karyakarthalu
-
చంద్రబాబు అరెస్ట్ పై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ
-
రాజకీయాల్లో ‘సినిమా’లొద్దట.. పవన్ కొత్త పల్లవి
సాక్షి, అమరావతి: పవన్‌కళ్యాణ్ తాజాగా నటించిన ‘బ్రో’ సినిమా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన పలు సంచలన ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించకపోగా, ఇక నుంచి పార్టీ నేతలెవ్వరూ సినిమాల గురించి మాట్లాడ కండంటూ హుకుం జారీ చేయడం పట్ల విస్తుపోతున్నారు. రాజకీయాల్లో సినిమా ప్రస్తావనలొద్దని చెప్పడం వెనుక కారణం ఏంటని చర్చించుకుంటున్నారు. సాధారణంగా ‘ఈ వకీల్‌సాబ్.. చెబుతున్నాడు’ అంటూ.. తాను నటించిన సినిమాలోని పా త్రలను ఉటంకిస్తూ మాట్లాడటం పరిపాటి. తన రాజకీయ ప్రసంగాల్లో ఎక్కువగా సినిమా విష యాలే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటిది.. హఠాత్తుగా ‘సినిమాలను రాజకీయాల్లోకి తీసుకురావొద్ద’ంటూ నేతలకు బహిరంగంగా స్పష్టమైన సూచనలు చేయడం మంత్రి అంబటి లేవనెత్తిన అంశాలపై పార్టీ నాయకులు సైతం మాట్లాడకుండా ఉండడం కోసమేనని స్పష్టమవుతోంది. ఈ విధంగా తమ నోళ్లను కూడా మూయించారని జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. పవన్ ఎంత తీసుకున్నాడు? ‘బ్రో’ సినిమాలో పరోక్షంగా మంత్రి అంబటిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించడంపై సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయాల కోసం సినిమాలు చేస్తున్నానని, రోజుకు రూ.రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానని చెబుతున్న పవన్ కళ్యాణ్.. బ్రో సినిమాకు నిర్మాతల నుంచి ఎంత తీసుకున్నాడు?.. అసలు ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చి చెప్పాలంటూ మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ఆ సినిమా వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందని.. చంద్రబాబు అండ్ ముఠా అమెరికాలో చందాలు వసూలు చేసి, ఆ బ్లాక్ మనీని వైట్ చేసి పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇచ్చారని ఆరోపించారు. వీటన్నింటిపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలన్న డిమాండ్‌తో అంబటి ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లి రావడం తెలిసిందే. మంత్రి అంబటి ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసిన అనంతరం విలేకరులతో కూడా ఇవే విషయాలు చెప్పారు. ఈ విషయాలు నిజం కాకపోతే పవన్‌కళ్యాణ్ ఎందుకు ఖండించడం లేదనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దీనిపై ఏం మాట్లాడితే ఏం బయట పడుతుందోనని పవన్ భయపడటం వల్లే ‘సినిమా’ ప్రస్తావనలు వద్దని సూచించారని జనసేనకు చెందిన ఓ నేత తెలిపారు. సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికిన పవన్.. ఆ సినిమాలో అంబటిని అవమానించేలా నృత్యం ఎందుకు పెట్టించాడో సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాజకీయ, సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. చదవండి పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా?: వెల్లంపల్లి -
పాదయాత్రలంటే హడలిపోతున్న నేతలు.. టీ.కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది!
కాంగ్రెస్ నేతలు పాదయాత్రలంటే హడలిపోతున్నారెందుకు? ఒక వైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలు షురూ చేశారు. వీరిద్దరి యాత్రలతో జిల్లాల నాయకులు ఇబ్బంది పడుతున్నారు. మా నియోజకవర్గంలో పాదయాత్ర వద్దంటే ఏమవుతుందో అన్న భయం. అగ్ర నేతల ఆధిపత్య పోరుతో నలిగిపోతున్న జిల్లా నాయకులు. అసలు టీ.కాంగ్రెస్‌లో ఏంజరుగుతోంది? చేయి తుప్పు వదులుతోందట.! హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ యాత్రలు చేస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. అయితే ఎవరి నియోజకవర్గంలో వారు పాదయాత్ర చేస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అంటూ బయల్దేరడంతో నియోజకవర్గ స్థాయి నేతల గుండెలు అదిరిపోతున్నాయట. పాదయాత్ర అంటేనే ఖర్చుతో కూడుకున్నది. జనసమీకరణ, భోజనాలు, ఇతర ఏర్పాట్లు అన్ని కలిపి ఒక్క రోజుకు కనీసం 25 నుంచి 30 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఒక నియోజకవర్గంలో ఒక్కరోజు పాదయాత్ర అయితే ఇబ్బంది లేదు కానీ నేతలు పోటీ పడి యాత్ర చేయడం ద్వారా తమకు ఖర్చు తడిసి మోపడవుతోందని తెగ హైరానా పడిపోతున్నారట నియోజకవర్గాల్లో టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు. పాదయాత్రకు టికెట్‌కు లింకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున తమ నియోజకవర్గంలో పాదయాత్ర వద్దంటే టిక్కెట్ ఎక్కడ ఎగిరిపోతుందో అనే భయం ఒకవైపు... యాత్ర లేకపోతే కేడర్‌లో ఉత్సాహం తగ్గిపోతుందనే ఆందోళన మరోవైపు స్థానిక నేతల్ని ఆలోచనలో పడేస్తోంది. ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అటు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా భట్టి విక్రమార్క తన పాదయాత్ర షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు 150 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒకటి, రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు రాష్ట్ర నాయకులు పాదయాత్ర పెట్టుకోవడం నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారంగా మారిందట. అలా జిల్లాలు చుట్టేస్తున్నారు.! హుజురాబాద్, హుస్నాబాద్, స్టేషన్ ఘన్ పూర్, వర్దన్న పేట, ఇల్లందు, కొత్తగూడెం ఇలా పలు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర పూర్తయింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ప్రారంబించిన భట్టి పాదయాత్ర కూడా ఈ నియోజకవర్గాల గుండా వెళ్ళనుంది. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ పరధిలోనే పాదయాత్ర షెడ్యూల్ ను రేవంత్ రెడ్డి ఇంకా ప్రకటించలేదు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పూర్తయ్యాక రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తారని చెబుతున్నారు. అయినను పోయి రావలెను భట్టి పాదయాత్ర చేసిన రూట్ లో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ పాదయాత్ర చేసిన రూట్ లో సీఏల్పీ నేత పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం ఏంటనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇద్దరు నేతలు కూర్చుని కర్ణాటక కాంగ్రెస్ నేతల మాదిరిగా.. ఒకరు పాదయాత్ర చేసిన నియోజకవర్గంలో మరోకరు చేయకుండా రూట్ మ్యాప్ తయారు చేసుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుంది...నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారం తగ్గతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాని క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా..గాంధీభవన్ నేతలు ఏకపక్షంగా పాదయాత్ర రూట్ మ్యాప్ లను ప్రకటించడంతో నియోజకవర్గ ఇంచార్జ్ లు, ఆశావాహులు నలిగిపోతున్నారు. -
మేమింతే.. ఆంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని టీడీపీ నాయకులు
సాక్షి,చిలమత్తూరు(శ్రీ సత్యసాయి ): ఆపద సమయంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు ఎవరైనా సహకరిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా టీడీపీ నాయకులు వ్యవహరించారు. బీమా సొమ్ము పడలేదంటూ చిలమత్తూరులో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు వెడల్పునా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగారు. అదే సమయంలో ఆపదలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తూ 108 అంబులెన్స్ అటుగా వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తున్నా.. తమకేమీ పట్టనట్లు కనీసం దారి కూడా ఇవ్వకుండా టీడీపీ నాయకులు వ్యవరించారు. దీన్ని చూసిన స్థానికులు టీడీపీ నాయకుల తీరును ఏవగించుకున్నారు. చదవండి: లంచం అడిగి అడ్డంగా దొరికాడు.. ఇంటికి వెళ్లి వస్తాను సార్ వదలండి! -
శివసేన కార్యకర్తల ఆగ్రహం.. కోడిగుడ్లతో రోడ్లపైకి వచ్చి..
ముంబై: మహారాష్ట్రలో పాలక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. షిండేకు వ్యతిరేకంగా జరిగిన తాజా నిరసనలో నాసిక్‌లో కొందరు శివసేన కార్యకర్తలు అతని పోస్టర్‌పై ఇంక్ చల్లడంతో పాటు కోడిగుడ్లు విసిరి నిరసనను తెలిపారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. రెబల్ పార్టీ నేత ఏక్నాథ్ షిండేతో కలిసి గౌహతి క్యాంప్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే సదా సర్వాంకర్ పోస్టర్‌పై ‘మోసగాడు’ అని రాసి శివసేన కార్యకర్తలు తమ నిరసనను తెలిపారు. ఈ ఘటన ఆయన సొంత నియోజకవర్గం మహిమ్లో చోటు చేసుకుంది. పార్టీ శాసనసభ్యులు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటులో చేరిన తర్వాత మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం చెలరేగింది. షిండే శిబిరానికి ప్రస్తుతం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వీరిలో కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. #WATCH Shiv Sena supporters throw black ink and eggs at a poster showing a picture of rebel MLA Eknath Shinde, also raise slogans against him, in Nashik pic.twitter.com/DUtKE2R2S5 — ANI (@ANI) June 24, 2022 చదవండి: Maharashtra political crisis: షిండే తొలగింపు చెల్లుతుంది! -
కదిరిలో తారస్థాయికి ‘తమ్ముళ్ల’ పోరు
కదిరిలో అతుకులబొంతగా మారిన టీడీపీలో.. ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది. ఓ వైపు కందికుంట.. మరోవైపు అత్తార్ వర్గాలు కత్తులు దూస్తున్నాయి. ఇప్పటి నుంచే అసెంబ్లీ టికెట్ కోసం బాహాబాహీకి సిద్ధమయ్యాయి. తాజాగా చాంద్ అనుచరుడిపై కందికుంట వర్గం దాడి చేయడంతో కదిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. సాక్షి,కదిరి(అనంతపురం): ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నప్పటికీ కదిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అప్పుడే టికెట్ లొల్లి మొదలైంది. ఈసారి టీడీపీ టికెట్ తమ నేతకేనని కందికుంట వెంకట ప్రసాద్ వర్గం చెబుతుండగా, కాదు కాదు.. కచ్చితంతా మా నాయకుడికే అని అత్తార్ చాంద్‌బాషా వర్గం వాదిస్తోంది. ఈ విషయంపై కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య ఫేస్బుక్ వార్ నడుస్తోంది. ఇది కాస్త శ్రుతిమించి భౌతిక దాడుల వరకూ వెళ్లింది. పోస్టులు పెడితే చంపేస్తాం ‘కదిరి టీడీపీ టికెట్ అత్తార్కే..’ అని బీసీ (పట్ర) సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులు నాయుడు ఫేస్బుక్లో పోస్టు పెట్టడంతో కందికుంట వర్గానికి కోపం వచ్చింది. సుమారు 10 మంది శుక్రవారం(10వ తేదీన) కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లిలో కాపురం ఉంటున్న శ్రీనివాసులు నాయుడు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతను ఇంట్లో లేకపోవడంతో అతని తల్లితో.. ‘నీ కొడుకు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈసారి కందికుంట అన్నకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాన్ని చంపడం ఖాయం. ఈ మాట నీ కొడుక్కు చెప్పు’ అని బెదిరించి వచ్చారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అందరూ చూస్తుండగానే దాడి.. చాంద్ వర్గీయుడైన శ్రీనివాసులు నాయుడు శనివారం పట్టణంలోని అత్తార్ లాడ్జి వద్ద ఉన్నాడని తెలుసుకున్న కందికుంట అనుచరులు పట్టపగలే అతనిపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే దాడి చేసి అంతమొందించేందుకు యత్నించారు. తర్వాత బలవంతంగా ఆటోలో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లి మరోసారి అతనిపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీనివాసులునాయుడు పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సీఐ రియాజ్ తెలిపారు. ఆయన గెలిస్తే బతకనిస్తారా..? ‘కందికుంట వెంకట ప్రసాద్ ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అనుచరులు ఇంతటి దౌర్జన్యానికి పాల్పడుతున్నారే.. ఇక ఆయన గెలిస్తే సామాన్యులను బతకనిస్తారా?’’ అని ‘పట్ర’ సామాజిక వర్గానికి చెందిన కొందరు మీడియా ముందు వాపోయారు. ‘ఈసారి టీడీపీ టికెట్ చాంద్‌కే’ అని పోస్టు పెట్టినంత మాత్రాన చంపడానికి ప్రయత్నిస్తారా..? అని వారు మండిపడ్డారు. ఒకవేళ కందికుంటకే టికెట్ ఇస్తే ఆయన ఓటమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని వారు తేల్చిచెబుతున్నారు. కందికుంట బాటలోనే అనుచరులు.. మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలింగ్‌బూత్‌లోకి దూసుకెళ్తున్న తనను అడ్డుకున్న సీఐ మధుతో కందికుంట గొడవ పడ్డారు. ఇంకోసారి టౌన్‌ప్లానింగ్ అధికారి రహిమాన్పై దాడికి దిగారు. మరోసారి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఐ మున్వర్‌పై దాడి చేశారు. తాను చెప్పినట్లు వినడం లేదన్న కారణంతో మహిళ అని కూడా చూడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రమీళను రాయలేని భాషలో దూషించారు. ఇలాంటి సంఘటనలు ఈ మూడేళ్లలోనే కోకొల్లలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న చందంగా కందికుంట అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులు, పాత్రికేయులు, అత్తార్ చాంద్‌బాషా వర్గీయులపై భౌతిక దాడులకు దిగారు. వ్యక్తిగతంగా దూషిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వారిపై పలు కేసులు నమోదు చేసినప్పటికీ.. ప్రవర్తనలో మార్పు రాలేదు. పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కఠినంగా శిక్షించాలి కదిరి టౌన్: ఫేస్బుక్లో పోస్టు పెట్టినంత మాత్రానికే శ్రీనివాసులునాయుడుపై దాడికి పాల్పడడం అమానుషమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని అత్తార్ రెసిడెన్షియల్లో ఆ పార్టీ నాయకులు సోమ్లా నాయక్, అబ్దుల్ ఖాదర్, బయప్ప తదితరులు శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కందికుంట వెంకటప్రసాద్ వర్గీయులు పద్ధతి మార్చుకోవాలన్నారు. ఇంకోసారి చాంద్‌బాషా వర్గంపైకి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఏమైనా ఇబ్బంది అయితే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి కానీ, హత్య చేయాలను కోవడం దారుణమన్నారు. దాడి చేసిన కందికుంట వర్గీయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమల్, శ్రీకాంత్ చౌదరి, చంద్రశేఖర్, షామీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పర్యటన.. మద్యానికి ఎగబడ్డ ‘తమ్ముళ్లు’
సాక్షి, చెన్నేకొత్తపల్లి(శ్రీ సత్యసాయి): ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటనకు జనాలను తరలించేందుకు టీడీపీ నాయకులు నానా తంటాలు పడ్డారు. పచ్చ కండువా వేసుకుని వస్తే మద్యంతో పాటు డబ్బు అందజేస్తామని జనాన్ని నమ్మించి మండల కేంద్రానికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే జనాలు రాకపోవడంతో చివరకు ధర్మవరం నియోజకవర్గం నుంచి తరలించారు. ఈ క్రమంలో స్థానిక దుకాణం వద్ద వాహనాలను ఆపగానే మద్యం కోసం తెలుగు తమ్ముళ్లు ఎగబడ్డారు. హంగామాపై జనాగ్రహం.. సోమందేపల్లి: చంద్రబాబు పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో కార్యకర్తులు రోడ్డుపై హంగామా సృష్టించారు. దీంతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు, ప్రయాణికులు, అసహనం వ్యక్తం చేశారు. పలువురు ఎన్‌హెచ్ ట్రోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ట్రాఫిక్ జామ్ కావడం పై ఫిర్యాదు చేశారు. రెండు అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నా.. టీడీపీ కార్యకర్తలు స్పందించకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఈ హంగామా ఏమిటంటూ మండిపడ్డారు. చదవండి: Monkey Selfie: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి.. -
