందన్నారు. తాము చెప్పినవన్నీ అమలు చేయాలంటే దక్షిణ భారత్‌లోని అన్ని రాష్ట్రాల బడ్జెట్లు కలిపినా చేయలేరని కేటీఆర్ అన్నారని, ఇప్పుడు దానికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీన్నిబట్టి కేసీఆర్, కేటీఆర్‌లు తప్పుడు ప్రకటనలు చేశారని స్పష్టమవుతోందన్నారు. కొన్ని నెలలకు నిద్ర లేచి సామాజిక పింఛన్ల విషయంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, నేత కార్మికులకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పింఛన్ పెంచుతామని, వికలాంగులకు నెలకు రూ.3 వేల పింఛన్ ఇస్తామని తాము చెప్పిన కొన్ని నెలలకు నిద్రలేచి అదే ప్రకటనను ఇదిగో మా మేనిఫెస్టో అంటూ కేసీఆర్ ప్రకటించారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, రైతులకు సాయం చేస్తానని ఈరోజు అంటున్నాడని, గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో 4,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని అమానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. ఏకకాల రుణమాఫీ చేయాలని, మూడు, నాలుగు సార్లు ఇవ్వడం అర్థరహితమని, రైతులకు సరైన రీతిలో లబ్ధి కలగదని అటు అసెంబ్లీలో, ఇటు బయట తాము లేవనెత్తితే రైతులకు వడ్డీ కూడా తానే చెల్లిస్తానని ఆ మాట కూడా తప్పాడని విమర్శించారు. ఓటమికి భయపడే రైతుల గురించి సుదీర్ఘంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని, పింఛన్లు, నిరుద్యోగ భృతి, రుణమాఫీలన్నీ కాంగ్రెస్ చెప్పిన విషయాలేనని, ఇప్పటికయినా కనువిప్పు కలిగినందుకు సంతోషమని అన్నారు. నాలుగేళ్లు ఎందుకు చేయలేదు? నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులను మళ్లీ గెలిపిస్తే చేస్తానని ఎన్నికలకు 50 రోజుల ముందు కేసీఆర్ చెబుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎందుకు చేయలేకపోయారని ఉత్తమ్ ప్రశ్నించారు. ‘సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పింఛన్లు ఎందుకు ఇవ్వలేదు.. ఇప్పుడు ఏకకాల రుణమాఫీ అంటున్నారు.. గతంలో మేం అడిగినప్పుడు ఎందుకు చేయలేదు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడగలుగుతాడా.’అని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో 1.6 లక్షల డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు కట్టిస్తానని చెప్పి రెండేళ్లయిందని, ఇప్పుడు ఐదారువేలు కూడా కట్టియ్యకుండా మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. సొంత స్థలం ఉన్న వాళ్లకి తాము ఇళ్లు కట్టిస్తామని చెప్పిన తర్వాత అదే విషయం చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ విజయమని, ఇప్పటికయినా తెలంగాణ ప్రజలకు నిజం తెలిసివచ్చిందని, అన్ని విషయాల్లో కేసీఆర్ మోసం చేస్తున్నారని మరోమారు స్పష్టమయిందని ఉత్తమ్ అన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, మూడెకరాలు ఇస్తానని చెప్పి చేయనందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని, గిరిజనులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిరంతరం మోసమే కేసీఆర్ లాంటి దగుల్బాజీ, ధోకా మాటలు ఎవరూ మాట్లాడలేదని, ఆయన ఎస్సీ, ఎస్టీలను నిరంతరం మోసం చేశాడని ఉత్తమ్ అన్నారు. 64 లక్షల మంది దళితుల్లో మూడు వేల కుటుంబాలకు మూడెకరాల భూమి ఇచ్చిన మోసగాడు, అబద్ధాల కోరు కేసీఆర్ అని, వారికి కూడా పట్టాలిచ్చి, పొజిషన్లు ఇవ్వలేదని అన్నారు. 40లక్షల మంది గిరిజనుల్లో ఒక్కరికి కూడా మూడెకరాల భూమి ఇవ్వకపోగా, చాలా కాలంగా వారు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కున్నాడని ఆరోపించారు. బీసీలకు రూ.20–25వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి రూ.7–8 వేల కోట్లను కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్‌భూములు, ఉర్దూ అకాడమీ విషయాల్లో మైనార్టీలను మోసం చేశారని, రైతులను, మహిళా సంఘాలను దగా చేశాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత అత్యంత ఆవేదన, ఆవేశంతో ఉన్నారని, తాను అధికారంలోకి వచ్చే నాటికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేని అసమర్థుడు కేసీఆర్ అని అన్నారు. ఉద్యోగులు, టీచర్లకు ఎందుకు పీఆర్సీ ఇవ్వలేదో బహిరంగ ప్రకటన చేసి క్షమాపణచెప్పాలని, ఐఆర్ ఎందుకివ్వలేదని, సీసీఎస్ రద్దు చేస్తానని స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఒక్క సామాన్యుడిని కలవని దేశంలోని ఏకైక సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు సమానమేనని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేసీఆర్ బెదిరింపులకు తాము భయపడేది లేదని, ఆయన్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. తామేం చేస్తామంటే.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తీసుకునే చర్యలను ఉత్తమ్ వివరించారు. మహిళా సంఘాలకు రూ.లక్ష గ్రాంటు ఇస్తామని, ప్రతి గ్రూప్‌నకు రూ.10 లక్షల రుణం బ్యాంకుల నుంచి ఇప్పించి వడ్డీ భారాన్ని తామే భరిస్తామని వెల్లడించారు. సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, ఆర్పీలు, బీమా మిత్రులకు రూ.10వేల వేతనం ఇస్తామని, అభయహస్తం పునరుద్ధరిస్తామని, బీపీఎల్ కుటుంబాలకు రూ.5లక్షల వరకు వైద్యం ఉచితంగా అందేలా ఆరోగ్యశ్రీని మరింత విస్తృతం చేస్తామని, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని, రేషన్ కింద కుటుంబంలోని ప్రతి మనిషికి 7 కిలోల సన్నబియ్యంతో పాటు ఉప్పు, చక్కెర, నూను, గోదుమపిండి, కారం, చింతపండు లాంటి 9 రకాల నిత్యావసరాలు కూడా ఇస్తామని, సంవత్సరానికి 6 ఎల్పీజీ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని, దళితులు, గిరిజనులకు గృహ విద్యుత్ కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఉత్తమ్ చెప్పారు. -
దసరా తర్వాత టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ?
-
గుర్తింపు కార్డులివ్వాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావును బుధవారం కలసి వినతిపత్రం సమర్పించా రు. ‘టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఎప్పుడు పిలుపు ఇచ్చినా ఉద్యమం చేశాం. కేసులు నమోదై జైళ్లకు వెళ్లాం. అయినా తెలంగాణ సాధించిన ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యమంలో కేసుల నమోదు, రిమాండ్, బెయిల్, కోర్టు కేసులు తదితర అంశాల ఆధారంగా పోలీసుల రికార్డుల ప్రకారం ఉద్యమకారులను గుర్తించి గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ఉద్యమకారులందరినీ సమరయోధులుగా గుర్తించి నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలి. అర్హులైన విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని కోరారు. అన్ని అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేశవరావు ఉద్యమకారులకు తెలిపారు. నీరాను ప్రభుత్వమే విక్రయించాలి: గౌడ సంఘం ఔషధ గుణాలున్న కల్లును నీరాగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే బాటిలింగ్ చేసి విక్రయించాలని సర్వా యి పాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘం) టీఆర్ఎస్కు విజ్ఞప్తి చేసింది. కల్లు గీత కార్మికుల సంక్షేమంపై మేనిఫెస్టోలో చేర్చాలని కోరింది. గౌడ ఫెడరేషన్ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. గౌడ సంఘం నేతలు ఈడిగ ఆంజనేయులుగౌడ్, మల్లాగౌడ్, సునీల్‌గౌడ్ బుధవారం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో 80 లక్షల మంది కల్లుగీత కార్మికులు ఉన్నారని, వీరికి 20% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో పది ఎకరాల స్థలం కేటాయించి హరితహారం కింద హైబ్రిడ్ చెట్లను నాటాలని పేర్కొన్నారు. -
'సెంట్రలైజ్డ్ కరప్షన్ కు టీఆర్ఎస్ తెరలేపింది'
ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఇతర ప్రజా ప్రతినిధులను బెదిరించి పార్టీలోకి తీసుకున్నారు.. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సూచీగా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత మల్లు రవి శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. టీఆర్ఎస్ సెంట్రలైజ్డ్ కరప్షన్ కు తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ, చీకటి పాలన నడుస్తోందని, టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదని, రాష్ట్రం వచ్చి రెండేళ్లయిన ప్రజల ఆశలు నెరవేరలేదని పేర్కొన్నారు. 'టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మీడియాను ఇబ్బందులకు గురిచేశారని, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. నక్సలైట్ల అజెండానే మా అజెండా అని చెప్పిన టీఆర్ఎస్.. వరంగల్ లో సభను అడ్డుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులపై కెమెరాలతో నిఘా పెట్టారు' అని మల్లు రవి మండిపడ్డారు. భూటకపు ఎన్కౌంటర్ లు చేశారని, విభజన చట్టంలో అంశాలను సాధించలేక పోయారని పేర్కొన్నారు. పెన్షన్ లు తప్ప మేనిఫెస్టో హామీలేవీ నెరవేర్చలేదని, హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన ఇప్పటికీ జరగలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయడం, దళితులకు 3 ఎకరాలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, కేజీ టు పీజీ, డబుల్ బెడ్ రూమ్ వంటి హామీలేవి ఈ రెండేళ్లలో అమలుకాలేదని చెప్పారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా సాధించలేక పోయారని, కనీసం కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, కొత్త అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మల్లు రవి సూచించారు. -
ఇది అందరి విజయం
పేదల ఎజెండాయే.. మా ఎజెండా: కేసీఆర్ మేం కష్టపడితే వచ్చింది కాదు.. ప్రజలు ఇష్టపడి ఇచ్చిన విజయమిది అద్భుతమైన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను తు.చ. తప్పకుండా అమలు చేస్తాం హైదరాబాద్‌ను నిజమైన విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజలు అంత అలవోకగా విజయం ఇవ్వరు. ఇది ప్రజలు ఇష్టపడితే వచ్చిన విజయం. మేం కష్టపడితే వచ్చింది కాదు. మా ఎజెండా.. పేదల ఎజెండా. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను తూ.చ . తప్పకుండా అమలు చేస్తాం. జంట నగర వాసులకు లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తం. ఈ బడ్జెట్లో కేటాయింపులు జరుపుతం. మేనిఫెస్టోలోని అంశాలన్నీ మాకు ముఖ్యమే. డబుల్‌బెడ్ రూం ఇళ్లకు టాప్ ప్రియారిటీ ఉంటుంది..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం రాత్రి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్లో సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... శిరసు వంచి నమస్కరిస్తున్నా.. చరిత్ర తిరగరాస్తూ.. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని స్థానాలిచ్చి అద్భుతమైన విజయం చేకూర్చిన జంట నగర ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. కార్పొరేటర్లుగా గెలిచిన వారికి అభినందనలు. అందరి కృషి వ ల్లే ఈ విజయం దక్కింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. గత చరిత్రలో ఏ పార్టీ చూసినా... 52 స్థానాలకు మించి రాలేదు. హైదరాబాద్ నగర చర్రిత చూస్తే ఏ ఒక్క పార్టీ నేరుగా అధికారం చేపట్టలేదు. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ నేతలకు నాది ఒక్కటే విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లో గర్వం, అహంకారం రావొద్దు. ప్రజలు ఎంత గొప్ప విజయం అందిస్తే.. అంత అణకువతో పోవాలి. పార్టీ నాయకత్వం, ప్రభుత్వంపై బాధ్యత చాలా పెరిగింది. నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలపైనా చాలా బరువు మోపారు. హైదరాబాద్ ప్రజలకు నాది ఒక్కటే వాగ్దానం. ఎంత గొప్ప మెజారిటీ ఇచ్చారో.. అంతే గొప్పగా సేవ చేసి నిరూపించుకుంటాం. ఇక్కడి వాళ్లంతా మా బిడ్డలే.. పోలింగ్ ముగిశాక నన్ను కలిసిన మంత్రులు.. మన నుంచి ప్రజలు ఎక్కువగా రెండు పనులు ఆశిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఆశిస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా రాబోయే బడ్జెట్లో పెట్టి, లక్ష ఇళ్లు కడతాం. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. అదే తరహాలో జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొందరు అపోహలు సృష్టించారు. సెటిలర్స్‌ను, ఆంధ్రా వాళ్లను ఏదో చేస్తామని, టీఆర్ఎస్ అంటే ఏదో భూతమని భయపెట్టారు. కొన్ని పిచ్చి ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా చేయని ప్రయత్నం లేదు. హైదరాబాదీలంతా టీఆర్ఎస్ వైపే, కేసీఆర్ వైపే ఉన్నామని పిడికిలెత్తి స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా మా బిడ్డలే. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రా ప్రాంత సోదరులు కావొచ్చు వారంద రినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం తన రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ, ఉపాధి కల్పించడం. ఆ కర్తవ్యం మా గుండెల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా అపోహలు ఉన్నా అవి నేటితో పటా పంచలు అయ్యాయి. 4 వెయ్యి పడకల ఆసుపత్రులు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు జంట నగరానికి రెండు రిజర్వాయర్లను శరవేగంగా చేపట్టి, తాగునీటి సమస్య, పీడ లేకుండా చేస్తాం. హైదరాబాద్‌లో ఒక్క సెకను కూడా విద్యుత్ పోకుండా అందిస్తం. హైదారబాద్ నెవర్ స్లీప్స్ మాదిరిగా తయారు చేస్తాం. శాంతి భద్రత విషయంలో రాజీ ధోరణి ఉండదు. ఎవరైనా, ఎంతపెద్ద వారైనా కఠినంగా డీల్ చేస్తం. రాజీ పడం. స్కై వేలు, మల్టీ లెవల్ ఫ్లైఓవర్స్, సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్, డ్రెయినేజీ వ్యవస్థను బాగు చేయడం వంటి చర్యలు చేపడతాం. హైదరాబాద్‌లో 50 ఏళ్లుగా వింటున్నాం. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల పేర్లే వింటున్నం. మరోటి లేదు. సమైక్య రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం అందించే ఆసుపత్రులు ఈ రెండు తప్ప మరోటి లేదు. అవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. కింగ్ కోఠీ ఆసుపత్రిని వెయ్యి పడకలకు అప్‌గ్రేడ్ చేస్తాం. మరో మూడు వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను తలదన్నేలా వీటిని నిర్మిస్తం. ఎమ్మారై సహా అన్ని రకాల పరీక్షలను జరిపేలా కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ఏడాదిలోనే నిర్మిస్తం. ప్రస్తుతం నగరంలో ఉన్న రెండు ఆసుపత్రుల సంఖ్యను ఆరుకు పెంచుతం. ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న స్థలంలోనే కొత్త భవనాలు నిర్మిస్తం. ఇప్పటికే మొదలు పెట్టిన కూరగాయల మార్కెట్లు, శ్మశాన వాటికలు, బస్‌బేలు, టాయిలెట్లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తం. ‘ట్రూలీ గ్లోబల్ సిటీ-హైదరాబాద్’ అని పేరు వచ్చేలా నిజమైన విశ్వనగరంగా తీర్చి దిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఒక్క చెవి నారాయణను చూడలేను ప్రతిపక్షాలకు చేసే మనవి ఒక్కటే. ప్రజా తీర్పును కోరే సమయంలో అవాకులు చవాకులు కాకుండా, అసంబద్ధమైన వ్యక్తిగత విమర్శలు కాకుండా సరైన పంథాలో, సహేతుక విమర్శలు చేస్తే బావుంటుంది. కానీ చాలా మంది చాలా మాట్లాడారు. ఇవ్వాళ టీఆర్ఎస్ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉంది అని హైదరాబాదీలు నిర్ణయం చేశారు. చంద్రబాబు, బీజేపీ నాయకులు ఏవేవో అన్నారు. కాంగ్రెస్ నాయకులైతే ఇష్టమొచ్చిన పద్ధతిలో మాట్లాడారు. వాటన్నింటినీ తోసి పుచ్చి హైదరాబాద్ ప్రజలు కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా అద్భుతంగా గెలిపించారు. డంబాచారాలు మాట్లాడే వారికి సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. సీపీఐ నారాయణ నా మిత్రుడు. ఒక్కచెవి నారాయణను చూడలేను. ఆయన జోలికి ఎవరూ వెళ్లొద్దు. రెండు చెవుల నారాయణనే చూడాలి. ఆయన ప్రజా కార్యకర్త. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అయన తెరువు ఎవరూ పోవద్దు. నిర్మాణాత్మక సలహాలివ్వండి.. విపక్షాలకు నా విజ్ఞప్తి ఏంటంటే.. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. కొత్త రాష్ట్రం మనది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోవాలి. వరంగల్‌లో మీరు అడ్డదిడ్డంగా మాట్లాడితే.. అక్కడి ప్రజలు డిపాజిట్లు రాకుండా చేశారు. హైదరాబాద్‌లో మీరెన్ని అవాకులు మాట్లాడినా.. సింగిల్ డిజిట్‌తో సరిపెట్టారు. ఈ పరిస్థితిని గమనించి, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి ముందుకు సాగుదాం. కొత్త రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుకుందాం. ప్రజల సేవలో తరిద్దాం. అర్థం పర్థం లేని విమర్శలు, వ్యక్తిగత నిందారోపణలు ఇప్పటికైనా మానుకుని ప్రజలు ఇచ్చిన ఫలితం గమనించండి. వరంగల్ ఫలితం తర్వాతే మారుతారనుకున్నా.. కనీసం హైదరాబాద్ ఫలితం తర్వాతనైనా మీరు మారుతారాని ఆశిస్తున్నాం. కలిసి వెళ్తేనే అభివృద్ధి.. పరేడ్ గ్రౌండ్లో చెప్పిన మాటలను కార్పొరేటర్లు గుండెల్లో పెట్టుకోవాలి. జీహెచ్ఎంసీలో లంచం ఇచ్చే అవసరం లేకుండా ఇంటి పర్మిషన్ తెచ్చుకునేలా పనిచేయాలి. ఆ రోజు వస్తేనే మనం గెలిచిన గెలుపునకు విలువ ఉంటుంది. ఎన్నికల సందర్భంలో కొద్దిపాటి ఆవేశాలకు గురైనా స్పోర్టివ్‌గా తీసుకుని అలాయ్ బలాయ్ తీసుకోవాలి. అందరినీ కలుపుకొని వెళితేనే అభివృద్ధి సాధ్యం. ఎవరి ఒళ్లు వారు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిది. పార్టీ నేతలు, గెలిచిన కార్పొరేటర్లతో చర్చించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై నిర్ణయం చేస్తం. సెక్షన్ 8ని ప్రజలు తిరస్కరిస్తరు.. ప్రజలు ప్రతిపక్షాలను ఎంత ఘోరంగా తిరస్కరించించారో సెక్షన్ 8ని కూడా అలాగే తిరస్కరిస్తరు. అర్థం లే ని ప్రేలాపనలు మానుకోవాలి. ఎక్స్ అఫీషియో ఆర్డినెన్స్ వేస్ట్ కాదు. భవిష్యత్తులో పనిచేస్తుంది. ఎన్నికను కుదిలించాలనుకుంది కూడా సంస్కరణల కోసమే. తక్కువ సమయంలో అయితే బావుంటదని భావించినం. హైకోర్టు వేరే విధంగా ఆదేశించింది కాబట్టి.. ఆ తీర్పును గౌరవించి ఆ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాం. ఎక్స్ అఫీషియో మెంబర్స్ విషయంలో ఇది కొత్త చరిత్ర కాదు. నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి వరకు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఓటింగులో పాల్గొన్నారు. అది ఈరోజు అవసరం లేని పరిస్థితే కనిపిస్తోంది. భవిష్యత్ కోసమైనా సరే చట్టంలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తెచ్చాం. చరిత్ర తిరగరాస్తూ.. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని స్థానాలిచ్చి అద్భుతమైన విజయం చేకూర్చిన జంట నగర ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. అందరి కృషి వల్లే ఈ విజయం దక్కింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. గత చరిత్రలో ఏ పార్టీ చూసినా... 52 స్థానాలకు మించి రాలేదు. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు. - ముఖ్యమంత్రి కేసీఆర్ -
గ్రేటర్ ఎన్నికలు: టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ శనివారం 15 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పొందుపరిచిన విషయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. ► విశ్వనగరంగా హైదరాబాద్ మార్చడం ► ట్రాఫిక్ చిక్కులు లేని ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ ► నిరంతరం విద్యుత్ సరఫరా, స్వచ్ఛ హైదరాబాద్ ► త్వరలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు, నగరంలో ఉచిత వై-ఫై ► ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనలు ► ప్రభుత్వ స్కూల్స్‌లో డిజిటల్ తరగతులు, ఆస్తి పన్ను తగ్గింపు ► నగరంలో 17 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ► యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక కార్యాచరణ -
'ప్రసంగం చప్పగా ఉండి నిరాశపరిచింది'
హైదరాబాద్ : తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్, బీజేపీ తప్పుబట్టాయి. గవర్నర్ ప్రసంగం చప్పగా ఉండి.... నిరాశపరిచిందని నేతలు చిన్నారెడ్డి, కోమటిరెట్టి వెంకటరెడ్డి, రెడ్యానాయక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోనే గవర్నర్ చదివారని వారు విమర్శించారు. హామీల అమలుకు నిర్థిష్ట కార్యాచరణ ప్రకటించలేదని, రుణమాఫీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పలేదన్నారు. పోలవరం ఆర్డినెన్స్ అంశాన్ని ప్రస్తావించలేదని, ఫ్లోరైడ్ సమస్యతో పాటు దళితులకు భూ కేటాయింపులపై స్పష్టత ఇవ్వలేదని నేతలు వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యగో భర్తీపై సర్కార్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, మైనార్టీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధానాన్ని ప్రకటించలేదని నేతలు పెదవి విరిచారు. -
టార్గెట్ 2050
- ప్రపంచస్థాయి నగరానికి ప్రణాళికలు - తాగునీటి సరఫరాకి ప్రాధాన్యం - నిధుల గురించి ఫికరొద్దు ! - పది రోజుల్లో నివేదిక ఇవ్వండి - ‘గ్రేటర్’పై సమీక్షలో కేసీఆర్ సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు స్లమ్ ఫ్రీ సిటీ (మురికివాడలు లేని నగరం).. మరోవైపు అంతర్జాతీయస్థాయి నగరం.. ఈ రెండింటినీ అమలు చేయాలనుకుంటున్న నూతన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో గ్రేటర్ పరిధిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2050 నాటికి గ్రేటర్ జనాభాను దృష్టిలో ఉంచుకొని అందుకనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అందుకు ఎన్ని నిధులు అవసరమైనా ఫర్వాలేదన్నారు. మెరుగైన ప్రజాసదుపాయలకు.. ప్రపంచస్థాయి నగరంగా విరాజిల్లేందుకు చేయాల్సిన పనులపై తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా సూచించారు. పదిరోజుల్లో తగు నివేదికను సిద్ధం చేయాలన్నారు. కేసీఆర్ అభిమతం మేరకు గ్రేటర్ నగరంలో దిగువ పనులు కార్యరూపం దాల్చనున్నాయి.టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని హామీకి అనుగుణంగా రెండు బెడ్రూమ్లు, హాల్, కిచె న్, బాత్రూమ్లతో కూడిన ఇళ్లను పేదల కోసం నిర్మించనున్నారు. నగరంలో ప్రజలు ముందుకొచ్చే ప్రాం తాల్లో పైలట్‌ప్రాజెక్టుగా వీటిని వెంటనే చేపట్టనున్నారు. అందుకుగాను స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కార్పొరేటర్ల సలహాల స్వీకరణ సైతం ప్రారంభించారు. - నగరంలో తరచూ ఎదురవుతున్న రహదారుల సమస్యలు.. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చేసే చర్యలు వెంటనే చేపట్టనున్నారు. చెత్త, డెబ్రిస్ నిర్వహణ పనుల్ని కూడా త్వరితంగా చేపట్టనున్నారు. వర్షాకాలంలో తరచూ భవనాలు కూలిపోతుండటాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ దాదాపు నాలుగేళ్ల క్రితం నారాయణగూడలో భవనం కూల డాన్ని గుర్తు చేశారు. రహదారులు, నీటినిల్వ సమస్యల పరిష్కారానికి అవసరమైతే అంతర్జాతీయ కన్సల్టెంట్లను సంప్రదించాల్సిందిగా సూచించారు. అధికారులు ఆ దిశగా అడుగు వేయనున్నారు. - మౌలిక సదుపాయాల కల్పన.. ట్రా‘ఫికర్’ నుంచి విముక్తి.. 24 గంటల పాటు విద్యుత్, నీటిసరఫరాపై శ్రద్ధ చూపనున్నారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో 78 లక్షల జనాభా ఉండగా.. ప్రస్తుతం 94 లక్షలకు చేరారు. త్వరలో అమలయ్యే ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల దాదాపు మరో కోటిమంది దాకా నగరానికి వచ్చే అవకాశమున్నందున 2050 అవసరాల కనుగుణంగా సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం సూచించారు. ఐటీ కంపెనీలను ఆకట్టుకోవాలంటే మెరుగైన సదుపాయాలు ఉండాల్సి ఉన్నందున ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా సూచించారు. హైటెక్‌సిటీ అయినప్పటికీ సీవరేజి లైన్లు లేకపోవడాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం పనితీరు, డీజిల్ చౌర్యం వంటి అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. - మూసీ ఒకప్పుడు ఎంతో సుందరంగా ఉండేదంటూ.. ప్రస్తుతానికి చెత్తాచెదారాలు లేకుండాైనె నా తగు చర్యలు తీసుకోవాలనడంతో అధికారులు అందుకు సిద్ధమవుతున్నారు. - సమావేశంలో మంత్రులు, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ , హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్, జలమండలి ఎండీ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి ప్రాజెక్టులకునిధుల కొరత రానీయం నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాల పూర్తికి నిధుల కొరత రానీయబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గ్రేటర్ తాగునీటి అవసరాలు 2050 సంవత్సరం నాటికి ఎలా ఉండబోతాయో ఇప్పటి నుంచే సమగ్ర అంచనాలు సిద్ధం చేసుకోవాలని, అందుకు పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల అంచనాలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. నగరంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సరఫరాలో అంతరాయంలేకుండా చూసేందుకు అధికారులు, సిబ్బంది సదా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
ధారూరు, న్యూస్‌లైన్: తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ను గెలిపించాలని, కలల తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమని ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ధారూరులో త్రీడీ షో ద్వారా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాదాపు 40 నిమిషాల త్రీడీ షోలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని పలు అంశాలను ప్రస్తావించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తప్పకుండా అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల్లోని దద్దమ్మలతో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానరాని కాంగ్రెస్ నాయకులు తెలంగాణను ఎలా ఉద్దరిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాకుండా అన్నివిధాలా అడ్డుపడిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా కుట్ర పన్నుతున్నారని, తెలంగాణను ఎదగకుండా చూసేందుకు కుయుక్తులు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. బీజేపీతో టీడీపీ బలవంతంగా పొత్తు పెట్టుకుని తెలంగాణలో డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ కోసం ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అంతకు ముందు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంజీవరావులు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చెర్మైన్ రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ పటేల్, సిరాజుద్దీన్, సంతోష్‌కుమార్, రాంరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, యాదయ్య, యూనూస్, అంజయ్య, మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
జై రాం రమేష్ ... ఖబడ్దార్ : కేసీఆర్
కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌పై టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్‌లో కేసీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... సర్పంచ్‌గా కూడా గెలవలేని జైరాం రమేష్ తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోమని ...ఖబడ్దార్, జాగ్రత్తగా మాట్లాడు అంటూ జై రాం రమేష్‌పై కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆచరణ సాధ్యమైన అంశాలన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని చెప్పారు. అయితే టీఆర్ఎస్ మేనిఫెస్టోని కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఆయన విమర్శించారు. ఈ నెల 16 నుంచి తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. 3 డీ టెక్నాలజీ ద్వారా 700 సభలు తెలంగాణలో నిర్వహిస్తామని తెలిపారు. 3 డీ టెక్నాలజీ కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేసిన విజయం మాత్రం టీఆర్ఎస్ పార్టీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలుపే ధ్యేయంగా టికెట్లు కేటాయించడం వల్ల కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోయామని... అయితే రానున్న రోజుల్లో వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీసీలను సీఎం చేస్తామన్న టీడీపీ పార్టీ కేవలం 15 సీట్లిస్తే తమ పార్టీ 30 సీట్లు బీసీలకు కేటాయించామని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
'పవన్ పార్టీని మేం పట్టించుకోవడం లేదు'
హైదరాబాద్: ప్రజల ఎజెండానే తమ ఎజెండా అని టీఆర్ఎస్ నాయకుడు నేత కడియం శ్రీహరి అన్నారు. మూడు రోజుల్లో ముసాయిదా మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీని తాము పట్టించుకోవడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీతో సామాజిక తెలంగాణ అని చిరంజీవి తమ ప్రాంత ప్రజలను చిరంజీవి మోసం చేశారని ఆమె ఆరోపించారు.