
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిన మహిళ మీడియా ముందుకు స్వయంగా వచ్చారు. 'సాక్షి'కి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. తనను అందరూ చూస్తారనే భయం లేదని, తన మొహాన్ని బ్లర్ చేయొద్దని కూడా కోరారు.
నామా నాగేశ్వర్‌రావు ఫేస్‌బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే ఉన్నారని చెప్పారు. మీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నన్ను వేధిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు తాను నామాతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కూడా వాట్సాప్ చేశానని, వారు పట్టించుకోలేదని చెప్పారు.
'సాక్షి'తో బాధిత మహిళ చెప్పిన సంచలన విషయాలు