Purenderswary
-
బీజేపీ రాష్ట్ర శాఖలకు కొత్త సారథులు
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని అధికార బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. దీంతో, త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీకి కొత్త సారథులను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని, ఏపీ చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరిని నియమించింది. అదేవిధంగా, పంజాబ్ బాధ్యతలు సునీల్ జాఖడ్‌కు, జార్ఖండ్ చీఫ్‌గా బాబూలాల్ మరాండీకి బాధ్యతలు అ ప్పగిస్తున్నట్లు బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ బాధ్యతలను ఓబీసీ నేత ఈటెల రాజేందర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా అధికార భారత రాష్ట్ర సమితిని దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ మార్పులు చేపట్టినట్లు భావిస్తున్నారు. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. ఈమె యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్‌కు పగ్గాలు అప్పగించింది. అదేవిధంగా, జార్ఖండ్‌లో గిరిజన నేత, సీఎం హేమంత్ సోరెన్‌ను ఢీకొట్టేందుకు అదే వర్గానికి చెందిన మాజీ సీఎం మరాండీని రంగంలోకి దించింది. మరాండీ తన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్)ను 2020లో బీజేపీలో విలీనం చేశారు. -
ప్రతి స్కీమ్‌ను ఒక స్కామ్‌గా మార్చారు
-
బెదిరింపులతోనే రాష్ట్ర పాలన
ఖమ్మంమామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు బెదిరింపులతోనే పాలన సాగించారని, ఈ నాలుగున్నరేళ్లలో వారు చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఖమ్మంలోని కావేరి హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో వాగ్దానాలే మిగిలాయని, వాటి అమలును పూర్తిగా విస్మరించారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగలేదన్నారు. యువతకు ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వంటి వాటిని మేనిఫెస్టోలో పెట్టినా.. వాటిని అమలు చేయలేదని విమర్శించారు. సిద్ధాంతపరంగా పరస్పర విరుద్ధమైన కాంగ్రెస్, టీడీపీ పార్టీల పొత్తుపై తెలంగాణ ప్రజలు నిలదీయాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో స్థానికంగా ఉండే అభ్యర్థులను ఎన్నుకోవాలని.. ప్రజాకూటమి నుంచి ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు వ్యాపారవేత్త అని.. ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటారని, ఇక్కడి ప్రజలకు అవసరం వస్తే అందుబాటులో ఉండే పరిస్థితి లేదన్నారు. ప్రజల గురించి పట్టించుకోకుండా నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్ స్వలాభం కోసం పని చేస్తు న్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పాలుపంచుకునే బీజేపీ అభ్యర్థి ఉప్పల శారదను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎందరినో గెలిపించిన ఖమ్మం ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. తొలుత ఖమ్మం చేరు కున్న ఆమెకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, జిల్లా ఇన్చార్జి యాదగిరిరెడ్డి, ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి ఉప్పల శారద, మంజుశ్రీ, దుర్గా ప్రసాదరెడ్డి, వీరభద్రప్రసాద్, నాగేం దర్, వీరభద్రం, శ్రీదేవి, జనార్దన్ పాల్గొన్నారు. -
'13 రాష్ట్రాల సీఎంలను బాబు ఒప్పించాలి'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 13 రాష్ట్రాల సీఎంలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పించుకోవాలని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ శనివారం చిత్తూరు జిల్లాలోని గాంధీ సర్కిల్లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పురందేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నుంచి 4 వేల కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల ఖర్చు నివేదికను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వాల్సి ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు.