'13 రాష్ట్రాల సీఎంలను బాబు ఒప్పించాలి'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 13 రాష్ట్రాల సీఎంలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పించుకోవాలని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ శనివారం చిత్తూరు జిల్లాలోని గాంధీ సర్కిల్లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
ఈ సందర్భంగా పురందేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నుంచి 4 వేల కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల ఖర్చు నివేదికను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వాల్సి ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు.