పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Tue, Aug 18 2015 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: దలేర్ మెహందీ (సింగర్); సందీప్ పాటిల్ (మాజీ క్రికెటర్)

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతుగ్రహానికి సంబంధించినది.కేతువు మోక్షకారకుడు, ఆధ్యాత్మిక వేత్త. అందువల్ల ఈ సంవత్సరం ఆధ్యాత్మికతతో గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. కొందరిలో ఆత్మసాక్షాత్కారం కూడా కలగవచ్చు. వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. ఇంటాబయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లకుండా జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది.

వీరు పుట్టిన తేదీ 18 కుజ సంఖ్య కావడం వల్ల ఆవేశానికి గురి కావడం, దూకుడుగా ప్రవర్తించడం జరుగుతుంది. అందువల్ల వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండటం, చీటికి మాటికీ కోర్టులకు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం, ప్రస్తుతం  చేస్తున్న ఉద్యోగాన్నే కొనసాగించడంమంచిది. ఈ సంవత్సరం పెద్దలు, ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు బాగా ఉపయోగపడతాయి. పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలను నడపడంలోనూ అప్రమత్తంగా ఉండటం మంచిది.
లక్కీ నంబర్స్: 1,2,3,6,7, 8, 9; లక్కీ డేస్: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రెడ్ , రోజ్, ఆరంజ్, వైట్, సిల్వర్
సూచనలు: సుబ్రహ్మణ్యారాధన, గణపతి హోమం, రక్తదానం చేయడం లేదా ప్రోత్సహించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement