'అలా అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే' | congress mp gutta sukhender reddy slams on bjp government | Sakshi
Sakshi News home page

'అలా అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే'

Published Thu, Aug 27 2015 9:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'అలా అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే' - Sakshi

'అలా అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే'

నల్లగొండ: బీజేపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు గాంధీ కుటుంబంపై ఆరోపణలకు పాల్పడుతోందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు..కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులపై విమర్శలు చేయటంపై ఆయన స్పందించారు.

గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేయటమంటే సూర్యుడిపై ఉమ్మేయడమేనని చెప్పారు. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే బీజేపీ అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. వాటిని వెలుగులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిన క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగిందని చెప్పారు. అంతేకానీ సమావేశాలను ఉద్దేశపూర్వకంగా కాంగ్రె‌స్ అడ్డుకోలేదని వివరించారు. 15 నెలల కాలంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు తప్ప సాధించింది ఏమీలేదని ఏద్దేవా చేశారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement