
సాక్షి, ఖమ్మం : టీఆర్‌ఎస్ అభ్యర్థి నామాకు ఓటేస్తే ఆయన జనాలకు పంగనామాలు పెడతారని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి దుయ్యబట్టారు. మంగళవారమిక్కడ ఏన్కూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేణుక ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సుబాబుల్ రైతుల దగ్గర నుంచి పంట కొనుగులు చేయడం తెలీదు.. కానీ ఎమ్మెల్యేలను కొనడం మాత్రం బాగా తెలుసని మండి పడ్డారు.
బొంతలకు కూడా పనికిరాని చీరలను తెలంగాణ ఆడవాళ్లకు పంచి వారిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ప్రజలకు పంగ నామాలు పెడతారని హెచ్చరించారు. అదే కాంగ్రెస్‌కు ఓటేస్తే.. హస్తంతో టీఆర్‌ఎస్ పార్టీకి పంగనామం పెట్టవచ్చని తెలిపారు.