ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రాల్లో 'బలగం' ఒకటి. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించారు. ఈనెల 3న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
చదవండి: Manchu Vishnu Vs Manoj: మంచు మనోజ్, విష్ణుల మధ్య వివాదం.. షాకింగ్ వీడియో వైరల్
భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. అలాగే, ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలను చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ చిత్రం కేవలం మౌత్‌టాక్‌తోనే విజయం సాధించింది. పెల్లె పద్దతులు, వారి జీవనశైలిలో వంటి తదితర అంశాలతో ఈ సినిమాకు ప్రేక్షకులు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
చదవండి: సీక్రెట్‌గా పెళ్లి పీటలు ఎక్కిన నటీనటులు.. ఫొటోలు వైరల్
దీంతో ప్రేక్షకుల అంత షాక్ అవుతున్నారు. బాక్సాఫీసు వద్ద మంచి వసూళు చేసిన ఈ చిత్రం రెండు నెలల వరకు ఓటీటీకి రాదని అభిప్రాయపడ్డారు. కానీ మూడు వారాలకే ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో విడుదలైన 20 రోజులకే ఈ మూవీ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ కావడం విశేషం. అమెజాన్ ప్రైం ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి బలగం మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment