ఈ ఏడాది ‘మెగా’ అభిమానులకు చాలా స్పెషల్. మెగా ఫ్యామిలీలో వరుస శుభకార్యాలతో పాటు వరుస సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. వైష్ణవ్ తేజ్ వరకు ఈ ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాలను ఫ్యాన్స్‌కు అందించబోతున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి.
‘బ్రో’
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. వినోదయ సీతమ్మకు తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకుడు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన చిత్రం కావడంతో ‘బ్రో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
భోళాశంకర్
బ్రో సినిమా విడుదలైన రెండు వారాలేకే భోళాశంకర్ సినిమా రాబోతుంది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు తెలుగు రీమేక్ ఇది. మోహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న లీజ్ కాబోతుంది.
ఆదికేశవ
భోళా శంకర్ రిలీజైన వారం రోజులకే అంటే ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ చిత్రం విడుదల కాబోతుంది. వైష్ణవ్ కెరీర్‌లో నాలుగో చిత్రమిది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీలీల హీరోయిన్.
‘గాండీధారి అర్జున’
ఆదికేశవ వచ్చిన మరో వారానికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గాండీధారి అర్జున’ చిత్రం రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మొత్తానికి జులై నెలాఖరు నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు... నెల రోజుల పాటు ఐదుగురు మెగా హీరోలు నాలుగు సినిమాలతో సందడి చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment