నామా నాగేశ్వర రావు
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహా కూటమి పది సీట్లు గెలుస్తుందని మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. ఖమ్మంలో నామా విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణా బిల్లుకు మొదట ఓటేసింది తానేనని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కేసీఆర్ విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన విత్తనాలే ఇప్పుడు పండ్లుగా మారాయని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణా అని వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. అసమ్మతులు టీ కప్పులో తుపాను లాంటివని అన్నారు. పెద్దన్న లాంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవి సర్దుకుంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment