పవన్ కల్యాణ్ - మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా నైజాం హక్కుల పంచాయతీకి శుభం కార్డు పడింది. నైజాం హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తీసుకుంది. పీపుల్స్ మీడియా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇవ్వగా సముద్రఖని దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?)
ఈ చిత్రాన్ని నైజాం ఏరియా కోసం రూ.32 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన మైత్రి వారు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే.. అదనంగా జీఎస్టీ ఉంటుంది కాబట్టి నైజాంలో బ్రో సినిమా నుంచి మైత్రీ డిస్ట్రిబ్యూటర్ సంస్థకు రూ. 38 కోట్ల వరకు షేర్ రావాల్సి వుంటుంది. ఈమేరకు వస్తేనే సేఫ్ జోన్‌లో ఉంటారు.. లేదంటే దిల్ రాజు అంచనాలే నిజం అవుతాయి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు 'బ్రో'ని కొనేందుకు ముందుకు రాలేదు. ఆయన సుమారు రూ. 30 కోట్ల వరకు డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారని టాక్. నైజాం హక్కులను రూ. 35 కోట్లకు ఇవ్వాలని పీపుల్స్ మీడియా ప్రయత్నించినా ఉపయోగం లేదు. చివరకు రూ.32 కోట్లతో మైత్రి వారు డీల్ క్లోజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.
(ఇదీ చదవండి: దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..)
ఫ్యాన్స్‌కు ఊహించని షాక్
ఈ నెల 28న థియేటర్లలోకి బ్రో సినిమా వస్తోంది. బ్రో మూవీ రన్ టైం విషయంలోనూ కొంతమేరకు నిరాశే కానుంది. ఈ సినిమా కేవలం 130 నిమిషాలు రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే పవన్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఎదురైనట్లే. అంటే కేవలం రెండు గంటల పది నిమిషాలతో మాత్రమే బ్రో రానున్నాడు. స్టార్ హీరోల సినిమా అంటేనే రెండున్నర గంటలకు పైగానే నిడివి ఉండేలా ప్లాన్ చేస్తారు డైరెక్టర్లు.. అలాంటిది మల్టీస్టారర్ సినిమాకు ఇలా తక్కువ రన్ టైమ్ ఉంటే మూవీపై ఎఫెక్ట్ చూపుతుందని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఏదేమైనా జులై 28న అసలైన బొమ్మ ఎవరికి కనిపిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment