కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురుతున్నా..
హైదరాబాద్: పంజాబ్ పై ఉగ్రవాదుల దాడిన కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. టెర్రరిస్ట్ అంశాలను కూడా బీజేపీ రాజకీయ లబ్థికోసం వాడుకోవాలనుకుంటుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కసబ్ ను ఉరితీసిన తర్వాతే మీడియాకు తెలిసిందని ఆయన గుర్తుచేశారు. యాకుబ్ మెమన్ ఉరి నిర్ణయాన్ని ప్రచారం చేసి దేశవ్యాప్తంగా మతపరమైన అంశాలు రెచ్చగొడుతోందని ఆయన మండిపడ్డారు. కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురుతున్నా ప్రధాని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే మోదీనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఆయన మండిపడ్డారు. ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్ రైతులను ఎందుకు ఆదుకోవటం లేదన్నారు. ఆలోచన వచ్చిందే తరువు కొత్త పథకాలు ప్రకటిస్తున్నారన్నారు. నూతనంగా ప్రకటించిన గ్రామజ్యోతి పథకానికి రూ. 25 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.