ఎమ్మెల్సీ కవిత కేసులో ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: బెయిల్ అంశాల్లో కౌంటర్ల దాఖలుకు ఆలస్యమెందుకో అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ కేవీ.విశ్వ నాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాద నలు వినిపిస్తూ.. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలు అని తెలిపారు. కేసులో సహ నిందితు డైన సిసోడియాకు బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా, ఈడీ కౌంటర్ దాఖలు చేయ లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ.రాజు ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. బెయిల్ అంశాల్లో కౌంటర్ల దాఖ లుకు ఆలస్యమెందుకు? కోర్టులో కేసు డైరీతోనే నిర్ణయం ఉంటుందంటూ ఈడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 45లో కఠిన నిబంధనల నుంచి మహిళగా కవితకు మినహాయింపు ఉందని ముకుల్ రోహత్గి ప్రస్తావించగా... పీఎంఎల్‌ఏ కఠిన నిబంధనలు ఎందుకెలా వర్తి స్తాయో కింది కోర్టుల న్యాయమూర్తులు వివరణా త్మక కారణాలు తెలిపారని ధర్మాసనం వ్యాఖ్యాని ంచింది.
కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వలేదో హైకోర్టు కారణాలు వివరించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో కవితకు మధ్యంతర ఊరట కల్పించాలని ముకుల్ రోహత్గి కోరగా. ధర్మాసనం నిరాకరించింది. ఈడీ బుధ వారం కౌంటర్ దాఖలు చేస్తే శుక్రవారం వాద నలు వినిపిస్తామని రోహత్గి తెలిపారు. దీంతో, ఈడీ తరఫు కౌంటర్ దాఖలు చేయడానికి గురు వారం వరకూ సమయం ఇవ్వాలని రాజు కోరగా, అదేరోజు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని, శుక్రవారం రిజాయిండర్ దాఖలు చేయా లని పిటిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.
కాంగ్రెస్సే కవితకు బెయిల్ ఇప్పిస్తోంది
ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ కుమ్మక్కు: బండి సంజయ్
మహేశ్వరం: కేసీఆర్ కూతురు కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందుకు సంబంధించిన కేసును కాంగ్రెస్ నుంచి కాబోయే రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీయే కోర్టులో వాదిస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాలలో మంగళవారం నిర్వహించిన సూర్యగిరి రేణుక ఎల్లమ్మ ఉత్సవాలకు హాజరైన సంజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. కేసీఆర్ సూచించిన వారికే రాష్ట్రంలో మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సీట్లు వస్తున్నాయని తెలిపారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫాంహౌస్‌కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు.
అభిషేక్ సింఘ్వీ అనుభవజ్ఞుడైన న్యాయవాది అని, ఆయన తెలంగాణ నుంచి ఎంపీ అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కోర్టుల్లో, పార్లమెంట్‌లో గట్టిగా వాదిస్తారనుకుంటే .. లిక్కర్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం వాదిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment