
Venu Arvind: ప్రముఖ బుల్లితెర నటుడు వేణు అరవింద్ ఆస్పత్రిలో కోమా స్థితిలో వున్నట్లు వైద్యులు తెలిపారు. టీవీ సీరియల్ నటుడు వేణు అరవింద్. కొన్ని సినిమాల్లో నటించిన ఈయన శభాష్ సరియాన పోటీ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే వేణు అరవింద్ సినిమాలకంటే బుల్లితెరలోనే పాపులర్ అయ్యారు.
కాగా ఆయన ఇటీవల కరోనా బారిన పడి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే కరోనా నుంచి బయటపడ్డ ఆయనకు మెదడులో గడ్డ ఉండడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం వేణు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు.