సాక్షి,న్యూఢిల్లీ: ఈడీ దాడుల నేపథ్యంలో రక్షణ కల్పించాలంటూ టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, సోదరుడు సీతయ్యలు దాఖలు చేసిన పిటిషన్లలో ఈడీ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నామా పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాడుల నుంచి రక్షణ కల్పించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది పరమాత్మ సింగ్ కోరారు. ఇదే అంశానికి సంబంధించి నీలేశ్ పారేఖ్ కేసుతో ఈ పిటిషన్ జత చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
చదవండి: ఈడీ విచారణకు హాజరుకాని ఎంపీ నామా
Comments
Please login to add a commentAdd a comment