'పవన్‌ పార్టీని మేం పట్టించుకోవడం లేదు' | TRS not recognise Pawan Kalyan Party, says Kadiyam Srihari | Sakshi
Sakshi News home page

'పవన్‌ పార్టీని మేం పట్టించుకోవడం లేదు'

Published Fri, Mar 14 2014 2:01 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'పవన్‌ పార్టీని మేం పట్టించుకోవడం లేదు' - Sakshi

'పవన్‌ పార్టీని మేం పట్టించుకోవడం లేదు'

హైదరాబాద్: ప్రజల ఎజెండానే తమ ఎజెండా అని టీఆర్ఎస్ నాయకుడు నేత కడియం శ్రీహరి అన్నారు. మూడు రోజుల్లో ముసాయిదా మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. పవన్‌ కళ్యాణ్ పార్టీని తాము పట్టించుకోవడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీతో సామాజిక తెలంగాణ అని చిరంజీవి తమ ప్రాంత ప్రజలను చిరంజీవి మోసం చేశారని ఆమె ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement