సాక్షి, అమరావతి: పవన్‌కళ్యాణ్ తాజాగా నటించిన ‘బ్రో’ సినిమా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన పలు సంచలన ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించకపోగా, ఇక నుంచి పార్టీ నేతలెవ్వరూ సినిమాల గురించి మాట్లాడ కండంటూ హుకుం జారీ చేయడం పట్ల విస్తుపోతున్నారు. రాజకీయాల్లో సినిమా ప్రస్తావనలొద్దని చెప్పడం వెనుక కారణం ఏంటని చర్చించుకుంటున్నారు.
సాధారణంగా ‘ఈ వకీల్‌సాబ్.. చెబుతున్నాడు’ అంటూ.. తాను నటించిన సినిమాలోని పా త్రలను ఉటంకిస్తూ మాట్లాడటం పరిపాటి. తన రాజకీయ ప్రసంగాల్లో ఎక్కువగా సినిమా విష యాలే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటిది.. హఠాత్తుగా ‘సినిమాలను రాజకీయాల్లోకి తీసుకురావొద్ద’ంటూ నేతలకు బహిరంగంగా స్పష్టమైన సూచనలు చేయడం మంత్రి అంబటి లేవనెత్తిన అంశాలపై పార్టీ నాయకులు సైతం మాట్లాడకుండా ఉండడం కోసమేనని స్పష్టమవుతోంది. ఈ విధంగా తమ నోళ్లను కూడా మూయించారని జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది.
పవన్ ఎంత తీసుకున్నాడు?
‘బ్రో’ సినిమాలో పరోక్షంగా మంత్రి అంబటిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించడంపై సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయాల కోసం సినిమాలు చేస్తున్నానని, రోజుకు రూ.రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానని చెబుతున్న పవన్ కళ్యాణ్.. బ్రో సినిమాకు నిర్మాతల నుంచి ఎంత తీసుకున్నాడు?.. అసలు ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చి చెప్పాలంటూ మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ఆ సినిమా వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందని.. చంద్రబాబు అండ్ ముఠా అమెరికాలో చందాలు వసూలు చేసి, ఆ బ్లాక్ మనీని వైట్ చేసి పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇచ్చారని ఆరోపించారు.
వీటన్నింటిపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలన్న డిమాండ్‌తో అంబటి ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లి రావడం తెలిసిందే. మంత్రి అంబటి ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసిన అనంతరం విలేకరులతో కూడా ఇవే విషయాలు చెప్పారు. ఈ విషయాలు నిజం కాకపోతే పవన్‌కళ్యాణ్ ఎందుకు ఖండించడం లేదనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దీనిపై ఏం మాట్లాడితే ఏం బయట పడుతుందోనని పవన్ భయపడటం వల్లే ‘సినిమా’ ప్రస్తావనలు వద్దని సూచించారని జనసేనకు చెందిన ఓ నేత తెలిపారు. సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికిన పవన్.. ఆ సినిమాలో అంబటిని అవమానించేలా నృత్యం ఎందుకు పెట్టించాడో సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాజకీయ, సినీ విమర్శకులు పేర్కొంటున్నారు.
చదవండి పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా?: వెల్లంపల్లి
Comments
Please login to add a commentAdd a comment