తెలంగాణ సర్కార్‌పై అమిత్ షా సీరియస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు, బీజేపీ పట్ల అధికార టీఆర్ఎస్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర సర్కార్, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాజాగా రాష్ట్రంలో జరిగిన రెండు ఆత్మహత్యల ఘటనల్లో మంత్రి, మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ నేతల బెదిరింపులు, వారి ప్రోద్భలంతో పోలీసుల వేధింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నట్టు చెపుతున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం లో ఆత్మహత్యకు పాల్పడిన సాయిగణేశ్ కుటుంబీకులను షా ఫోన్లో పరామర్శించారు. అలాగే గురువారం ఎంపీ సోయం బాపూరావు, ఇతర ముఖ్యనేతలు గణేశ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించే గణేశ్ సంతాప సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు ఆత్మహత్య ల ఘటనలపై నిజానిజాలను తెలుసుకునేందుకు అమిత్‌షా ఖమ్మం, రామాయంపేటలకు లీగల్‌సెల్ బృందాలను పంపించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో పార్టీ జెండా ఎగురవేసిన సాయిగణేశ్‌పై మంత్రి, టీఆర్ఎస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీషీటు ఓపెన్ చేయడంపై అమిత్‌షా ఆగ్రహంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ నేతలు, వారికి మద్దతుగా పోలీసులు.. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం ఇటీవల ఎక్కువ కావడంతో హోంమంత్రికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే గతంలో పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్య, కొత్తగూడెంలో ఎమ్మెల్యే తనయుడు రాఘవేందర్ అరాచకాలు, అతని వేధిం పులతో నలుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య, తాజాగా చోటు చేసుకున్న రెండు ఆత్మహత్యల ఘటనల వెనుక టీఆర్ఎస్ నాయకుల వేధింపుల నేపథ్యంలో అమిత్ షా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. -
సీఎంపై అసభ్యకర పోస్టులు.. ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై కేసు
రొంపిచెర్ల(చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చనిపోయారని సంతాపం వ్యక్తంచేస్తూ వాట్సాప్ స్టేటస్‌లలో పోస్టులు పెట్టడంపై ఇక్కడి వైస్ ఎంపీపీ విజయశేఖర్‌బాబు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి కథనం మేరకు.. పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు ఎన్. నాగార్జుననాయుడు వాట్సాప్ స్టేటస్‌లలో సీఎం జగన్‌పై గురువారం సంతాప పోస్టులు పెట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వైస్ ఎంపీపీ విజయశేఖర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన టీడీపీ కార్యకర్త నాగార్జుననాయుడుపై రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగార్జుననాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తల పేర్లు వెలుగులోకి వచ్చాయి. పులిచెర్లకు చెందిన హరినాథ్, సోమలకు చెందిన వెంకటసుబ్బయ్య కూడా ఉన్నట్లు తేలింది. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. నిందితులను పీలేరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఇక సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే టీడీపీ కార్యకర్తలు అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రెడ్డీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని.. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలైన నిందితులను అరెస్టు చేయాలని కోరారు. చదవండి: అమరావతి అంటాడు.. ఇక్కడ మాత్రం మా అల్లుడికి ఇళ్లు లేదు -
కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడను : జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి : కేసీఆర్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా నేనెలాంటి స్టేట్మెంట్లు ఇవ్వననీ, మీరు కూడా మాట్లాడవద్దని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గర తల వంచుతానని, మనకిప్పుడు అదే ముఖ్యమన్నారు. మరోవైపు తన మాట, ప్రవర్తన వెనుక ఎత్తుగడ ఉంటందని స్పష్టం చేశారు. ప్రత్యేక వ్యూహంతోనే నేను మాట్లాడతానని వెల్లడించిన జగ్గారెడ్డి, తాను ఏది చేసినా నియోజకవర్గం, కాంగ్రెస్ కార్యకర్తల కోసమే చేస్తానని వ్యాఖ్యానించారు. కాగా, ఒకవైపు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. -
కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ
రాష్ట్ర, జిల్లా నేతల సమక్షంలోనే వాగ్వాదం ఖానాపూర్, జన్నారంలో పార్టీ కార్యకర్తల సమావేశం జన్నారం/ఖానాపూర్/కడెం : కడెం, ఖానాపూర్, జన్నారం మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ మండల కమిటీల సమావేశాల్లో కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రాష్ట్ర, జిల్లా నేతల సాక్షిగా రభస సష్టించారు. జన్నారం హరిత రిసార్ట్‌లో జరిగిన సమాశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు ప్రేమలత అగర్వాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, తదితరులు హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకురాలు, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ పూర్వ వైభవానికి అందరూ కషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటులో చేసిన కషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అనంతరం మండల అధ్యక్ష పదవి కోసం ఆసక్తి గల వారు పేర్లు ఇవ్వాలని కోరగా ప్రభుదాస్, సుధాకర్‌నాయక్, శ్రీనివాస్, జీవరత్నం, మాణిక్య పేర్లు ఇచ్చారు. ఈ క్రమంలో కవ్వాల్ ఎంపీటీసీ రియాజొద్దీన్ తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. కొందరూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని..అలాంటి వారిని దష్టిలో పెట్టుకుని అధ్యక్షున్ని నియమించాలని సూచించారు. దీంతో సయ్యద్ ఇసాక్ లేచి ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావని గొడవకు దిగారు. నియోజకవర్గ ఇన్చార్జి హరినాయక్, యుత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు ముజాఫర్‌అలీఖాన్, పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయక్, సహకార సంఘం వైస్‌చైర్మన్ ఇబ్రహీం ఒకరిపై ఒకరూ వాగ్వాదానికి దిగారు. దీంతో అసహానానికి గురైన మహేశ్వర్‌రెడ్డి, ప్రేమలత అగర్వాల్ బయటకు వెళ్లిపోయారు. ఖానాపూర్‌లో.. స్థానిక విశ్రాంతి భవనం ఆవరణలో జరిగిన సమావేశంలోనూ ఇరువర్గాల నాయకులు దుషణలకు దిగారు. ఎంత సర్ధిచెప్పినా వినకపొవడంతో నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. మీలో మీరు గొడవ పడడం అవసరం లేదని ప్రజలకు మనం ఇంకా మూడేళ్లు పోరాటం చేయాల్సి ఉందని ఏలేటి చురకలటించారు. ఒక్కో మండలానికి సుమారు 200 పార్టీ పదవులు ఇస్తున్నామని తెలిపారు. మండల కమిటీలోనూ మూడేసి ఉపాధ్యక్షులు, ఐదు ప్రధాన కార్యదర్శులు, గ్రామానికి ఒక్కో కార్యదర్శి పోస్టు ఇస్తామన్నారు. ఖానాపూర్ నుంచి4 పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పార్టీ పునర్నిర్మాణానికి కషి చేయండి కడెంలోని తెలంగాణ టూరిజం హరితా రిసార్ట్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడి ఎన్నికల గురించి కార్యకర్తలతో సమావేశం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుడు ఏలే టి మహేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. మండలాధ్యక్షుడి ఎన్నికల్లో అందరూ సమష్టిగా వ్యవహరించి ఒకరిని ఎన్నుకోవాలని, ముందుగా ఆసక్తిగల వారు జాబితా ఇస్తే అధిష్టానానికి పంపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే నాయకులు ఎవరికివారుగా పేర్లు ఇచ్చారు. ఫ్లెక్సీ చించివేత, తోపులాట సమావేశంలో కాంగ్రెస్ నేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఆ ఫ్లెక్సీలో హరినాయక్ ఫొటో ఎందుకు పెట్టలేదని ఆయన వర్గీయులు సమావేశానంతరం నేతలు బయటకు వచ్చాక కొందరు వారి ముందే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యకర్తలు కొందరు ఆ ఫ్లెక్సీ వద్దకు వెళ్లి చించివేశారు. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. నేతల ముందే ఇలా జరుగుతుండటంతో వారు అవాక్కయ్యారు. దీన్ని గమనించిన టీపీసీసీ కార్యదర్శి నరేశ్‌జాదవ్ తీవ్రంగా స్పందించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని లేదంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఫ్లెక్సీని తిరిగి ఎప్పటిలా కట్టాలని కోరడంతో, కార్యకర్తలు ఫ్లెక్సీని తిరిగి కట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు భవాని, నాయకులు భరత్ చౌహాన్, సతీష్‌రెడ్డి, లక్ష్మీరాజం,అలెగ్జాండర్, సుధాకర్‌రావు, సంతన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.