మంత్రులే బెదిరిస్తున్నారు.... | bjp state president kishan reddy takes on telangana government | Sakshi
Sakshi News home page

మంత్రులే బెదిరిస్తున్నారు....

Published Wed, Mar 4 2015 1:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మంత్రులే బెదిరిస్తున్నారు.... - Sakshi

మంత్రులే బెదిరిస్తున్నారు....

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించటం లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలను మంత్రులే బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కోర్టు ఆర్డర్స్ను కూడా ప్రభుత్వం ధిక్కరించిందని ఆయన పేర్కొన్నారు. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద గురువారం బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే..ప్రజలు షాక్ ఇస్తారని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ తలతోక లేని పార్టీ అని, ఆ పార్టీ నేతల విమర్శలకు స్పందించమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement