Adi Keshava Movie
-
ఎవరైనా అడిగినే నేను హీరో కాదని చెబుతా: వైష్ణవ్ తేజ్
కథ నచ్చితే చాలు..ఫలితం గురించి ఆలోచించకుండా సినిమాను ఒప్పుకుంటాను. నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను. హీరో అని అనిపించుకోవడం కంటే..నటుడు అని పిలిపించుకోవడమే ఇష్టం. ఎవరైన నన్ను అడిగినా కూడా నేను హీరోని కాదు నటుడిని అని చెబుతాను’ అని అన్నారు యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్. తార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. . జోజు జార్జ్, అపర్ణా దాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రంగ రంగ వైభవంగా చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ గారు ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే నాకు ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత కథ ఇంకా ఎన్నో మెరుగులు దిద్దుకుని అద్భుతంగా వచ్చింది. ► ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారు. ► నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. సంభాషణలు సహజంగా సరదాగా ఉంటాయి. షూటింగ్ టైంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. పాత్రలోని అమాయకత్వం, తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్ హాస్యం రాబట్టారు. మీరు స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తాయి సన్నివేశాలు. ► శ్రీలీలతో డ్యాన్స్ అనగానే కాస్త భయపడ్డాను. నేనసలు డ్యాన్సర్ ని కాదు(నవ్వుతూ). కానీ నేను మాస్టర్ కి ఒకటే చెప్పాను. మీరు ఓకే అనేవరకు నేను ఎంతైనా కష్టపడి చేస్తాను అన్నాను. 100 శాతం కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మొదటి రెండు టేకులకే ఎలా చేయాలి, ఎంత ఎనర్జీ పెట్టాలో అర్థమైపోయింది. మాస్టర్, శ్రీలీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగాను. ► రాధిక నటిస్తున్నారని తెలియగానే..అంత సీనియర్ ఆర్టిస్ట్ సెట్స్ లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతటి సీనియర్ ఆర్టిస్ట్ కలిసి పని చేయడం సంతోషంగా అనిపించింది. ► కథలో కొత్తదనం ఉంటే చాలు సినిమాను ఒప్పేసుకుంటాను. అలాగే నా పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను. -
ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. జులై నెలలో ప్రతివారం రెండు, మూడు చిన్న సినిమాలు థియేటర్స్‌లో సందడి చేశాయి. వాటిల్లో కొన్ని హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇక ‘బేబీ’ చిత్రం అయితే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బేబీ’తో మరోసారి రుజువైంది. అందుకే ఆగస్ట్‌లో కూడా వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మొదటి వారం(ఆగస్ట్ 4) ప్రముఖ క్రికెటర్ ధోనీ నిర్మించిన తొలి సినిమా ‘ఎల్జీఎం’విడుదల కానుంది. దీంతో పాటు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘హెబ్బులి’, ‘రాజుగారి కోడి పలావ్’, ‘విక్రమ్ రాథోడ్’, ‘దిల్సే, ‘మిస్టేక్’, ‘మెగ్ 2’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ Vs సూపర్ స్టార్ ఇక ఆగస్ట్ రెండోవారంలో రెండు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆ తర్వాతి రోజు అంటే ఆగస్ట్ 11న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్ ’రిలీజ్ కాబోతుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించింది. అటు ‘జైలర్’, ఇటు ‘భోళా శంకర్’ ల మధ్య మరో చిన్న చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. ఇలా ఆగస్ట్ రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలతో పాటు ఒక చిన్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే హిందీ నుంచి కూడా రెండు ఆసక్తికరమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ మై గాడ్ 2’, సన్నీదేఓల్ నటించిన ‘గదర్ 2’ చిత్రాలు ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా రెండు సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ కావడం గమనార్హం. మూడో వారంలో నాలు చిన్న చిత్రాలు ఆగస్ట్ మూడో వారంలో అన్ని చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. రెండో వారంలో జైలర్, భోళాశంకర్ లాంటి బడా సినిమాలు రావడంతో మూడో వారం ఎలాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సాహసం చేయలేదు. దీంతో ఈ వారం మళ్లీ చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆదికేశవ’తో పాటు శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు 1’, సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’, ‘నచ్చినవాడు’ చిత్రాలు విడుదలకానున్నాయి. ‘మెగా’ సందడి ఆగస్ట్‌లో నెలలో వరుసగా మెగా హీరోలు సందడి చేయనున్నారు. రెండో వారం ‘భోళా శంకర్’తో చిరంజీవి వస్తే... మూడో వారం ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’అంటూ అలరించడానికి రెడీ అయ్యాడు. ఇక నాలుగో వారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాంఢీవధారి అర్జున’ విడుదల కాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కార్తికేయ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ చిత్రం కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. వీటితో పాటు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన హిందీ చిత్రం ‘డ్రీమ్ గర్ల్ 2’ కూడా ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. -
ఐదుగురు ‘మెగా’ హీరోలు.. 30 రోజులు.. 4 సినిమాలు
ఈ ఏడాది ‘మెగా’ అభిమానులకు చాలా స్పెషల్. మెగా ఫ్యామిలీలో వరుస శుభకార్యాలతో పాటు వరుస సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. వైష్ణవ్ తేజ్ వరకు ఈ ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాలను ఫ్యాన్స్‌కు అందించబోతున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ‘బ్రో’ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. వినోదయ సీతమ్మకు తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకుడు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన చిత్రం కావడంతో ‘బ్రో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భోళాశంకర్ బ్రో సినిమా విడుదలైన రెండు వారాలేకే భోళాశంకర్ సినిమా రాబోతుంది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు తెలుగు రీమేక్ ఇది. మోహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న లీజ్ కాబోతుంది. ఆదికేశవ భోళా శంకర్ రిలీజైన వారం రోజులకే అంటే ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ చిత్రం విడుదల కాబోతుంది. వైష్ణవ్ కెరీర్లో నాలుగో చిత్రమిది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీలీల హీరోయిన్. ‘గాండీధారి అర్జున’ ఆదికేశవ వచ్చిన మరో వారానికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గాండీధారి అర్జున’ చిత్రం రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మొత్తానికి జులై నెలాఖరు నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు... నెల రోజుల పాటు ఐదుగురు మెగా హీరోలు నాలుగు సినిమాలతో సందడి చేయబోతున్నారు.