ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఇతర ప్రజా ప్రతినిధులను బెదిరించి పార్టీలోకి తీసుకున్నారు.. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సూచీగా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత మల్లు రవి శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. టీఆర్ఎస్ సెంట్రలైజ్డ్ కరప్షన్ కు తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ, చీకటి పాలన నడుస్తోందని, టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదని, రాష్ట్రం వచ్చి రెండేళ్లయిన ప్రజల ఆశలు నెరవేరలేదని పేర్కొన్నారు. 'టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మీడియాను ఇబ్బందులకు గురిచేశారని, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. నక్సలైట్ల అజెండానే మా అజెండా అని చెప్పిన టీఆర్ఎస్.. వరంగల్ లో సభను అడ్డుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులపై కెమెరాలతో నిఘా పెట్టారు' అని మల్లు రవి మండిపడ్డారు.
భూటకపు ఎన్కౌంటర్ లు చేశారని, విభజన చట్టంలో అంశాలను సాధించలేక పోయారని పేర్కొన్నారు. పెన్షన్ లు తప్ప మేనిఫెస్టో హామీలేవీ నెరవేర్చలేదని, హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన ఇప్పటికీ జరగలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయడం, దళితులకు 3 ఎకరాలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, కేజీ టు పీజీ, డబుల్ బెడ్ రూమ్ వంటి హామీలేవి ఈ రెండేళ్లలో అమలుకాలేదని చెప్పారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా సాధించలేక పోయారని, కనీసం కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, కొత్త అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మల్లు రవి సూచించారు.
'సెంట్రలైజ్డ్ కరప్షన్ కు టీఆర్ఎస్ తెరలేపింది'
Published Fri, May 27 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM
Advertisement
Advertisement