నామాను గెలిపించాలి : సినీహీరో వేణు | Hero Venu Election Campaign In Khammam | Sakshi
Sakshi News home page

నామాను గెలిపించాలి : సినీహీరో వేణు

Apr 7 2019 11:34 AM | Updated on Apr 7 2019 11:34 AM

Hero Venu Election Campaign In Khammam - Sakshi

బాణాపురంలో ఓట్లు అభ్యర్థిస్తున్న సినీహీరో వేణు

చింతకాని: ఖమ్మం పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ హీరో తొట్టెంపూడి వేణు కోరారు. నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో శనివారం వేణు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి నామా విజయానికి పాటుపడాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, సత్యనారాయణ, తోటకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
నామాతోనే అభివృద్ధి సాధ్యం 
ముదిగొండ: ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే నామా నాగేశ్వరరావును గెలిపించాలని సినీహీరో తొట్టెంపూడి వేణు కోరారు. మండలంలోని బాణాపురంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు పచ్చా సీతారామయ్య, మండల నాయకులు దేవరపల్లి ఆదినారాయణరెడ్డి, మరికంటి సత్యనారాయణ, అనిత, శ్రీరాములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement