ఖానాపూర్ : వేదిక వద్దకు దూసుకొచి ఆరోపణలు చేసుకుంటున్న వారిని సముదాయిస్తున్న ఏలేటి
-
రాష్ట్ర, జిల్లా నేతల సమక్షంలోనే వాగ్వాదం
-
ఖానాపూర్, జన్నారంలో పార్టీ కార్యకర్తల సమావేశం
జన్నారం/ఖానాపూర్/కడెం : కడెం, ఖానాపూర్, జన్నారం మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ మండల కమిటీల సమావేశాల్లో కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రాష్ట్ర, జిల్లా నేతల సాక్షిగా రభస సష్టించారు. జన్నారం హరిత రిసార్ట్‌లో జరిగిన సమాశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు ప్రేమలత అగర్వాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు, తదితరులు హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకురాలు, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ పూర్వ వైభవానికి అందరూ కషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటులో చేసిన కషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
అనంతరం మండల అధ్యక్ష పదవి కోసం ఆసక్తి గల వారు పేర్లు ఇవ్వాలని కోరగా ప్రభుదాస్, సుధాకర్‌నాయక్, శ్రీనివాస్, జీవరత్నం, మాణిక్య పేర్లు ఇచ్చారు. ఈ క్రమంలో కవ్వాల్ ఎంపీటీసీ రియాజొద్దీన్ తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. కొందరూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని..అలాంటి వారిని దష్టిలో పెట్టుకుని అధ్యక్షున్ని నియమించాలని సూచించారు. దీంతో సయ్యద్ ఇసాక్ లేచి ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావని గొడవకు దిగారు. నియోజకవర్గ ఇన్‌చార్జి హరినాయక్, యుత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు ముజాఫర్‌అలీఖాన్, పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయక్, సహకార సంఘం వైస్‌చైర్మన్ ఇబ్రహీం ఒకరిపై ఒకరూ వాగ్వాదానికి దిగారు. దీంతో అసహానానికి గురైన మహేశ్వర్‌రెడ్డి, ప్రేమలత అగర్వాల్ బయటకు వెళ్లిపోయారు.
ఖానాపూర్‌లో..
స్థానిక విశ్రాంతి భవనం ఆవరణలో జరిగిన సమావేశంలోనూ ఇరువర్గాల నాయకులు దుషణలకు దిగారు. ఎంత సర్ధిచెప్పినా వినకపొవడంతో నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. మీలో మీరు గొడవ పడడం అవసరం లేదని ప్రజలకు మనం ఇంకా మూడేళ్లు పోరాటం చేయాల్సి ఉందని ఏలేటి చురకలటించారు. ఒక్కో మండలానికి సుమారు 200 పార్టీ పదవులు ఇస్తున్నామని తెలిపారు. మండల కమిటీలోనూ మూడేసి ఉపాధ్యక్షులు, ఐదు ప్రధాన కార్యదర్శులు, గ్రామానికి ఒక్కో కార్యదర్శి పోస్టు ఇస్తామన్నారు. ఖానాపూర్ నుంచి4 పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
పార్టీ పునర్‌నిర్మాణానికి కషి చేయండి
కడెంలోని తెలంగాణ టూరిజం హరితా రిసార్ట్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడి ఎన్నికల గురించి కార్యకర్తలతో సమావేశం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుడు ఏలే టి మహేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. మండలాధ్యక్షుడి ఎన్నికల్లో అందరూ సమష్టిగా వ్యవహరించి ఒకరిని ఎన్నుకోవాలని, ముందుగా ఆసక్తిగల వారు జాబితా ఇస్తే అధిష్టానానికి పంపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే నాయకులు ఎవరికివారుగా పేర్లు ఇచ్చారు.
ఫ్లెక్సీ చించివేత, తోపులాట
సమావేశంలో కాంగ్రెస్ నేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఆ ఫ్లెక్సీలో హరినాయక్ ఫొటో ఎందుకు పెట్టలేదని ఆయన వర్గీయులు సమావేశానంతరం నేతలు బయటకు వచ్చాక కొందరు వారి ముందే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యకర్తలు కొందరు ఆ ఫ్లెక్సీ వద్దకు వెళ్లి చించివేశారు. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. నేతల ముందే ఇలా జరుగుతుండటంతో వారు అవాక్కయ్యారు. దీన్ని గమనించిన టీపీసీసీ కార్యదర్శి నరేశ్‌జాదవ్ తీవ్రంగా స్పందించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని లేదంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఫ్లెక్సీని తిరిగి ఎప్పటిలా కట్టాలని కోరడంతో, కార్యకర్తలు ఫ్లెక్సీని తిరిగి కట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు భవాని, నాయకులు భరత్ చౌహాన్, సతీష్‌రెడ్డి, లక్ష్మీరాజం,అలెగ్జాండర్, సుధాకర్‌రావు, సంతన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.