మాట్లాడుతున్న పురందేశ్వరి. చిత్రంలో బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద
ఖమ్మంమామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నాయకులు బెదిరింపులతోనే పాలన సాగించారని, ఈ నాలుగున్నరేళ్లలో వారు చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఖమ్మంలోని కావేరి హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో వాగ్దానాలే మిగిలాయని, వాటి అమలును పూర్తిగా విస్మరించారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగలేదన్నారు.
యువతకు ఉద్యోగాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వంటి వాటిని మేనిఫెస్టోలో పెట్టినా.. వాటిని అమలు చేయలేదని విమర్శించారు. సిద్ధాంతపరంగా పరస్పర విరుద్ధమైన కాంగ్రెస్, టీడీపీ పార్టీల పొత్తుపై తెలంగాణ ప్రజలు నిలదీయాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో స్థానికంగా ఉండే అభ్యర్థులను ఎన్నుకోవాలని.. ప్రజాకూటమి నుంచి ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు వ్యాపారవేత్త అని.. ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటారని, ఇక్కడి ప్రజలకు అవసరం వస్తే అందుబాటులో ఉండే పరిస్థితి లేదన్నారు. ప్రజల గురించి పట్టించుకోకుండా నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్ స్వలాభం కోసం పని చేస్తు న్నారని విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో పాలుపంచుకునే బీజేపీ అభ్యర్థి ఉప్పల శారదను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎందరినో గెలిపించిన ఖమ్మం ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. తొలుత ఖమ్మం చేరు కున్న ఆమెకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, జిల్లా ఇన్‌చార్జి యాదగిరిరెడ్డి, ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి ఉప్పల శారద, మంజుశ్రీ, దుర్గా ప్రసాదరెడ్డి, వీరభద్రప్రసాద్, నాగేం దర్, వీరభద్రం, శ్రీదేవి, జనార్దన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment