మాట్లాడుతున్న ఎంపీ కేశవరావు
బంగారు తెలంగాణకు సహకరించాలి
Published Sat, Aug 27 2016 10:37 PM | Last Updated on Thu, Aug 9 2018 9:15 PM
– ఎంపీ కే. కేశవరావు
ఆత్మకూర్ : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, అందరి సహకారం కావాలని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. శనివారం మండలంలోని గోపన్‌పేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని, ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తుందన్నారు.
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రూ.4కోట్ల నిధులు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.కోటి కేటాయించి పాఠశాల అభివద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కేశవరావుతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, మా తండ్రి నర్సిరెడ్డితో కలిసి ఆయన పనిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్‌జీరంగా మాజీ డీన్ సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మక్తల్ ఇన్‌చార్జ్ దేవరిమల్లప్ప, డీసీసీబీ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, జెడ్పీటీసీ బాలకిష్టన్న, సర్పంచ్ వెంకటేష్, టీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement