
సాక్షి, హైదరాబాద్: తక్షణమే యురేనియం తవ్వకాలను నిలిపివేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చి..చెంచుల జీవితాలతో ఆడుకోవద్దని పేర్కొన్నారు. నల్లమల అడవులను కాపాడాలని కోరారు. రాష్ట్ర్ర ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్లకు అనుమతి ఇచ్చిందనే ప్రచారం జరుగుతుందని..తక్షణమే ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. యురేనియం తవ్వకాలతో అభయరణ్యంలో పులులు అంతరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు కూడా కలుషితమవుతుందన్నారు.