
సాక్షి, హైదరాబాద్: టీడీపీకి రాజీనామా చేసి న మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు టీఆర్ ఎస్‌లో చేరారు. గురువారం తెలంగాణ భవ న్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. నామాకు గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ ‘రాష్ట్ర అభివృద్ధి జరగాలి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండా లంటే కేసీఆర్ నాయకత్వం తెలంగాణలో ఉండాలి. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేస్తాం.
రాష్ట్రంలో జరుగుతున్న తాగు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నా. పార్టీ అధినేత ఆదేశానుసారం నడుచుకుంటా’ అని అన్నారు. నామాతోపాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ కుమారి, అమర్‌నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్‌బాబు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
నేతకాని వెంకటేశ్ సైతం..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నేతకాని వెంకటేశ్ సైతం గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ ఆయన కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
నేడు టీఆర్‌ఎస్‌లోకి ప్రతాపరెడ్డి
షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కూడా శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment