ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించిన సినిమా 'బలగం'. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబట్టింది.
(ఇది చదవండి: బలగం తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అలా పిలవట్లేదు: వేణు)
చిత్రబృందం ఊహించిన దానికంటే ఎక్కవ గానే ప్రేక్షకాదరణ లభించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు మేకర్స్. ఈనెల 24 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై వీక్షించవచ్చని చిత్రబృందం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment