తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్, బీజేపీ తప్పుబట్టాయి.
హైదరాబాద్ : తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్, బీజేపీ తప్పుబట్టాయి. గవర్నర్ ప్రసంగం చప్పగా ఉండి.... నిరాశపరిచిందని నేతలు చిన్నారెడ్డి, కోమటిరెట్టి వెంకటరెడ్డి, రెడ్యానాయక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోనే గవర్నర్ చదివారని వారు విమర్శించారు. హామీల అమలుకు నిర్థిష్ట కార్యాచరణ ప్రకటించలేదని, రుణమాఫీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పలేదన్నారు.
పోలవరం ఆర్డినెన్స్ అంశాన్ని ప్రస్తావించలేదని, ఫ్లోరైడ్ సమస్యతో పాటు దళితులకు భూ కేటాయింపులపై స్పష్టత ఇవ్వలేదని నేతలు వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యగో భర్తీపై సర్కార్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, మైనార్టీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధానాన్ని ప్రకటించలేదని నేతలు పెదవి విరిచారు.